BhaktiVed
రాముడు

నగుమోము గనలేని నా జాలి తెలిసి

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Abheri, Adi tala

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

నగుమోము గనలేని నా జాలి తెలిసి

నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ

నగరాజ ధర నీదు పరివారులెల్ల

ఒగి బోధన జేసే వారలు గారే యిటులుండుదురే

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో

గగనానికిలకు బహు దూరంబనినాడో

జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు

వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja kriti in raga Abheri; standard text as commonly sung

ఇవి కూడా చదవండి