BhaktiVed
రాముడు

బంటురీతి కొలువీయవయ్య రామ

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Hamsanadam, Adi tala

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

బంటురీతి కొలువీయవయ్య రామ

తుంట వింటివాని మొదలైన

మదాదుల బట్టి నేల గూల జేయు నిజ

రోమాంచమనే ఘన కంచుకము

రామ భక్తుడనే ముద్ర బిళ్లయు

రామనామమనే వర ఖడ్గమివి

రాజిల్లునయ్య త్యాగరాజునికే

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja kriti in raga Hamsanadam; standard text as commonly sung

ఇవి కూడా చదవండి