BhaktiVed
राम

నగుమోము గనలేని నా జాలి తెలిసి

संकीर्तनरचना: త్యాగరాజ (Tyagaraja)Raga Abheri, Adi tala

इस पाठ की जाँच अभी बाकी है।

నగుమోము గనలేని నా జాలి తెలిసి

నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ

నగరాజ ధర నీదు పరివారులెల్ల

ఒగి బోధన జేసే వారలు గారే యిటులుండుదురే

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో

గగనానికిలకు బహు దూరంబనినాడో

జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు

వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Tyagaraja kriti in raga Abheri; standard text as commonly sung

ये भी पढ़ें