BhaktiVed
రాముడు

ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనవంశోత్తమ రామా

సంకీర్తనరచన: భద్రాచల రామదాసు (Bhadrachala Ramadasu)Raga Nadanamakriya

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనవంశోత్తమ రామా

నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా

శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా

కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా

క్రూరకర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా

దారిద్ర్యము పరిహారము చేయుము దైవశిఖామణి రామా

చిరకాలము నేను చెడి తిరిగితిని శ్రీ రఘునాథ రామా

భరితములు మా పాపము లెల్లను వదలించుము ఓ రామా

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా

భాసురముగ కరుణించి బ్రోవుము భద్రగిరీశ్వర రామా

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Bhadrachala Ramadasu keertana; standard text as commonly sung

ఇవి కూడా చదవండి