BhaktiVed
రాముడు

జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Nata, Adi tala; the first Pancharatna kriti

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక

గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర

సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ సుర సురభూజ

దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో

బృంద గోవింద సానంద మావరాజరాప్త శుభకరానేక

నిగమ నీరజామృతజ పోషకానిమిషవైరి వారిద సమీరణ

ఖగ తురంగ సత్కవి హృదాలయాగణిత వానరాధిప నతాంఘ్రియుగ

ఇంద్రనీలమణి సన్నిభాపఘన చంద్రసూర్య నయనాప్రమేయ వా

గీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత

పురాణ పురుష నృవరాత్మజాశ్రిత పరాధీన ఖర విరాధ రావణ

విరావణానఘ పరాశర మనోహరావికృత త్యాగరాజ సన్నుత

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja, Pancharatna kriti in raga Nata; first pallavi, anupallavi and opening charanams as sung

ఇవి కూడా చదవండి