BhaktiVed
वेंकटेश्वर

నానాటి బతుకు నాటకము

संकीर्तनरचना: అన్నమాచార్య (Annamacharya)Raga Revati

इस पाठ की जाँच अभी बाकी है।

నానాటి బతుకు నాటకము

కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము

నట్టనడిమి పని నాటకము

యెట్ట నెదుట గలదీ ప్రపంచము

కట్ట కడపటిది కైవల్యము

కుడిచేదన్నము కోక చుట్టెడిది

నడుమంత్రపు పని నాటకము

వొడి గట్టుకొనిన వుభయ కర్మములు

గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము

నగి నగి కాలము నాటకము

యెగువనె శ్రీవేంకటేశ్వరుడేలిక

గగనము మీదిది కైవల్యము

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ये भी पढ़ें