BhaktiVed
వేంకటేశ్వరుడు

జగడపు చనవుల జాజర

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Kalyani

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

జగడపు చనవుల జాజర

సగినల మంచపు జాజర

మొల్లలు దురుముల ముడిచిన బరువున

మొల్లపు సరసపు మురిపెమున

జల్లన పుప్పొడి జారగ పతిపై

చల్లే రతివలు జాజర

భారపు కుచముల పైపై కడు సిం

గారము నెరపెటి గంధవొడి

చేరువ పతిపై చిందగ పడతులు

సారెకు చల్లేరు జాజర

బింకపు కూటమి పెనగేటి చమటల

పంకపు పూతల పరిమళము

వేంకటపతిపై వెలదులు నించేరు

సంకుమదంబుల జాజర

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Annamacharya sankirtana (sringara); TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ఇవి కూడా చదవండి