BhaktiVed
राम

నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా

संकीर्तनरचना: త్యాగరాజ (Tyagaraja)Raga Kalyani, Misra Chapu

इस पाठ की जाँच अभी बाकी है।

నిధి చాల సుఖమా రాముని

సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా

దధి నవనీత క్షీరములు రుచో

దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో

మమత బంధన యుత నరస్తుతి సుఖమా

సుమతి త్యాగరాజనుతుని కీర్తన సుఖమా

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Tyagaraja kriti in raga Kalyani; standard text as commonly sung

ये भी पढ़ें