BhaktiVed
వేంకటేశ్వరుడు

అదివో అల్లదివో శ్రీహరివాసము

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Madhyamavati

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

అదివో అల్లదివో శ్రీహరివాసము

పదివేల శేషుల పడగలమయము

అదె వేంకటాచల మఖిలోన్నతము

అదివో బ్రహ్మాదుల కపురూపము

అదివో నిత్యనివాస మఖిల మునులకు

అదె చూడుడదె మొక్కుడానందమయము

చెంగట నల్లదివో శేషాచలము

నింగి నున్న దేవతల నిజవాసము

ముంగిట నల్లదివో మూలనున్న ధనము

బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

కైవల్యపదము వేంకటనగ మదివో

శ్రీవేంకటపతికి సిరులైనది

భావింప సకల సంపద రూప మదివో

పావనములకెల్ల పావనమయము

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ఇవి కూడా చదవండి