BhaktiVed
రాముడు

క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Devagandhari, Adi tala

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ

వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా రామ

నారీమణికి చీరలిచ్చినది నాడే నే విన్నానురా

ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా

నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా

తారక నామ త్యాగరాజనుత దయతో నేలుకోరా రామ

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja kriti in raga Devagandhari; standard text as commonly sung

ఇవి కూడా చదవండి