BhaktiVed
రాముడు

పలుకే బంగారమాయెనా కోదండపాణి

సంకీర్తనరచన: భద్రాచల రామదాసు (Bhadrachala Ramadasu)Raga Ananda Bhairavi; sung at Bhadrachalam

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

పలుకే బంగారమాయెనా కోదండపాణి

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి

కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి

ఇరువుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి

కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి

రాతి నాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి జెందితివని

ప్రీతితో నమ్మితి తండ్రి

ఎంతో వేడిన నీకు సుంతైన దయ రాదు

పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా

కరుణించు భద్రాచల వరరామదాసపోషక

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Bhadrachala Ramadasu keertana; standard text as in Ramadasu Keertanalu collections and as commonly sung

ఇవి కూడా చదవండి