BhaktiVed
విష్ణువు

వినరో భాగ్యము విష్ణుకథ

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Hindolam / Jaunpuri

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

వినరో భాగ్యము విష్ణుకథ

వెనుబలమిదివో విష్ణుకథ

ఆదినుండి సంధ్యాది విధులలో

వేదంబైనది విష్ణుకథ

నాదించీనిదె నారదాదులచే

వీధివీధులనె విష్ణుకథ

వదలక వేదవ్యాసులు నుడిగిన

విదితపావనము విష్ణుకథ

సదనంబైనది సంకీర్తనయై

వెదకినచోటనె విష్ణుకథ

గొల్లెతలు చల్లలమ్మగ వీధుల

వెల్లవిరియాయె విష్ణుకథ

యిల్లిదె శ్రీవేంకటేశ్వరు నామము

వెల్లిగొలిపె నీ విష్ణుకథ

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ఇవి కూడా చదవండి