మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు జగన్నాథాష్టకమ్ గురించి తెలుసుకుందాం…
Jagannatha Ashtakam Lyrics Telugu
జగన్నాథాష్టకమ్
కదాచిత్ కాళిందీతటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః,
రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
1
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే,
సదా శ్రీమద్భృందావనవసతి లీలాపరిచయో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
2
మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ ప్రాసాదాంతస్సహజబలభద్రేణ బలినా,
సుభద్రామధ్యస్థః సకలసుర సేవావసరదో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
3
కృపా (కథా) పారావారస్సజల జలదశ్రేణిరుచిరో
రమావాణీ సోమస్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రరారాధ్యః శ్రుతిగణ శిఖాగీతచరితో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
4
రథారూఢా గచ్ఛన్ పథి మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః,
దయాసింధుర్బంధుః సకలజగతాం సింధుసుతయా
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
5
పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి,
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
6
న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం
న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం,
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
7
హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే !
హర త్వం పాపానాం వితతమపరాం యాదవపతే !
అహో దీనానాథం నిహితమచలం నిశ్చితపదం
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.
8
ఇతి శ్రీ జగన్నాథాష్టకమ్
మరిన్ని అష్టకములు