BhaktiVed
రాముడు

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్రా

సంకీర్తనరచన: భద్రాచల రామదాసు (Bhadrachala Ramadasu)Raga Yadukula Kambhoji

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్రా

నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా

చుట్టూ ప్రాకారములు సొంపుగా కట్టించితి రామచంద్రా

ఆ ప్రాకారములకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

గోపుర మంటపాలు కుదురుగా కట్టించితి రామచంద్రా

ఆ గోపుర మంటపాలకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

భరతునకు బెట్టితిని పచ్చల పతకము రామచంద్రా

ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

శత్రుఘ్నునకు చేసితి బంగారు మొలత్రాడు రామచంద్రా

ఆ మొలత్రాటికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా

లక్ష్మణునకు బెట్టితి ముత్యాల పతకము రామచంద్రా

ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

సీతమ్మకు చేసితి చింతాకు పతకము రామచంద్రా

ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

కలికితురాయి నీకు పొలుపుగ జేసితి రామచంద్రా

నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా

అన్నదమ్ములకు వేరుగ మీకు సొమ్ములు జేసితి రామచంద్రా

వరరామదాసుని బంధము తీర్చవే రామచంద్రా

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Bhadrachala Ramadasu keertana (composed in the Golconda prison); standard text as commonly sung

ఇవి కూడా చదవండి