BhaktiVed
లక్ష్మి

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Kurinji; sung at Varalakshmi vratam

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు

నెలకొన్న కప్పురపు నీరాజనం

అలివేణి తురుమునకు హస్తకమలంబులకు

నిలువు మాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు

నిరతమగు ముత్తేల నీరాజనం

అరిది జఘనంబునకు అతివనిజనాభికిని

నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై

నెగడు సతికళలకును నీరాజనం

జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల

నిగుడు నిజ శోభనపు నీరాజనం

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Annamacharya sankirtana (Lakshmi); TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ఇవి కూడా చదవండి