BhaktiVed
राम

క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ

संकीर्तनरचना: త్యాగరాజ (Tyagaraja)Raga Devagandhari, Adi tala

इस पाठ की जाँच अभी बाकी है।

క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ

వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా రామ

నారీమణికి చీరలిచ్చినది నాడే నే విన్నానురా

ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా

నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా

తారక నామ త్యాగరాజనుత దయతో నేలుకోరా రామ

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Tyagaraja kriti in raga Devagandhari; standard text as commonly sung

ये भी पढ़ें