BhaktiVed
రాముడు

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Sri, Adi tala; the fifth Pancharatna kriti

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

చందురు వర్ణుని అంద చందమును హృదయార

విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో

సామగాన లోల మనసిజ లావణ్య

ధన్య మూర్ధన్యులెందరో మహానుభావులు

మానస వనచర వర సంచారము నిలిపి

మూర్తి బాగుగ పొడగనే వారెందరో

సరగున పాదములకు స్వాంతమను

సరోజమును సమర్పణము సేయువారెందరో

పతిత పావనుడనే పరాత్పరుని గురించి

పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును

సల్లాపముతో స్వర లయాది రాగముల తెలియు వారెందరో

హరి గుణ మణిమయ సరములు గళమున

శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో

కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారెందరో

హొయలు మీర నడలు గల్గు సరసుని

సదా కనుల జూచుచును పులక శరీరులై

ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన

దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు

పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు

పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము

సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను

నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను

వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను

దుర్మతములను కల్ల జేసినట్టి నీ మది నెరింగి

సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారెందరో

భాగవత రామాయణ గీతాది శ్రుతి శాస్త్ర పురాణపు

మర్మములను శివాది షణ్మతముల గూఢములన్

ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి

భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి

నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు

రామ భక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనన వారెందరో

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja, Pancharatna kriti in raga Sri; text as in standard Pancharatna editions and as sung at the Tyagaraja Aradhana

ఇవి కూడా చదవండి