BhaktiVed
वेंकटेश्वर

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు

संकीर्तनरचना: అన్నమాచార్య (Annamacharya)Raga Hindolam

इस पाठ की जाँच अभी बाकी है।

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడువాడు

కుమ్మర దాసుడైన కురువరతినంబి

యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు

దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్రవర్తి

రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి

ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు

మచ్చిక తోడుత తిరుమలనంబి తోడుత

నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు

కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద

కరుణించి తనయెడకు రప్పించినవాడు

యెంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు

మంచివాడై కరుణ బాలించినవాడు

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ये भी पढ़ें