Sai Baba Stotram Pdf, Sai Baba Stotram Lyrics in Telugu

Sai Baba Kashta Nivarana Stotram, Shirdi Sai Baba Stotram Lyrics

శ్రీ సాయినాథాయ నమః

షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే,
సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం.
రఘుపతి రాఘవ రాజారాం, పతితపావన సాయీరాం,
ఈశ్వర్ అల్లా తేరానాం, సబ్కో సమ్మత్దే భగవాన్.

Sai Baba శ్రీ సాయినాథ సుప్రభాతమ్

షిర్డిక్షేత్రాయ విద్మహే, సాయినాధాయ ధీమహి,
తన్నో సాయిరామ ప్రచోదయాత్.
ఉత్తిష్ఠ దేవదేవేశ ఉత్తిష్ఠ నరపుంగవ,
ఉత్తిష్త సిద్ధసంసేవ్య, కర్తవ్యం భక్తరక్షణం.

ఉత్తిష్తోత్తిష్ఠ సాయీశ, ఉత్తిష్ఠ గురుపుంగవ,
ఉత్తిష్ఠయోగహృద్వాస, తైలోక్యం మంగళం కురు.

తవసుప్రభాతమభయప్రదాతా,
భవతు ప్రసన్న భక్తజన కాంక్షమానాః,
యోగీంద్ర హృదయనివాస కాంక్షమానాః,
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

శుకసనక నారద తుంబురాదయస్తే,
ధామాంతికే కరగృహీత ప్రసూనమాలాః,
తిష్ఠంతిసిర్డి శతవద్దర్శన కాంక్షమానాః,
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

సూర్యచంద్ర కిరణోజ్వల ప్రకాశమానాః,
వేంకూసా భక్తహృదయ పుటనివాస,
వేదాంతవేద్య షిరిడీశయోగి వంద్యా,
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

ఆత్రాదిసప్త ఋషయః ప్రణుతాదిదేవ,
పండరీనాధ దత్త స్వరూప విరాజమానః,
జనాబాయి నామదేవ హృదయారవింద,
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

చంద్రభాగనదీతట విహారి నివాస,
సాధుస్వరూప సకలార్తి విభూతి ప్రదాత,
దానగుణ శ్యామ తుకోజి మనోవిరాజ,
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

సాయీశ శిష్యపరమాణు శరణ్యదేవ
గుర్రప్ప భక్తపరిపాలక శాంతమూర్తి,
రాయీ – రఖుమాబాయి సంసేవిత స్వరూప
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే,
షిర్డిక్షేత్త నివాసాయ, సాయినాధాయ మంగళం.
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

భవబంధ వినిర్ముక్త భక్తానాలమభయప్రద,
సిద్ధేశ్వరాయ వంద్యాయ సాయిరామాయ మంగళం.
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

అష్ఠమూర్తి స్వరూపాయ, అష్ఠసిద్ధి ప్రదాయినే,
అమితానంద కృతాయ, షిర్డివాసాయ మంగళం.
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

రాజీవగర్భ సంకాశ, రాజీవదళలోచన,
రామశాస్తి హృద్వాసాయ సాయిరామాయ మంగళం
శ్రీసాయినాథవిభో తవసుప్రభాతం.

Sai Baba సాయిబాబాష్టకమ్

పత్రి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తా బీష్టప్రదం దేవం సాయినాధం నమామ్యహం.

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమేశుభే
ద్విజరాజం తమోఘ్నాతం సాయినాధం నమామ్యహం.

జగదుద్ధారణార్ధంయోనర రూప ధరోవిభుః
యోగినంచ మహాత్మానం సాయినాధం నమామ్యహం.

సాక్షాత్కారంచయోలభేస్వాత్మా రామోగురోర్ముఖాత్
నిర్మలంచ మమతాఘ్నాతం సాయినాధం నమామ్యహం.

యస్య దర్శన మాతేణ నశ్యంతి వ్యాధికోటయః
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాధం నమామ్యహం.

నరసింహాది శిష్యాణాం దదే యోనుగ్రహం గురు:
భవ బంధాపహర్తారం సాయినాధం నమామ్యహం.

ధనహీన దరిద్రాన్యః సమదృష్ట్రవ వశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాధం నమామ్యహం.

సమాధిస్థోஉపియో భక్తాసమభీష్టార్థ దానతః
అచింత్య మహిమానంతం సాయినాథం నమామ్యహం.

Sai Baba శ్రీ సాయినాథుని దండకం

శ్రీ సాయిబాబా! దయాసాంద్ర! త్రిమూర్త్రాత్మకా! శ్రీదత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ ధరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్దాల్చి నీ పూజలన్, నీ సేవలన్, నీ నామ సంకీర్తనల్ జేయు భక్తాళికిన్,భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యావత్తులన్ బాపి, యోగంబు,క్షేమంబుజేకూర్చి రక్షించు దివ్యస్వభావా! నమస్కార మర్పింతు, లోకంబులో జాతిభేధాలు గల్పించు కొన్నట్టివేగాని సత్యంబుగా లేవులేవం చు భక్తాళికిన్ విశ్వ(పేమంబుజాటు చందబునన్ ప్రతిగగామంబులో విఫ్రగే హంబులోజన్మమున్ గాంచి బాలుండవైయుండ,

నీ తల్లిదండ్రుల్ ఫకీరొ క్కనింగాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాధుపోష్యంబులో నుండి, యా పిమ్మటన్ వెంకుసా పేరుతో నొప్పు నాదేశముఖ్యండు, గోపాలరా యుండు,నిన్ చెంతకుజేర్చి సద్భోదనల్జేసి, జ్ఞానోపదేశంబుగావించి, నిన్నంపివేయంగ, నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండగ సంచార మున్జేసి, యష్టాదశాబ్దంబులున్ బాయమొప్పారగా, పూర్వపుణ్యంబు పక్వంబుగానొప్పు గోదావరి తీరప్రాంతంబులోనున్న షిరిడీయను గ్రామంబు నన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు

క్రిందన్ మాహాపీతితోతో నిల్చి, నీవచటన్ క్రిందగూర్చున్న, యా కొమ్మకున్ చాలామాధుర్యయుక్తం బులౌ యాకులంగూర్చి, యాచెంతనన్ పాడుబడ్డట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై నివాసంబుజేయంగ కాంక్షించి,యద్ధానికిన్

ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరునా శక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షీ బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాంచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నేన న్నంగరీతి వీలౌను? ప్రాపంచికార్ధంబులన్ గోరునవ్వారికిన్గొప్ప ఉద్యోగ ముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాధినాథుండు సర్వేశ్వరుడైన యాదేవుపై భక్తిభావంబు సూచింపుచున్.

కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరుగారంచు నాత్మానుసంధానుభావంబు బోధించు చున్, కొందరున్ బోచిపంచ ప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్న మున్ది నుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాధులోకాళికిన్ ఖర్చు గావించి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన

భారంబుసర్వంబునున్ వైచి సద్గురుడంచునినే సదా నమ్మి సేవించు జీవాళికార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబం గారమైవారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్యపాదాబ్జముల్గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మె ల్లరన్ గాపాడుతూ దీనబంధూ, మహాదేవ! దయాసింధు! శ్రీసాయినాధా! నమస్తే నమస్తే నమః

Sai Baba శ్రీ సాయిమహిమ్నాస్తోత్రం

సదా సత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్థానసంహారహేతుమ్
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

భవధ్వాంతవిధ్వంసమార్తాండ మీడ్యం
మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యమ్,
జగద్వాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

భవాం భోధిమగ్నార్ధితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియాణాం
సముద్ధారణార్థం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్సావిణం తిక్తమప్యప్రియం తమొః
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవామ్
నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

అనేకాడ్రుతాతర్క్యలీలావిలాసైః
సమావిష్కృతేశాన భాస్వత్పభావమ్
అహంభావహీనం ప్రసన్నాత్మభావమ్
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

సతాం విశ్రమారామమేవాభిరామం
సదా సజ్జనై సంస్తుతం సన్నమద్భిః
జానామోదదం భక్తభద్రప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

అజన్మాద్య మేకం పరంబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణమ్
భవద్దర్శనా త్సంపునీతః ప్రభో உహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

శ్రీసాయీశ! కృపానిధే உిలనృణాం – సర్వార్థసిద్ధిప్రద
యుష్మత్పాదరజఃప్రభావమతులం – ధాతాపి వక్తాஉక్షమః
సద్భక్యా శరణం కృతాంజలిపుటః – సంప్రాప్తితోஉస్మి ప్రభో
శ్రీమత్సాయిపరేశ పారకమలా – న్నాన్య చ్ఛరణ్యం మమ.

సాయారూపధరరాఘవోత్తమం
భక్తాకామవిబుధద్రుమప్రభుమ్
మాయమోహాహతచిత్తశుద్ధయే
చింతయా మ్యహ మహర్నిశం ముదా.

శరత్సుధాంసుప్రతిమప్రకాశం
కృపాతపత్రం తవ సాయినాథ
త్వదీయ పాదబ్జ సమార్రితానాం
స్వచ్ఛాయయా తాప మపాంకరోతు.

ఉపాసనదైవత సాయినాథ
స్తవైర్మయోపాసనానా స్తుత స్త్రమ్
రమే న్మనో మే తవ పాదయుగ్మే
భృంగో యథాஉబ్జే మకరందలుబ్ధః.

అనేకజన్మార్జితపాపసంక్షయో
భవేద్భత్పాదసరోజ దర్శనాత్
క్షమస్వ సర్వా నపరాధపుంజకాన్
ప్రసీద సాయీశ! గురో! దయానిధే.

శ్రీసాయినాథచరాణామృతపూతచిత్తా
స్తత్పాదసేవనరతా స్సతతం చ భక్తా
సంసారజన్యదురితౌఘవినిర్గతాస్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి.

స్తోత్రమేత త్పఠేద్భక్తా యోనరస్తన్మనాస్పదా సదా
సద్గురోః సాయినాథస్య – కృపాపాత్రం భవేద్ధ ఖవం.

Sai Baba శ్రీ సాయి ఊదీధారణ శ్లోకం

మహాగ్రహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం
హరత్యాసుతే ద్వారకామాయిభస్మం నమస్తే గురు శ్రేష్ట సాయీశ్వరాయ
శ్రీకరం నిత్యం శుభకరమ్ దివ్యం పరమం పవిత్రమ్
మహాపాపహరమ్ బాబా విభూతిమ్ ధారయామ్యహమ్

పరమం పవిత్రమ్ బాబా విభూతిం పరమం విచిత్రం బాబా విభూతిం
పరమార్ధ యిష్టార్ధమోక్ష్రప్రదాతం బాబావిభూతిం యిదమాశ్రయామి.

Sai Baba సాయి గాయత్రి

ఓం దిగంబరాయ విద్మహే
అవధూతాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం దిగంబరాయ విద్మహే
పాంచ జన్యాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం ఐం గురుదేవాయ విద్మహే
క్లీం పరబ్రహ్మణే ధీమహి
సౌః తన్నో గురుః ప్రచోదయాత్.

ఓం షిరిడీ వాసాయ విద్మహే
ద్వారకామాయి ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం జ్ఞానానందాయ విద్మహే
సచ్చిదానందాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం సమర్ధాయ విద్మహే
సద్గురాయ దీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం సర్వజ్ఞాయ విద్మహే
సాధు వేషాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం తత్వజ్ఞానాయ విద్మహే
తత్పదార్ధాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం సాయి రామాయ విద్మహే
సాయికృష్ణాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం ఆత్మరూపాయ విద్మహే
యోగిరాజాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

ఓం బ్రహ్మ తేజాయ విద్మహే
పరబ్రహ్మాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్.

Sai Baba శ్రీసాయినాథ దశనామస్తోత్రమ్

ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకమాయినే
తృతీయం తీర్థరాజాయ చతుర్ధం భక్తవత్సలే
పంచమం పరమాత్మయ షష్టంచ షిర్డివాసినే
సప్తమం సద్గురు నాథాయ అష్టమం అనాథనాథనే
నవమం నిరాడంబరాయ దశమం దత్తావతారనే
ఏతాని దశనామాని త్రిసంధ్య యః పఠేన్నరః
సర్వకష్ట భయాన్ముక్తో సాయినాథ గురు కృపాః

Sai Baba శ్రీసాయిబాబా ఏకాదశసూత్రములు

1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము
2. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు
3. ఈ బౌతికదేహానంతరం నేను అప్రమత్తుడను.
4. నాభక్తులకు రక్షణ నాసమాధినుండియే వెలువడుచుండును.
5. నా సమాధినుండియే నామనుష్యరూపము మాట్లాడును.
6. నన్నాశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7. నా యందు యెవరికి దృష్టికలదో, వారియందే నా కటాక్షము.
8. మీ భారములు నా పై పడవేయుడు. నేను మోసెదను.
9. నా సహాయముగాని, సలహాగాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
10. నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దము పొడసూపదు.
11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.

Sai Baba పూజా విధానము

శ్రీ మహా గణాపతయే నమః, శ్రీగురుభ్యోనమః,
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా.
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః.
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష
(నీరు శిరస్సున చల్లుకొనవలెను.)

Sai Baba ఆచమనము

ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. (ప్రతిసారి ఉద్ధరిణతో నీరు తీసుకొని త్రాగవలెను. నమస్కారము చేస్తూ ఈ (క్రింది విధంగా చదవండి.)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్ఠన్తు భూత పిశాచ, ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.

(అక్షతలుగాని నీరుగాని ఎడమవైపు వెనుకకు చల్లవలెను.)
ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓగ్ంసువః ఓం తత్సవితుర్వ
రేణ్యం ఓం తపః ఓగ్ంసత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధి
యోయోనః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భవస్సువ
రోం దురితక్షయద్వారా శ్రీసాయినాథ ప్రీత్యర్ధం…

Sai Baba సంకల్పము

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీసాయినాథ మద్దిశ్య, శ్రీసాయినాథ ప్రీత్యర్థం. శుభేశోభనే ముహూర్తే,శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పా దే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు వ్యర్రదేశే కృష్ణా గోదావరోర్మధ్యప్రదేశే సమస్త దేవతా హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్దమానేన… నామసంవత్సరే … అ యినే… ఋతౌ.. మాసే…పక్షే…తిధౌ…వాసరే… శుభనక్షతే శుభయోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్… గోత్రః… నామ ధేయః ధర్మపత్నీ సమేతః మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ రప్రీత్యర్థం – అస్మాకం సహాకుటుంబానాం క్షేమస్థెర్య, విజయధైర్య, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్థర్థమ్ – ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్థ్థర్థం శ్రీసాయినాథ (ఇష్టదేవాతా) ప్రీత్యర్థం యధాశక్తి ఏోడశోపచార పూజాం కరిష్యే (ఉదకమును తాకవలెను.)

Sai Baba కలశారాధన

తదంగ కలశారాధనం కరిష్యే
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలేతత స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్స ర్వే సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోஉధయజుర్వేదస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే
కలశాంబు సమాశితాః. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా
సింధు కావేరి జలేஉస్మిన్ సన్నింధింకురు.
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య – దేవం – ఆత్మానం – సంప్రోక్ష్య
(పువ్వుతోగాని,తమలపాకుతోగాని,కలశములో నీరు పూజాద్రవ్యముల మీదను – దేవుని మీదను చల్లుకొనవలెను.)

Sai Baba అథాంగపూజా

ఓం షిరిడీశ్వరాయ నమః పాదౌ పూజయామి
ఓం ద్వారకామాయివాసాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం భక్తవత్సలాయ నమః జంఘే పూజయామి
ఓం పత్రిగ్రామోద్భవాయ నమః జానునీ పూజయామి
ఓం సమాధి స్వరూపాయ నమః ఊరూ పూజయామి
ఓం చావిడీ నివాసాయ నమః కటిం పూజయామి
ఓం నింబవృక్ష స్వరూపాయ నమః ఉదరం పూజయామి
ఓం భక్తవశ్యాయ నమః వక్షస్థలం పూజయామి
ఓం అభయహస్తాయ నమః బాహూన్ పూజయామి
ఓం జ్ఞానప్రదాయ నమః కంఠం పూజయామి
ఓం సర్వమతసమ్మతాయ నమః వక్తం పూజయామి
ఓం వెంకూసామనోల్లాసాయ నమః దంతాన్పూజయామి
ఓం సర్వాంతర్యామినే నమః నాసికాం పూజయామి
ఓం సూర్య చంద్రాక్షాయ నమః నేత్రా పూజయామి
ఓం శ్యామ హృదయ నివాసాయ నమః శిరః పూజయామి
ఓం సాయిరామాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

Sai Baba షోడశోపచార పూజ

శ్రీసాయినాధపరబ్రహ్మణేనమః ఆసనం సమర్పయామి
(సాయినాథుని ఆవాహనము చేసి పూజించాలి.అక్షతలుంచాలి)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి
(ఉదకము సమర్పించాలి)
సువర్ణ వస్తయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంథంధారయామి
(అక్షతలతో పూజచేయాలి )

Sai Baba శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

(ప్రతి నామమునకు ముందు ఓం శ్రీసాయి అనియు చివర నమః అనియు చదువవలెను.)
1. ఓం శ్రీ సాయినాథాయ నమః
2. శ్రీ లక్ష్మీనారాయణాయ
3. శ్రీ కృష్ణరామ శివ మారుత్యాదిరూపాయ
4. శ్రీ శేషశాయినే
5. గోదావరీ తట షిర్డివాసినే
6. భక్తహృదయాలయాయ
7. సర్వహృద్వాసినే
8. భూతవాసాయ
9. భూతభవిష్యద్భావ వర్జితాయ
10. కాలాతీతాయ
11. కాలాయ
12. కాలకాలాయ
13. కాల దర్పదమనాయ
14. మృత్యంజయాయ
15. అమర్త్యాయ
16. మార్త్యాభయ ప్రదాయ
17. జీవధారాయ
18. సర్వాధారాయ
19. భక్తావన సమర్థాయ
20. భక్తావనప్రతిజ్ఞానసమరాయ
21. అన్నవస్తదాయ
22. ఆరోగ్య క్షేమదాయ
23. ధనమాంగల్యదాయ
24. బుద్ధి సిద్ధిప్రదాయ
25. పుత్రమిత్రకళత్రబంధువే
26. యోగ క్షేమవహాయ
27. ఆపద్భాంధవాయ
28. మార్గబంధవే
29. భుక్తిముక్తిస్వర్గాపవర్గాదాయ
30. ప్రియాయ
31. ప్రీతి వర్దనాయ
32. అంతర్యామినే
33. సచ్చిదాత్మనే
34. నిత్యానందాయ
35. పరమసుఖదాయ
36. పరమేశ్వరాయ
37. పరబ్రహ్మణే
38. పరమాత్మనే
39. జ్ఞాన స్వరూపిణే
40. జగత్పిత్రే
41. భక్తానాం మాతృధాతృ పితామహాయ
42. భక్తాభయర్రదాయ
43. భక్తవత్సలాయ
44. భక్తానుగ్రహకారకాయ
45. శరణాగత వత్సలాయ
46. భక్తి శక్తిప్రదాయ
47. జ్ఞాన వైరాగ్యదాయినే
48. ప్రేమప్రదాయ
49. సంసార దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయ కరాయ
50. హృదయగ్రంధి భేదకాయ
51. కర్మ ధ్వంసినే
52. శుద్ధ సత్త వస్థితాయ
53. గుణాతీత గుణాత్మనే
54. అనంత కళ్యాణ గుణాయ
55. అమిత పరాక్రమాయ
56. జయనే
57. దుర్ధర్షాక్షోభ్యాయ
58. అపరాజితాయ
59. త్రిలోకేష్వ స్కంధితగతయే
60. అశక్యరహితాయ
61. సర్వశక్తి మూర్తయే
62. సురూప సుందరాయ
63. సులోచనాయ
64. బహురూప విశ్వమూర్తయే
65. అరూపా వ్యక్తాయ
66. అచింత్యాయ
67. సూక్ష్మాయ
68. సర్వాంతర్యామినే
69. మనోవాగతీతాయ
70. ప్రేమమూర్తయే
71. సులభ దుర్లభాయ
72. అసహాయ సహాయాయ
73. అనాధనాధ దీనబాంధవే
74. సర్వభార ధృతే
75. అకర్మానేక కర్మ సుకర్మణే
76. పుణ్య శ్రవణ కీర్తనాయ
77. తీర్ధాయ
78. వాసుదేవాయ
79. సతాంగతయే
80. సత్పరాయణాయ
81. లోకనాథాయ
82. పాపనాశనాయ
83. అమృతాంశవే
84. భాస్కర ప్రభాయ
85. బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ
86. సత్యధర్మ పరాయణాయ
87. సిద్ధేశ్వరాయ
88. యోగీశ్వరాయ
89. సిద్ధ సంకల్పనాయ
90. భగవతే
91. శ్రీభక్తవశ్యాయ
92. సత్పురుషాయ
93. పురుషోత్తమాయ
94. సత్య తత్వటోధకాయ
95. కామాది సర్వాజ్ఞాన ధ్వంసినే
96. అభేదానందాను భవదాయ
97. సమసర్వమత సమ్మతాయ
98. శ్రీ దక్షిణామూర్తయే
99. శ్రీ వేంకటేశ రమణాయ
100. అద్భుతానంద చర్యాయ
101. ప్రసన్నార్తి హరాయ
102. సంసార సర్వదుఃఖక్షయాయ
103. సర్వవిత్ సర్వతో ముఖాయ
104. సర్వాంతర్భహి స్థితాయ
105. సర్వమంగళ కరాయ
106. సర్వాఖీష్ట ప్రదాయ
107. సమరస సన్మార్గ స్థాపనాయ
108. శ్రీ సమర్థ సద్గురు సాయినాధాయ నమః

ధూపమాష్రూపయామి (అగరువత్తులు చూపించవలెను.)
దీపం దర్శయామి (దీపారాధన చేయవలెను.)
నైవేద్యం సమర్పయామి (నివేదనము సమర్పించవలెను)
తాంబూలం సమర్పయామి
నీరాజనం దర్శయామి (నివేదనము సమర్పించవలెను)
మంత్రపుష్పం సమర్పయామి.

Sai Baba మంత్రపుష్పం

ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాஉన్యః పంథా అయనాయ విద్యతే.

సహస్ర శీర్షం దేవం – విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్.
విశ్వమే వేదం పురుష – స్తద్విశ్వ ముపజీవతి,
పతిం విశ్వ స్యాత్మే శ్వరగ్ం శాశ్వతగ్ం శివ మచ్యుతం,
నారాయణః పరో జ్యోతి – రాత్మా నారాయణః పరః,
నారాయణః పరం బ్రహ్మ – తత్త నం నారాయణః పరః,
నారాయణః పరో ధ్యాతా – ధ్యానం నారాయణః పరః,
యచ్చ కించి జ్జగ త్సర్వం – దృశ్యతేశశ్రయతేஉపివా,
అంతర్బహిశ్చ తత్సర్వం – వ్యాప్య నారాయణ స్థిస్సః,
అనంత మవ్యయం కవిగ్ం – సముద్రేஉతం విశ్వశంభువం,
పద్మకోశప్రతీకాశగ్ం – హృదయం చాప్యధోముఖం,
అధో నిష్ట్యాం వితస్త్యాంతే – నాభ్యా ముపరి తిష్ఠతి,
జ్వాలామాలాకులంభాతి – విశ్వ స్యాయతనం మహత్,
సంతతగ్ం శిలాభిస్తు – లంబత్యాకోశసన్నిభం,
త స్యాంతే సుషిరగ్ం సూక్ష్మం – తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితం,
తస్య మధ్యే మహానగ్ని – ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః,
సోஉర్రభు గ్వభజ న్తిష్ఠ – న్నాహార మజరః కవిః,
తిర్య గూర్ధ్వ మధ శ్శాయీ రశ్మయ స్తస్య సన్తతా,
సంతాపయతి స్వం దేహ – మాపాదతలమస్తకః,
తస్య మధ్యే వహ్ని శిఖా -అణాయోర్థా వ్యవస్థితః,
నీలతో యదమధ్యస్థా – విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ త్తన్వీ – పీతా భాస్వత్యణాపమా,
తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః.
స బ్రహ్మ స శివ స్సహరి స్సేంద్ర – స్సోஉక్షరః పరమ స్స్వరాట్.

అపాం పుష్నమ్
యోஉపాం పుష్నం వేద
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
చంద్రమా వా అపాం పుష్పం
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
య ఏవం వేద
యోஉపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అగ్ని ర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యోஉగ్నే రాయతనంవేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అగ్నే రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యేஉపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
వాయుర్వా అపా మాయాతనం, ఆయతనవాన్ భవతి
యో వాయో రాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యోஉపామాయతనంవేద, ఆయతనవాన్ భవతి
అసౌ వై తప న్నపామాయతనం, ఆయతనవాన్ భవతి
యోஉముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్
భవతి ఆపో వా అముష్య తపత ఆయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యోஉపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యః పర్జన్య స్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై పర్జన్య స్యాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యోஉపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
సంవత్సరో వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
య స్సంవత్సర స్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపో వై నక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యోஉప్పు నావం ప్రతిష్ఠితం వేద, ప్రత్యేవ తిష్ఠతి,
ఇమే లోకా అప్సు ప్రతిష్ఠితాః త దేషాஉభ్యుక్తా,
కిం త ద్విష్ణో ర్బల మాహుః కా ద్దీప్తిః కిం పరాయణం,

ఏ కో యద్ధార య ద్దేవః రేజతీ రోదసీ ఉభే,
వాతా ద్విష్ణో ర్బల మాహుః అక్షర ద్దీప్తి రుచ్యతే,
ప్రతిపదా ద్ధారయ ద్దేవః – య ద్విష్ణో రేక ముత్తమమ్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వైశశ్రవణాయ కుర్మహే,
సమే కామాన్ కామకామయ మహ్యం,
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ – మహారాజాయ నమః.
ఓం తద్బహ్మ, ఓం తద్వాయుః,
ఓం తదాత్మా, ఓం త్సత్యం, ఓం తత్
సర్వం, ఓం తత్పురోర్నమః,
అంత శ్చరతి భూతేషు -గుహాయాం విశ్వమూర్తిషు,
త్వం యజ్ఞస్వ్వం వషట్కార – స్త్వ మింద్ర స్త్రగ్ రుద్రస్త వం విష్ణుస్వం
బ్రహ్మత్వం ప్రజాపతిః, త్వం త దాప అపో జ్యోతీ
రసోஉమృతం బ్రహ్మ భూ ర్భువ స్సువ రోమ్.
ఈశాన స్సర్వవిద్యానా – మీశ్వర స్సర్వభూతానాం. – బ్రహ్మాధిపతి
ర్ర్పహ్మణోஉధిపతి – ర్భ్భహ్మా శివో మే అస్తు సదాశివోమ్.
తద్విష్ణోః పరమం పదగ్ం – సదా పశ్యంతి సూరయః,
దివీవ చక్షు రాతతం – త ద్విప్రాసో విహన్యవో,
జాగృవాంస స్సమింధతే – విష్ణో ర్య త్పరమం పదమ్.
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ – పురుషం కృష్ణపింగళం
ఊర్ధ వ రేతం విరూపాక్షం – విశ్వరూపాయ వై నమోనమః,
నారాయణాయ విద్మహే – వాసుదేవాయ ధీమహి,
తన్నో విష్ణుః ప్రచోదయాత్.
ఆకాశా త్పతితం తోయం – యథా గచ్ఛతి సాగరం,
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి.

ఇతి పుష్నమ్

పరివార సహిత శ్రీసాయినాధ పరబ్రహ్మణే నమః
ఆత్మర్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే’
పాపోஉహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమామ్ కృపయాదేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఏతత్ఫలం శ్రీ సాయినాధ సమర్పణమస్తు
(చేతిలో ఉదకము వదలవలయును)
శ్రీ సాయినాధ దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి.

Sai Baba శ్రీ సాయినాథ మంగళాశాసనం

మంగళం గురుదేవాయ, మహనీయ గుణాత్మనే
సర్వలోక శరణ్యాయ, సాయిరామాయ మంగళం.

మహారాజాధిరాజాయ, యోగిరాజాయ సాయినే
సుగుణ బ్రహ్మరూపాయ, సాయిరామ నమోస్తుతే.

శ్రీలసచ్చారునేత్రాబ్జ, శ్రీమత్కోమల విగ్రహ
సదానంద చిదానంద సాయిరామ నమోస్తుతే.

దేవ దేవ జగద్వంద్య చంద్రాదిత్య సమప్రభ,
సేవకావనలోకాత్మన్ సాయిరామ నమోస్తుతే.

భూతి భూషిత సర్వాంగ భూత్రై మప్రదాయక
అధీత వేద వేదాంగ సాయిరామ నమోస్తుతే.

ప్రజ్ఞానిధే కృపాసింధో సన్మార్గోన్మీలనవ్రత
పద్మపత్ర విశాలాక్షా సాయిరామ నమోస్తుతే.

కరుణారస పాథోధే, దరహాసల సణ్ముఖ
యోగిన్ యోగ విదాంఠేష్ఠ సాయిరామ నమోస్తుతే.

నిర్గుణ బ్రహ్మతత్వజ్ఞ నిరాకార నిరామయ
బాలభాస్కర సంకాశ సాయిరామ నమోస్తుతే.

భవబంధ వినిర్ముక్త భక్తనామ భయప్రద
మఖ భుక్ ప్రవరస్తుత్య సాయిరామ నమోస్తుతే.

కల్యాణ గుణసంపూర్ణ కరుణా వరుణాలయ
ఆపన్నాశిత మందార సాయిరామ నమోస్తుతే.

Sai Baba మంగళహారతి

స్వామి సాయినాథయ శిరిడిక్షేత్రవాసాయ
మామకాభీష్టదాయ మహితమంగళం

లోకనాథాయ భక్తలోకసంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్యమంగళం ॥స్వామి॥

భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ
ముక్తిమార్గదోధకాయ పూజ్యమంగళం ॥స్వామి॥

సత్య తత్వ దోధకాయ సాధువేషాయతే
నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం ॥స్వామి॥

Leave a Comment