Govardhana Ashtakam In Telugu – గోవర్ధనాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోవర్ధనాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Govardhana Ashtakam Lyrics Telugu

గోవర్ధనాష్టకమ్

గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్,
గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్.

1

గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్,
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్.

2

నానాజన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః,
కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్.

3

సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్,
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్.

4

సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్
ధ్యాయంతం కృష్ణ కృష్ణతి వందే గోవర్ధనం గిరిమ్.

5

విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లవప్రియమ్,
విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్.

6

ఆనందకృత్సురాధీ శకృతసంభారభోజనమ్,
మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్.

7

కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్,
కృష్ణానన్దప్రదం సాక్షాద్వందే గోవర్ధనం గిరిమ్.

8

గోవర్దనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః,
తన్నేత్రగోచరో యాతి కృష్ణా గోవర్ధనేశ్వరః.

9

ఇదం శ్రీమర్థనశ్యామనందనస్య మహాత్మనః,
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరామ్.

10

ఇతి శ్రీ గోవర్ధనాష్టకమ్

మరిన్ని అష్టకములు

Leave a Comment