BhaktiVed
Venkateswara

Shrinivasa Govinda Shri Venkatesha Govinda (govinda Namalu)

KirtanCall and response: leader sings the name, all answer "Govinda"

This text is still being proofread.

శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా

నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా

పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా

దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా

శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా

గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా

దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా

పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

మత్స్యకూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా

వరాహనరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా

బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా

వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజన పోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా

అనాథరక్షక గోవిందా ఆపద్బాంధవ గోవిందా

శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా

పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా

శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా

అభయహస్త ప్రదర్శక గోవిందా మత్స్యావతార గోవిందా

శంఖచక్రధర గోవిందా శార్ఙ్గగదాధర గోవిందా

విరాజతీర్థస్థ గోవిందా విరోధిమర్దన గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా

కస్తూరితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా

గరుడవాహనా గోవిందా గజరాజరక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా

ఏడుకొండలవాడ గోవిందా ఏకత్వరూపా గోవిందా

శ్రీరామరామా గోవిందా రఘుకులనందన గోవిందా

ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాళో గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా

వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా

బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుకసంస్తుత గోవిందా

స్త్రీపుంరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షకా గోవిందా

నిత్యకల్యాణా గోవిందా నీరజనాభా గోవిందా

హాథీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా

జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపా గోవిందా

అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా

రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా

స్వయంప్రకాశా గోవిందా ఆశ్రితపక్ష గోవిందా

నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా

ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా

ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షక గోవిందా

పద్మదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా

తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా

శేషాద్రినిలయా గోవిందా శేషసాయినే గోవిందా

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

No video for this text yet.Search on YouTube
Source: Traditional Govinda namalu as chanted on the Tirumala steps and in Telugu bhajana; standard printed text

Also read