మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. తులసీ మాత అంటేనే తులసి మొక్కకు దేవతా రూపంగా భావించి పూజించడం. హిందూ ధర్మంలో తులసీ మాతకు ప్రత్యేక స్థానం ఉంది. తులసీ అనేది పవిత్రమైన మొక్క, విశేషించి విష్ణుమూర్తికి ప్రియమైనది. తులసీ మొక్కను పూజించడం వల్ల మనకు శుభాలు కలుగుతాయని మన పురాణాలు, శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు తులసి మాత మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
తులసీ ప్రదక్షిణం
గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా ।
ఒంటి ప్రదక్షణం నీకిస్తినమ్మా ।
వైకుంఠ సన్నిధీ నాకియ్యవమ్మా ।
రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
నిండారు సంపదలు నాకియ్యవమ్మా ।
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
ముత్తైదువతనం నాకియ్యవమ్మా ।
నాల్గో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
నవధాన్య రాసులను నాకియ్యవమ్మా ।
అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
అయువైదోతనం నాకియ్యవమ్మా ।
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ।
అత్తగల పుత్రుడ్ని నాకియ్యవమ్మా ।
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా ।
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తానమ్మా ।
యమునిచే బాధలు తప్పించవమ్మా ।
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
తోడుతా కన్యలకు తోడియ్యవమ్మా ।
పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ।
పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మా ।
వెదలు పాడితే ఏకాశి మరణం ।
పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం ।
రామ తులసీ లక్ష్మీ తులసి నిత్యం ।
మా యింట వెలుగై విలసిల్లవమ్మా ।
తులసి గోవిందం
కుదుళ్ళ తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
కూర్మాము తానాలు గోవిందా రామ ।
చేసివచ్చిన ఫలము గోవిందా రామ ।
మొక్కల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
మొక లింగ తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
ఆకుల్లో తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
హర్షవల్లి తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
జంట తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
జగన్నాధ తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
పువ్వుల్ల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
వున్నెగిరి తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
కాయల్ల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
కాశీలో తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
పండిన తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
ఏడేడు లోకాలు గోవిందా రామ ।
తిరిగి వచ్చిన ఫలము గోవిందా రామ ।
మరిన్ని భక్తి గీతాలు :