BhaktiVed
కృష్ణుడు

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Kurinji

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము

పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస

చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము

మితి గోవర్ధనపు గోమేధికము

సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము

గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలపైన కప్పిన పుష్యరాగము

యేలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము

పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము

బాలునివలె దిరిగీ పద్మనాభుడు

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ఇవి కూడా చదవండి