BhaktiVed
వేంకటేశ్వరుడు

అలరులు కురియగ ఆడెనదే

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Shankarabharanam; nritya sankirtana

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

అలరులు కురియగ ఆడెనదే

అలకల కులుకుల అలమేలుమంగ

అరవిరి సొబగుల అతివలు మెచ్చగ

అర తెర మరుగున ఆడెనదే

వరుసగ పూర్వదు వాళపు తిరుపుల

హరి గరగింపుచు అలమేలుమంగ

మట్టపు మలపుల మట్టెల కెలపుల

తట్టెడి నడపుల దాటెనదే

పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు

అట్టిట్టు చిమ్ముచు అలమేలుమంగ

చిందుల పాటల శిరిపొలయాటల

అందెల మ్రోతల ఆడెనదే

కందువ తిరువేంకటపతి మెచ్చగ

అందపు తిరుపుల అలమేలుమంగ

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ఇవి కూడా చదవండి