BhaktiVed
రాముడు

నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Kalyani, Misra Chapu

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

నిధి చాల సుఖమా రాముని

సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా

దధి నవనీత క్షీరములు రుచో

దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో

మమత బంధన యుత నరస్తుతి సుఖమా

సుమతి త్యాగరాజనుతుని కీర్తన సుఖమా

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja kriti in raga Kalyani; standard text as commonly sung

ఇవి కూడా చదవండి