BhaktiVed

గజ కచ్ఛవ సంగ్రామం – Gaja kacchava Sangramam in Telugu

నీతి కథలు2024-05-20

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఏమిటంటే… గజ కచ్ఛవ సంగ్రామం నీతికథ.

గజ కచ్ఛవ సంగ్రామం

(ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన కథలున్నాయి. అందులో ఒకటి గరుత్మంతుడు తనతల్లి వినతకు దాసీత్వం తప్పించడానికి నాగుల కోరికమీద ” ‘అమృత కలశం’ తేవడానికి బయలుదేరుతాడు. దారిలో తన ఆకలితీరేదారి చెప్పమని తం. డి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు. ఆయన చెపుతున్నారు.)

ఇక్కడకు సమీపంలోనే ఒకానొక దివ్యమైన సరోవరం ఉంది. అది కలువలతో, కమలాలతో, వివిధరకముల జల పక్షులతో నయనానందకరంగా ఉంటుంది. ఆ సరోవరంలో ఒక పెద్ద కచ్చపం (తాబేలు) ఉన్నది. కొలను ఒడ్డునే ఒక మత్తగజం ఉన్నది.

ఈ ఏనుగు తన పొడుగాటి తొండంతో ఆ ఆ తాబేలును పట్టిలాగి హింసిస్తుండేది. తాబేలు ఏనుగుకాళ్ళు పట్టి లోపలకు ఈడ్చి హింస పెడ్తూ ఉండేది.

అలా అవి ఎన్నో ఏళ్ళుగా కొట్టుకుంటున్నాయి. ఆ రెండు జంతువులూ నీకు ఆహారంగా సరిపోతాయి అన్నాడు.

అదివిని గరుత్మంతుడు :
‘పితృపూజ్య వాటిమధ్య ద్వేషకారణం ఏమిటి?ఏనుగుతో తాబేలుకు పోరాటం ఎలా సంభవం’ అని ప్రశ్నించాడు.

కశ్యపుడు :
“నాయనా! ఆ ప్రాణులు రెండూ పూర్వజన్మలో మానవులు. అన్నదమ్ములుగా పుట్టాయి. పెద్దవాడు విభాసుడు. రెండోవాడు సుప్రతీకుడు.

ఇద్దరు నిత్యం ప్రాతః కాలంలోలేచి స్నానసంధ్యాదులు ముగించి, నియమ పరాయణులయి పరబ్రహ్మను ఆరాధించేవారు. అయితే వారికి కొంత ధనసంపద ఉంది. ఆ ధనంలో తనవంతు తనకు పంచిపెట్ట మున్నాడు సుప్రతీకుడు.

అన్న విభాసుడు!
‘తమ్ముడూ ! ప్రలోభం పుట్టినవారు సంపదలు పంచుకుంటారు. మనం అన్నదమ్ములం. మనకు లోభం పనికిరాదు. పైగా ధనవ్యామోహంవల్ల ద్వేషం పెరిగి కలహాలు వస్తాయి. అప్పుడు ఇరుగు పొరుగులు పరిష్కారం చెయ్యడానికివచ్చి ఈ భేదభావాలు రెచ్చగొడతారు: అందు వల్ల మనం సర్వనాశనం అవుతాం. కనక పంపకాలమాట ఎప్పుడూ మనస్సులోకి రానివ్వకు. ఇంటి పెద్దకొడుకు తండ్రితో సమానం. నువ్వు నా బిడ్డవంటివాడవు’ అని సముదాయించ బోయాడు.

సుప్రతీకుడు వినలేదు. ఏమయినాసరే పంపకాలు జరిగి తీరా అన్నాడు.
అంతలో విభాసుడికి ఆగ్రహం వచ్చి –
‘ అన్న గారి మాటమీద గౌరవంలేకుండా ఉన్న నువ్వు మహారణ్యంలో ఏనుగు గర్భానపడి, గజజన్మఎత్తు’ అని శపించాడు.
సుప్రతీకుడు మరింతకోపంతో – ‘అదే అరణ్యంలో చెరువులో తాబేలువై పుడతావు నువ్వు’ అని శపించాడు.

ఇద్దరూ పవిత్రమానవ శరీరాలు విడిచి జంతువు లయ్యారు. అది మొదలుగా ఆ ఏనుగు గట్టుమీదనిలిచి ఘీంకరిస్తుంది. తాబేలు నీటిమీద తేలి అలలు రేపుతుంది. యుద్ధం ఆరంభమవుతుంది.

అలా అవి నిర్విరామంగా పోరాడుకుంటున్నాయి ఆ చెరువులో.
ఆ ఏనుగు ఎత్తు ఆరు యోజనాలు, పొడవు పన్నెండు యోజనాలు .
తాబేలు చుట్టుకొలత పది యోజనాలు, మందం మూడు యోజనాలు,

ఈ రెండు జంతువుల సంగ్రామంలో ఆ సరోవరం, దాని పరిసర వనం గగ్గోలయి పోతున్నాయి.
ఆ చెరువులో నీరు తాగడానికి అవకాశం లేదు.
ఆ వనంలో ఏ మృగమూ హాయిగా ఆహారం తీసుకు తిరగడానికి అవకాశంలేదు.

ఆ రెండుజంతువులనూ నువ్వు ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఆ చెరువూ, వనమూ, మరికొన్ని ప్రాణులకు ఆధారమవుతాయి. ఆ ప్రాంతములో పక్షులూ, జంతువులూ స్వేచ్ఛగా తిని, తాగి, తిరుగుతాయి. వెళ్ళు, నీకు శుభం” అని తండ్రి ఆశీర్వదించాడు,

గరుత్మంతుడు తండ్రికి నమస్కారంచేసి సెలవు తీసుకున్నాడు. ఒకసారి ఆకాశానికి ఎగిరి, సరాసరి ఆ సరోవర ప్రాంతానికి వచ్చి చూశాడు.
తొండం ఎత్తి ఏనుగు ఘీంకరిస్తున్నది. తాబేలు అలలు రేపుతున్నది. ఒక్క ఊపులో క్రిందికిదిగి గరుత్మంతుడు ఒక కాలిగోళ్ళకు తాబేలును తగిలించి, రెండవ కాలిగోళ్ళతో ఏనుగును అందుకుని విశాలమైన పర్వత శిఖరానికి పోయి హాయిగా ఆరగించాడు.

ఈ విధంగా ఆ అన్నదమ్ములపోరు ముగిసింది.
ఈ కథను విన్నవారే దీర్ఘకాలంసాగే పోటీలనూ, పోరాటాలనూ గజకచ్ఛవసంగ్రామంతో పోలుస్తూంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

ఇవి కూడా చదవండి

Sri Krishnadevaraya Krta Amuktamalyada Loni katha In Telugu – శ్రీ కృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథఅది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం) మనకందించిన, పేరు పొందిన పద్యాలలో ఒకటైనా పద్యం శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్…Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథనీతికథలు శివాజీ వీరగాధలలోని కథ నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ. హీరాకానీ దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాప…Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథనీతికథలు శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ. ప్రవరాఖ్యుని కథ అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ…Asraya parityaga doshamu In Telugu – ఆశ్రయ పరిత్యాగ దోషమునీతికథలు శ్రీ స్కాంద పురాణము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము . ఆశ్రయ పరిత్యాగ దోషము ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దే…Santruptini Minchina Sampada Ledu – సంతృప్తిని మించిన సంపద లేదునీతికథలు శ్రీమద్భాగవతము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు . సంతృప్తిని మించిన సంపద లేదు సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బ…Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌నీతికథలు శ్రీమద్రామాయణం లోని నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌ . వినయం వివేక లక్షణమ్‌ పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్…