BhaktiVed
రాముడు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం

కీర్తనరచన: భద్రాచల రామదాసు (Bhadrachala Ramadasu)Bhajana style, clap taal

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

అంతా రామమయం ఈ జగమంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు

అనంత రూపమున వింతలు సలుపగ

సోమసూర్యులును సురలు తారలును

ఆ మహాంబుధులు అఖిల జగంబులు

అండాండంబులు పిండాండంబులు

బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగా

నదులు వనంబులు నానామృగములు

విదిత కర్మములు వేదశాస్త్రములు

అష్టదిక్కులును ఆదిశేషుడును

అష్టవసువులును అరిషడ్వర్గము

ధీరుడు భద్రాద్రి రామదాసుని

కోరిక లొసగెడు తారకనామము

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Bhadrachala Ramadasu keertana; standard text as commonly sung in bhajana

ఇవి కూడా చదవండి