BhaktiVed
రాముడు

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

సంకీర్తనరచన: భద్రాచల రామదాసు (Bhadrachala Ramadasu)Raga Kalyani

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి

జనకుని కూతుర జనని జానకమ్మ

ప్రక్కనున్న చెక్కుచెదర చక్కగా మరువ

చక్కని నీవు చెప్పు మక్కువ మేరకు

లోకాంతరంగుడు శ్రీకాంత నిను గూడి

ఏకాంతమున నేకశయ్యనున్న వేళ

అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు

నిద్ర మేల్కొన్న వేళ నెలతరో బోధించి

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Bhadrachala Ramadasu keertana; standard text as commonly sung

ఇవి కూడా చదవండి