BhaktiVed

Ayodhya Kanda Sarga 114 In Telugu – అయోధ్యాకాండ చతుర్దశోత్తరశతతమః సర్గః

भक्ति योग2024-07-02

అయోధ్యాకాండలోని 114వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యమధ్యంలో నివాసం ఏర్పరుస్తారు. ఈ సర్గలో వారికి సహాయంగా, మహర్షి అగస్త్యుడు దర్శనమిస్తాడు. అగస్త్యుడు రామునికి దివ్యాస్త్రాలను ప్రసాదిస్తాడు, వీటిని రాక్షసులను జయించేందుకు ఉపయోగించవచ్చు. మహర్షి మంత్రిద్వారా రాముడు ఆత్మశక్తిని పెంపొందించుకుంటాడు. సీత మరియు లక్ష్మణుడు అగస్త్యుని ఆశీస్సులు పొందుతారు. ఈ సర్గ రాముని ధైర్యం, శక్తి, మరియు దివ్యాశ్రయంతో ప్రతిబింబిస్తుంది. అగస్త్యుడి ఆశీస్సులతో, రాముడు తన కర్తవ్యాన్ని మరింత నిబద్ధతతో స్వీకరిస్తాడు. ఈ సంఘటనలు రామాయణ కథలో మరింత చైతన్యాన్ని కలిగిస్తాయి.

అయోధ్యాప్రవేశః

స్నిగ్ధగంభీరఘోషేణ స్యందనేనోపయాన్ ప్రభుః |
అయోధ్యాం భరతః క్షిప్రం ప్రవివేశ మహాయశాః || ౧ ||

బిడాలోలూకచరితామాలీననరవారణామ్ |
తిమిరాభ్యాహతాం కాలీమప్రకాశాం నిశామివ || ౨ ||

రాహుశత్రోః ప్రియాం పత్నీం శ్రియా ప్రజ్వలితప్రభామ్ |
గ్రహేణాభ్యుత్థితే నైకాం రోహిణీమివ పీడితామ్ || ౩ ||

అల్పోష్ణక్షుబ్ధసలిలాం ఘర్మోత్తప్తవిహంగమామ్ |
లీనమీనఝషగ్రాహాం కృశాం గిరినదీమివ || ౪ ||

విధూమామివ హేమాభామధ్వరాగ్నేః సముత్థితామ్ |
హవిరభ్యుక్షితాం పశ్చాత్ శిఖాం విప్రలయం గతామ్ || ౫ ||

విధ్వస్తకవచాం రుగ్ణగజవాజిరథధ్వజామ్ |
హతప్రవీరామాపన్నాం చమూమివ మహాహవే || ౬ ||

సఫేనా సస్వనా భూత్వా సాగరస్య సముత్థితామ్ |
ప్రశాంతమారుతోద్ఘాతాం జలోర్మిమివ నిస్వనామ్ || ౭ ||

త్యక్తాం యజ్ఞాయుధైః సర్వైరభిరూపైశ్చ యాజకైః |
సుత్యాకాలే వినిర్వృత్తే వేదిం గతరవామివ || ౮ ||

గోష్ఠమధ్యే స్థితామార్తామచరంతీం తృణం నవమ్ |
గోవృషేణ పరిత్యక్తాం గవాం పత్తిమివోత్సుకామ్ || ౯ ||

ప్రభాకరాద్యైః సుస్నిగ్ధైః ప్రజ్వలద్భిరివోత్తమైః |
వియుక్తాం మణిభిర్జాత్యైర్నవాం ముక్తావలీమివ || ౧౦ ||

సహసా చలితాం స్థానాన్మహీం పుణ్యక్షయాద్గతామ్ |
సంహృతద్యుతివిస్తారాం తారామివ దివశ్చ్యుతామ్ || ౧౧ ||

పుష్పనద్ధాం వసంతాంతే మత్తభ్రమరనాదితామ్ |
ద్రుతదావాగ్నివిప్లుష్టాం క్లాంతాం వనలతామివ || ౧౨ ||

సమ్మూఢనిగమాం స్తబ్ధాం సంక్షిప్తవిపణాపణామ్ |
ప్రచ్ఛన్నశశినక్షత్రాం ద్యామివాంబుధరైర్వృతామ్ || ౧౩ ||

క్షీణపానోత్తమైర్భిన్నైః శరావైరభిసంవృతామ్ |
హతశౌండామివాకాశే పానభూమిమసంస్కృతామ్ || ౧౪ ||

వృక్ణభూమితలాం నిమ్నాం వృక్ణపాత్రైః సమావృతామ్ |
ఉపయుక్తోదకాం భగ్నాం ప్రపాం నిపతితామివ || ౧౫ ||

విపులాం వితతాం చైవ యుక్తపాశాం తరస్వినామ్ |
భూమౌ బాణైర్వినిష్కృత్తాం పతితాం జ్యామివాయుధాత్ || ౧౬ ||

సహసా యుద్ధశౌండేన హయారోహేణ వాహితామ్ |
నిక్షిప్తభాండాముత్సృష్టాం కిశోరీమివ దుర్బలామ్ || ౧౭ ||

శుష్కతోయాం మహామత్స్యైః కూర్మైశ్చ బహుభిర్వృతామ్ |
ప్రభిన్నతటవిస్తీర్ణాం వాపీమివ హృతోత్పలామ్ || ౧౮ ||

పురుషస్యాప్రహృష్టస్య ప్రతిషిద్ధానులేపనామ్ |
సంతప్తామివ శోకేన గాత్రయష్టిమభూషణామ్ || ౧౯ ||

ప్రావృషి ప్రవిగాఢాయాం ప్రవిష్టస్యాభ్రమండలమ్ |
ప్రచ్ఛన్నాం నీలజీమూతైర్భాస్కరస్య ప్రభామివ || ౨౦ ||

భరతస్తు రథస్థః సన్ శ్రీమాన్ దశరథాత్మజః |
వాహయంతం రథశ్రేష్ఠం సారథిం వాక్యమబ్రవీత్ || ౨౧ ||

కిం ను ఖల్వద్య గంభీరో మూర్ఛితో న నిశమ్యతే |
యథాపురమయోధ్యాయాం గీతవాదిత్రనిస్వనః || ౨౨ ||

వారుణీమదగంధశ్చ మాల్యగంధశ్చ మూర్చ్ఛితః |
ధూపితాగరుగంధశ్చ న ప్రవాతి సమంతతః || ౨౩ ||

యానప్రవరఘోషశ్చ స్నిగ్ధశ్చ హయనిస్వనః |
ప్రమత్తగజనాదశ్చ మహాంశ్చ రథనిస్వనః |
నేదానీం శ్రూయతే పుర్యామస్యాం రామే వివాసితే || ౨౪ ||

చందనాగరుగంధాంశ్చ మహార్హాశ్చ నవస్రజః |
గతే హి రామే తరుణాః సంతప్తా నోపభుంజతే || ౨౫ ||

బహిర్యాత్రాం న గచ్ఛంతి చిత్రమాల్యధరా నరాః |
నోత్సవాః సంప్రవర్తంతే రామశోకార్దితే పురే || ౨౬ ||

సహ నూనం మమ భ్రాత్రా పురస్యాస్యద్యుతిర్గతా |
న హి రాజత్యయోధ్యేయం సాసారేవార్జునీ క్షపా || ౨౭ ||

కదా ను ఖలు మే భ్రాతా మహోత్సవ ఇవాగతః |
జనయిష్యత్యయోధ్యాయాం హర్షం గ్రీష్మ ఇవాంబుదః || ౨౮ ||

తరుణైశ్చారువేషైశ్చ నరైరున్నతగామిభిః |
సంపతద్భిరయోధ్యాయాం నాభిభాంతి మహాపథాః || ౨౯ ||

ఏవం బహువిధం జల్పన్ వివేశ వసతిం పితుః |
తేన హీనాం నరేంద్రేణ సింహహీనాం గుహామివ || ౩౦ ||

తదా తదంతఃపురముజ్ఝితప్రభమ్
సురైరివోత్సృష్టమభాస్కరం దినమ్ |
నిరీక్ష్య సర్వంతు వివిక్తమాత్మవాన్
ముమోచ బాష్పం భరతః సుదుఃఖితః || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశోత్తరశతతమః సర్గః || ౧౧౪ ||

Ayodhya Kanda Sarga 114 Meaning In Telugu

భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి. కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయ ములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు.
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోని ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి.

తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు. “నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామ మునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. రాముడు వచ్చేవరకూ అక్కడే వేచి ఉంటాను.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు.

వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వసిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురప్రముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు.

భరతుడు కుల గురువు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు. “గురువర్యా! మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చువరకూ ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు.”అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలనా విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునాలుగు సర్గ సంపూర్ణమ
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచదశోత్తరశతతమః సర్గః (115) >>

ये भी पढ़ें

Sai Baba Stotram Pdf, Sai Baba Stotram Lyrics in TeluguSai Baba Kashta Nivarana Stotram, Shirdi Sai Baba Stotram Lyrics శ్రీ సాయినాథాయ నమః షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే, సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం. రఘుపతి రాఘవ రాజారా…Sivapuranam Lyrics in Tamil English Hindi Telugu with Meaning, Sivapuranam Pdf Free DownloadThe Puran itself is the creation of Lord Shiva himself, the mystical wisdom crafted in words, moulded into one hundred thousand couplets or quartets (Shlokas), divided into twelve …Sivapuranam in English – Vidyeshwara SamhitaSivapuranam is a sacred Tamil text that extols the greatness of Lord Shiva. Sivapuranam in English – Vidyeshwara Samhita Vidyeshwara Samhita Thus spoke Sage Soota : ‘After many yug…Sivapuranam in English – Rudra SamhitaDevotees often recite Sivapuranam Pdf as part of their daily prayers. Sivapuranam in English – Rudra Samhita Rudra Samhita Proceeded further Sage Soota to reveal mysticism of a new…Sivapuranam in English – Shatarudra SamhitaThe verses of Sivapuranam Lyrics narrate the divine stories and attributes of Lord Shiva. Sivapuranam in English – Shatarudra Samhita Shaearudra Samhita Enumerated Sage Soota the v…Sivapuranam in English – Kotirudra SamhitaThe recitation of Sivapuranam Lyrics in English is believed to bring inner peace and spiritual growth. Sivapuranam in English – Kotirudra Samhita Kotirudra Samhita Enlightened Sage…