Ayodhya Kanda Sarga 115 In Telugu – అయోధ్యాకాండ పంచదశోత్తరశతతమః సర్గః

అయోధ్యాకాండలోని 115వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివాసం ఏర్పరుస్తారు. ఈ సర్గలో శూర్పణఖా అనే రాక్షసి రాముని చూసి ఆకర్షితురాలవుతుంది. ఆమె రాముని ప్రేమ కోసం ప్రాధేయపడుతుంది, కానీ రాముడు సీతపై తన ప్రేమను చూపిస్తూ ఆమెను తిరస్కరించుతాడు. కోపంతో శూర్పణఖా లక్ష్మణుడి వద్దకు వెళుతుంది, కానీ అతను కూడా ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖా సీతను హాని చేయడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కత్తిరిస్తాడు. ఈ సంఘటన రామాయణంలో కీలకంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రాముడు మరియు రావణుని మధ్య శత్రుత్వానికి పునాది వేస్తుంది.

నందిగ్రామనివాసః

తతో నిక్షిప్య మాతౄః స అయోధ్యాయాం దృఢవ్రతః |
భరతః శోకసంతప్తో గురూనిదమథాబ్రవీత్ || ౧ ||

నందిగ్రామం గమిష్యామి సర్వానామంత్రయేఽద్య వః |
తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా || ౨ ||

గతశ్చ హి దివం రాజా వనస్థశ్చ గురుర్మమ |
రామం ప్రతీక్షే రాజ్యాయ స హి రాజా మహాయశాః || ౩ ||

ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః |
అబ్రువన్ మంత్రిణః సర్వే వసిష్ఠశ్చ పురోహితః || ౪ ||

సుభృశం శ్లాఘనీయం చ యదుక్తం భరత త్వయా |
వచనం భ్రాతృవాత్సల్యాదనురూపం తవైవ తత్ || ౫ ||

నిత్యం తే బంధులుబ్ధస్య తిష్ఠతో భ్రాతృసౌహృదే |
ఆర్యమార్గం ప్రపన్నస్య నానుమన్యేత కః పుమాన్ || ౬ ||

మంత్రిణాం వచనం శ్రుత్వా యథాఽభిలషితం ప్రియమ్ |
అబ్రవీత్సారథిం వాక్యం రథో మే యుజ్యతామితి || ౭ ||

ప్రహృష్టవదనః సర్వా మాతౄస్సమభివాద్య సః |
ఆరురోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్వితః || ౮ ||

ఆరుహ్య చ రథం శీఘ్రం శత్రుఘ్నభరతావుభౌ |
యయతుః పరమప్రీతౌ వృతౌ మంత్రిపురోహితైః || ౯ ||

అగ్రతో గురవస్తత్ర వసిష్ఠప్రముఖా ద్విజాః |
ప్రయయుః ప్రాఙ్ముఖాః సర్వే నందిగ్రామో యతోఽభవత్ || ౧౦ ||

బలం చ తదనాహూతం గజాశ్వరథసంకులమ్ |
ప్రయయౌ భరతే యాతే సర్వే చ పురవాసినః || ౧౧ ||

రథస్థః స హి ధర్మాత్మా భరతో భ్రాతృవత్సలః |
నందిగ్రామం యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే || ౧౨ ||

తతస్తు భరతః క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య సః |
అవతీర్య రథాత్తూర్ణం గురూనిదమువాచ హ || ౧౩ ||

ఏతద్రాజ్యం మమ భ్రాత్రా దత్తం సన్న్యాసవత్ స్వయమ్ |
యోగక్షేమవహే చేమే పాదుకే హేమభూషితే || ౧౪ ||

భరతః శిరసా కృత్వా సన్న్యాసం పాదుకే తతః |
అబ్రవీద్దుఃఖసంతప్తః సర్వం ప్రకృతిమండలమ్ || ౧౫ ||

ఛత్రం ధారయత క్షిప్రమార్యపాదావిమౌ మతౌ |
ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మః పాదుకాభ్యాం గురోర్మమ || ౧౬ ||

భ్రాత్రా హి మయి సన్న్యాసో నిక్షిప్తః సౌహృదాదయమ్ |
తమిమం పాలయిష్యామి రాఘవాగమనం ప్రతి || ౧౭ ||

క్షిప్రం సంయోజయిత్వా తు రాఘవస్య పునః స్వయమ్ |
చరణౌ తౌ తు రామస్య ద్రక్ష్యామి సహపాదుకౌ || ౧౮ ||

తతో నిక్షిప్తభారోఽహం రాఘవేణ సమాగతః |
నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువృత్తితామ్ || ౧౯ ||

రాఘవాయ చ సన్న్యాసం దత్త్వే మే వరపాదుకే |
రాజ్యం చేదమయోధ్యాం చ ధూతపాపో భవామి చ || ౨౦ ||

అభిషిక్తే తు కాకుత్స్థే ప్రహృష్టముదితే జనే |
ప్రీతిర్మమ యశశ్చైవ భవేద్రాజ్యాచ్చతుర్గుణమ్ || ౨౧ ||

ఏవం తు విలపన్ దీనో భరతః స మహాయశాః |
నందిగ్రామేఽకరోద్రాజ్యం దుఃఖితో మంత్రిభిః సహ || ౨౨ ||

స వల్కలజటాధారీ మునివేషధరః ప్రభుః |
నందిగ్రామేఽవసద్వీరః ససైన్యో భరతస్తదా || ౨౩ ||

రామాగమనమాకాంక్షన్ భరతో భ్రాతృవత్సలః |
భ్రాతుర్వచనకారీ చ ప్రతిజ్ఞాపారగస్తథా || ౨౪ ||

పాదుకే త్వభిషిచ్యాథ నంద్రిగ్రామేఽవసత్తదా |
భరతః శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ || ౨౫ ||

తతస్తు భరతః శ్రీమానభిషిచ్యార్యపాదుకే |
తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా || ౨౬ ||

తదా హి యత్కార్య్యముపైతి కించిత్
ఉపాయనం చోపహృతం మహార్హమ్ |
స పాదుకాభ్యాం ప్రథమం నివేద్య
చకార పశ్చాద్భరతో యథావత్ || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశోత్తరశతతమః సర్గః || ౧౧౫ ||

Ayodhya Kanda Sarga 115 Meaning In Telugu

భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి. కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయ ములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు.
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోని ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి.

తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు. “నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామ మునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. రాముడు వచ్చేవరకూ అక్కడే వేచి ఉంటాను.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు.

వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వసిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురప్రముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు.

భరతుడు కుల గురువు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు. “గురువర్యా! మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చువరకూ ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు.”అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలనా విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూటపదునైదవ సర్గ సంపూర్ణమ
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షోడశోత్తరశతతమః సర్గః (116) >>

Leave a Comment