Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌.

వినయం వివేక లక్షణమ్‌

పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమళాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్లీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ట మహర్షి వద సకల ళాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్తద్రుష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద బల అతిబలాది విద్యలు మజీయు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్పులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్నమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్రు మూర్తి మహాబలళాలియైన తాటకను నేలకూల్చెను. ఒకేసారి మానవాస్త్రము ఆగ్నేయాస్త్యము ప్రయోగించి సుబాహుని సంహారము చేసి మారీచుని నూరుయోజనముల దూరములో పడవేశను. మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విజిగెను. శ్రీ రాముడొక్కడే ప్రహరార్శకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి పధ్నాలుగు వేలసేనలను సంహరించెను.

ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలీదు. ఆ దయార్హ హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘటము. శ్రీ రాముని సైన్యము సముద్హ లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్బ్ఞుడైన రాముడు ఉపాయము ఎజిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్ర్తములనైనను శుష్కింప చేయగలదు. అయినను సముద్దునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్మబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద అప్పటికి పట్టుమని 30 రోజులుకూడాలేవు. అయినను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్పార్భింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్సెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్టార్భించెను. ఇట్లు 3 దివసములు సముద్దునికై ప్టార్భించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి. వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాశువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్వుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్పముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం జౌషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. శ్రీ రాముడు ఎంత బలళాలి అయిననూ సముద్చునివై బలప్రదర్శనము చేయక వినయముతో ప్పార్శించెను. వినయము సజ్బనుని భూషణము.
  2. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణము. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.
  3. దయాగుణం ఉత్తమగుణము. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.
  4. సజ్బనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్దుని పై కినుకబూని అస్తృం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment