మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్యా దీక్ష నీతికథ.
విద్యా దీక్ష
(ఈ కథ ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో యితర వ్యవహారాల మీద మనసు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అనికదా ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ)
చాలా రోజుల క్రితం మాట !
కశ్యపుడు అనేముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు.
ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండే వారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు వీరు గెలిచేవారు.
అలా సాగుతోంది.
అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు. దేవతల గురువు బృహస్పతి. ఆ రాక్షసగురువు చాలాకాలం తపస్సు చేసి మృతసంజీవనీ అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బ్రతికించేవాడు.
అప్పటికింకా దేవతలు అమృతపానం చెయ్యలేదు. కనుక వారు చచ్చిపోయేవారు. అది చూచి బృహస్పతి తనకుమారుడయిన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవనీ విద్య నేర్చుకురమ్మని పంపాడు.
కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి:
‘శ్రీగురుభ్యోనమః ‘ అని పాదాలమీద వ్రాలి:
‘నేను అంగీరస వంశ్యడను, బృహస్పతి తనయుడను. నన్ను కచుడు అని పిలుస్తారు. మీ వద్ద విద్యాత్యాసానికి వచ్చాను’ అన్నాడు.
శుక్రాచార్యులు ఆ కుర్రవాని వివయానికి చాలా సంతోషించి: ‘నాయనా! చాలా ఆనందం’ అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఉండమన్నాడు.’
కచుడు రోజూ సూర్యోదయంకాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి గురుశుశ్రూష చేస్తున్నాడు.
శుక్రాచార్యులవారికి దేవయాని అనే కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయస్సు వదహారు దాటింది.
ఆ పిల్లకి కచుడు మీద మనసు పడింది. అనేకవిధాల తన ప్రేమను వ్యక్తంచేసేది. కచుడికి తవ విద్యాత్యాసం తప్ప మరోదృష్టి లేదు. పయిగా గురువుగారి కూతురు కమక సోదరభావంతోనే చూపేవాడు.
ఇలా ఉండగా –
రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు.
‘ దేవతల గురువయిన బృహస్పతి కొడుకు మన గురువులవద్ద విద్యా భ్యాసానికి వచ్చాడు? శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు? ఓహో! మన గురువుగారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది.
అది వీడు నేర్చుకు వెడితే మన వంశానికే ప్రమాదం. కనక వీట్టి అడవిలో చంపి పారేద్దాం’ అని నిశ్చయించారు.
గురు సేవాభావంతో అడవిలో అవులను మేపి వస్తున్న కచుడిని చంపేశారు.
ప్రొద్దు గ్రుంకింది.
చీకటి ముదురుతోంది.
రోజూ సాయం సంధ్యావేళకు ఆశ్రమంచేరే కచుడు అప్పటికీ రాక పోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితోచూచి, జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవనితో కచుని బ్రతికించాడు.
అది విన్న రాక్షసులకు కడుపు మండి పోయింది. బాగా ఆలో చించారు. కచుని సంహరించి కాల్చి ఆ బూడిద కలిపిన కల్లు తెచ్చి శుక్రాచార్యులకు వివయంగా అందించారు.
ఆయన వెనుక ముందు ఆలోచించకుండా ఆ సురాపానం చేశాడు. వాడు వెళ్ళారు.
మళ్ళీ చీకటి పడింది.
ప్రేమపాశంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చింది.
ఆయన జాలివడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది.
‘అమ్మా! ఈ రాక్షసులు వరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన కల్లు నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్బుకు రావాలి. వచ్చాక నన్ను బ్రతికించాలి. అంటే లోపం సూక్ష్మ అణువుగా ఉన్న ఆ ప్రాణికి నా విద్య బోధించాలి.
వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు, అని పద్మాసనం వేసి, లోపల ఉన్న కచుని ప్రబోధించి మృత సంజీవనీ మంత్రం ఉపదేశించాడు.
కచుడు ఆయన ఉదరం చీల్చుకు వచ్చాడు.
వస్తూనే తాను నేర్పిన విద్యతో గురువుగారిని జీవింపజేసి ఆయన వద్ద సెలవు తీసుకు వెడుతున్నాడు.
వెను వెంట వచ్చి దేవయాని :
‘ఏమయ్యా ః ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచి పెడ కావా’ అంది.
‘ సోదరి గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లిలివి ‘, ‘ అన్నాడు.
దేవయానికి కోపం వచ్చి :
‘ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగ పడదు బా’ అంది,
‘ సోదరీ ! విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా! ఈ మృత సంజీవని నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడక పోయినా నేను బోధిం చిన వారికి ఉపయోగపడుతుంది వెళ్ళు’, అని దేవలోకం చేరాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్య వివేక హేతువు నీతికథ.
విద్య వివేక హేతువు:
(ఈ కథ ఆరణ్య పర్వంలో ఉంది)
విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు.
ఎంతటి మహా విద్వాంసుడై నా వందితో వాదించి గెలవలేక పోతు న్నాడు. అందరినీ ఓడించిన అహంకారంతో ఉన్న నంది:
“నాతో వాదించి ఓడినవారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’, అని ప్రకటించాడు.
అలా ఎందరినో నదిలో తోయించి సగర్వంగా ఉన్నాడు వంది..
ఆ రోజులలో
ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతులలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు.
అప్పటికి గర్భవతిగా ఉంది కహోడుని భార్య సుజాత, భర్త మరణవార్త విని ఎంతో దుఃఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకో లేక విచారాన్ని విడనాడి జీవితం గడుపుతూ కొంత కాలానికి కుమారుని కన్నది.
ఆ బాలుడు తండ్రి శాపంవల్ల ఎనిమిది వంకరలతో పుట్టాడు. అందువల్ల అందరూ వానిని ‘అష్టావక్రుడు’ అని పిలిచేవారు.
పన్నెండు సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి, వందితో వాదనకు బయలుదేరి విదేహ రాజ్యానికి వచ్చాడు.
‘నిండా పన్నెండేళ్ళు రాని బాలుడు వంటివంటి మహా విద్వాంసు నితో వాదించడమా !’ అని ద్వారపాలకుడు నిరోధించాడు.
‘ద్వారపాలక విద్యకు వయస్సుతో నిమిత్తం లేదు. జుట్టు నెరసి వయస్సు ముదిరినవాడు మహా విద్వాంసుడని అనుకోకు”, అని వాదిస్తుండగా అటు వచ్చిన జనక మహారాజు:
‘ఆర్యా! మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాలవలె వెల వెల బోతుంటారు’ అనగా అష్టావక్రుడు :
‘ మహారాజా ! నా వంటి వాడెవరూ మీ సభా భవనానికి వచ్చి ఉండరు, అన్నాడు.
‘ అయితే ముప్పది అవయవాలతో, పన్నెండు అంశలతో ఇరువది నాలుగు పర్వాలతో మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వుః ‘ అని జనకుడు ప్రశ్నించాడు.
“మహారాజా ! ముప్పది దినాలు అవయవాలు, అమావాస్యలు పన్నెండు, పూర్ణిమలు పన్నెండు, ఈ ఇరువది నాలుగు పర్వాలు, పన్నెండు నెలలు అంశలు, మూడు వందల అరువది రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమయిన కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక’, అన్నాడు.
జనకుడు: అడు గుర్రాలజంటవలె కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీద పడే ఆ రెండిటినీ ధరించే దెవరు ?
అష్టా : మహారాజా ! అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్వాలవల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది.
జన: కన్ను మూయకుండా నిద్రించేది ఏది?
అష్టా: నిరంతరం నీటిలో ఉండే చేప.
జన: జన్మించినా చైతన్యం లేనిది ఏది?
అష్టా: పక్షులు పెట్టే గ్రుడ్డు.
జన: హృదయం లేనిదేది?
అషా : బండరాయి.
జన: ఓవేదవేత్తా! ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా తీసుకు వెళ్ళాడు.
చూశాడు మహావిద్వాంసుడు వంది. అష్టావక్రుడు ఆయనను సమీపించాడు.
వంది: బాలకా! నిద్రపోయే సింహాన్ని లేవకు. కాలకూట విషభరిత మయిన పాము పడగ మీద కాలు పెట్టకు,
అష్టా: : మహారాజా ! పర్వతాలన్నీ మైనం కంటె చిన్నవి. లేగదూడలు ఆంబోతుకంటే చిన్నవి. రాజులందరూ జనకునికంటె అల్పులు. దేవతలలో యింద్రుని వలె, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం.
అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృ దేవరావతి, యముడొక్కడే, అని ప్రారంభించాడు, వంది.
అష్టా: నంది ! ఇంద్రుడు- అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు, అలానే పర్వత నారదులు. అశ్వనీ దేవత లిద్దరు. రథా నికి చక్రాలు రెండు. సతీపతులు ఇద్దరు..
వంది: ప్రాణికోటి అంతా దేవమానవ తిర్యగ్రూపాలు మూడు ధరి స్తుంది. ఋగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యా హ్నిక సాయం సవనాలు మూడు. స్వర్గ మర్త్య నరకాలు మూడే లోకాలు, అగ్ని, సూర్య చంద్రులు ముగ్గురే జ్యోతి స్వరూపులు.
అష్టా: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వావవస్థ, సన్న్యాశ్రమాలు నాలుగు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు, దిక్కులూ నాలుగే హ్రస్వ, దీర్ఘ, ప్లత, హల్లు భేదాలతో శబ్దం నాలుగు రకాలు. వేరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రగాలు.
అష్టా : బాలకా! అగ్ని స్థాపన వేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరుఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మన స్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞలు ఆర
అష్టా: తులాదండాన్ని బంధించే సూత్రాలు ఎనిమిది. సింహాన్ని సంహరించే శరభ మృగానికి ఎనిమిది పాదాలు. యజ్ఞశాల సమీ పంలో యూవస్థంభానికి రోజులు ఎనిమిది. వసువులు ఎవ మండుగురు.
వంది: పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మిది. ప్రకృతి, పురుష, అహంకార, మహత్తత్త్వ, పంచతన్మా త్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మిదే అక్షరాలు. గణితశాస్త్రం యావత్తూ తొమ్మిది అంకెలమీద ఆధారపడి ఉంది.
అష్టా: దిక్కులువది. గర్భంలో శివుడు పది మాసాలుంచాడు. రోగి, దరిద్రుడు శోకార్హుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయిన వాడు, పిచ్చివాడు, కాముకుడు, అనూయాపరుడు, మూర్ఖుడు మొండివాడు ఈ పదిమంది నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు, మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రిసోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ పది మంది పూజింప దగినవారు.
అష్టా: పసివాడా। మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకి అక్షరాలు పన్నెండు. ప్రాకృతయజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యులు పన్నెండుగురు.
వంది: తిథులలో త్రయోదశి మంచిది. భూమిమీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ఆరంభించగా,
అహ్జైాన్నకుడు: మహారాజా! మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విర మించాడు. మిగిలింది నేను చెబుతా.
కేశి దానవునితో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేసాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు పదమూడక్షరాల పరిమితితో నడుస్తుంది. అనగా, పంది తల వంచేశాడు.
నియమానుసారం పంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా, వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలెనే పసివారి ప్రజ్ఞముందు పతనమయిపోతారు.
విద్య వినయాన్ని కలిగించాలికాని గర్వ హేతువు కారాదు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సుందోపసుందులు నీతికథ.
సుందోపసుందులు
(ఇద్దరు తమలో తాము పోట్లాడుకొని ఇద్దరూ నాశనమువ కాన్ని సుందోప సుందన్యాయ మంటారు.)
ఈ నాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహానగరాలలో కూడా భారత సంస్కారం కలవారు ఈ సామెత వాడుతుంటారు. సుందోప సుందుల వలె కొట్టుకుంటున్నారు అని. ఆ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు వినిపిస్తున్నాడు.
ధర్మరాజా !
హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల కథ ఎరుగుదువు కదా ! వారి వంశ ములో కుంభుడనే పేరు గల రాక్షసుడుండేవాడు. వీడు మహాబలశాలి. ఈ బలశాలికి ఇద్దరు కుమారులు.
వారు మహా భయంకర దేహులు. పెద్దవాడు సుందుడు. వాడి -తమ్ముడు ఉపసుందుడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏ విషయంలోనూ వారికి అభిప్రాయ భేదం లేదు.
నిరంతరం ఒకరినొకరు విడువకుండా కలిసి తిరిగే వారు.
అలా ఉండగా వారికి తమ పూర్వీకుల వలె త్రిలోకాలనూ జయిం చాలనే కోరిక కలిగింది. కలగగానే వింధ్యపర్వతం చేరి ఆ గిరి శిఖరం మీద పద్మాసనం వేసి తపస్సు ఆరంభించారు. అన్నపానాలు విడిచేశారు.
వాయువునే ఆహారంగా గ్రహిస్తూ, ఒంటికాలి బొటన వేలుమీద నిలబడి తీవ్రదీక్షతో సాధన చేస్తున్నారు. ఆ తపస్సు వేడికి మంటలు లేచేవి. ఎలా అయినా ఆ సోదరుల తపస్సుకు భంగం కలిగించాలని దేవ తలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారు చలించలేదు. ధ్యా ధిలోనే ఉన్నారు.
బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
ప్రపంచంలో అస్త్ర శస్త్ర విద్య అంతా తమకు రావాలనీ, ఇంద్ర జాల మహేంద్రజాల విద్యలు తమ అధీనంలో ఉండాలనీ, తమకు తమకు వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరెవరివల్ల చావు రాకూడ దనీ కోరుకున్నారు.
అనుగ్రహించి బ్రహ్మ అదృశ్యమయ్యాడు.
వారు తమ నగరం చేరి సేవలతో విజయ యాత్రకు బయలు దేరారు.
ముందుగా అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూలోకం, నాగలోకం, యక్షరాక్షప లోకాలన్నీ వశపరుచుకున్నారు.
పెద్దపులి రూపాలతో, సింహాకారాలతో గుహలలో దూరి అక్కడ తపస్సు చేసుకునే మునులను హింసించే వారు.
ఆశ్రమాలలో ప్రవేశించి యజ్ఞసామగ్రిని విరిచి, విసిరేసే వారు. అలా ప్రపంచం అంతటా తిరుగుతూ సాధు, సజ్జన హింసతో, వర స్త్రీ బలాత్కారాలతో జీవితం నడుపుతున్నారు.
ప్రపంచంలో ఏ ప్రాణికి శాంతి లేదు. అంతటా దీనారావాలు, హాహాకారాలు. ఏ పూట ఎవరికి కీడు మూడుతుందో తెలీదు. ఏ రాత్రి ఏ నగరం శ్మశానం అవుతుందో తెలీదు.
అలా భయానకంగా ఉన్న సమయంలో దేవతలూ, మునులూ కలిసి బ్రహ్మను ప్రార్థించగా ఆయన విశ్వకర్మను పిలిచి:
మహాశిల్పీ ప్రపంచంలో ఎంతటి వారి నయినా సరే కనుచూపుతో ఆకర్షించి పాదాక్రాంతం చేసుకోగల సుందరీమణిని సృష్టించు అన్నాడు. ఆలోచించాడు విశ్వకర్మ.
ఇంతకుముందు నిర్మించిన సుందరరూపాలన్నింటినించి అందాన్ని నువ్వుగింజంత (శిలాంశ) తీసి ఒక అందగత్తెను రూపొందించాడు.
కాలిగోరు నుంచి కమరెప్పల వరకూ అంతా లావణ్యం జాలువారు తున్నది.
తిగాంశగా తీయడం వల్ల ఆమెకు తిలోత్తమ అని పేరుపెట్టారు.
అది వింధ్యగిరి శిఖరం.
అక్కడ విశాలమయిన సాలవృక్షం.
ఆ చెట్టు నీడలో రకరకాల పానపాత్రలు.
కనులు మిరుమిట్లుగొలిపే కామినీ జనం.
హంసతూలికాతల్పాలు.
వింజామరలతో సుందరీమణులు.
కమ్మని కంఠాలతో పాటలు.
ఆ పాటలకు అనుగుణంగా అందెల రవళులతో, గాజుల గలగలలతో, చూపుల మిలమిలలతో సుందరాంగుల నాట్యాలతో ఆ సోదరు లిద్దరూ పరమ సంతోషంగా ఉన్నారు.
అటువంటివారి కంటికి అల్లంత దూరంలో వయ్యారంగా ముట జారుస్తూ కనులు త్రిప్పుతూ, తన అందాన్ని ఒలకబోస్తూ’ నిలిచింది. తిలో త్తమ,
అంత మైకంలో ఉన్న అన్నదమ్ములిద్దరూ ఆ సుందరిని చూస్తూనే కోరమీసం ఎగదువ్వుతూ, పానపాత్రలు జారవిడిచి, ఆశ నిండిన కను లతో, రాచఠీవితో, ఆమె వయిపే అడుగులు వేశారు.
ఇద్దరూ దగ్గరగా చేరారు,
ఆమె భయాన్నీ, సిగ్గునీ, అభినయిస్తూ, జారుతున్న పైట సరి జేస్తున్నట్టు నటించి, వెనుదిరిగి ఓరచూపుతో యిద్దరినీ రెచ్చగొట్టింది.
ఒకడు కుడిచెయ్యి అందుకుంటూండగా రెండవవాడు ఎడమచెయ్యి పట్టుకున్నాడు.
బలమడం, ధనమదం, రాజ్యమదం, వరమిదం ఇన్నిటికీ మద్యపానమదంలోవున్న వారిని చూసి తిలోత్తమ ఒక కంటితో నుందుని రెండవ కంటితో ఉవసుండుని రెచ్చగొట్టింది.
“తమ్ముడూ! అన్నగారి భార్య తల్లితో సమానం. నువ్వు దీన్ని తాకకూడదు ” అన్నాడు సుందుడు.
“తమ్ముని భార్య కోడలితో సమానం. నువ్వు దూరంగా వెళ్ళు” అన్నాడు ఉవసుందుడు.
మీరిద్దరూ తేల్చుకోండి అని దూరంగా నిలబడి యిద్దరి వయిపూ కోరచూపులే విసిరింది తిలో త్తమ.
అంతలో గదాదండాలు అందుకున్నారు.
ఆ గదా ఘాతాలతో వారి శరీరాలు చీలి రక్తధారలు సెల వీరుల్లా ప్రవహించాయి.
అంతే పర్వత దేహులయిన అన్నదమ్ములిద్దరూ నదీ ప్రవాహంలో బండరాళ్ళవలె నేల కూలారు, అని నారదుడు కథ ముగించి,
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కులం కాదు గుణం ప్రధానం నీతికథ.
కులం కాదు గుణం ప్రధానం
(ఇది ఆరణ్యపర్వంలో మార్కండేయ మహాముని చెప్పిన కథ. దీన్నిబట్టి, కుల వర్గ విద్వేషాలు ఈవాటి నాగరిక సమాజంలో బలిసినంతగా ప్రాచీన కాలంలో ఉండేవి కావనీ, మంచి విషయం ఎవరి దగ్గర ఉన్నా గ్రహించవలసినదేనని తెలుసు కోవాలి.)
కులం కారణంగా ఉన్నత స్థానాలు, మర్యాదలు యివ్వడం ఈ వాడు పెరిగినంతగా భారతకాలం నాడు లేనేలేదు. గుణం ప్రధానంగా మనిషిని మర్యాద చేయడం అందరూ ఎఱిగిందే. అటువంటి అంశం
ఒకానొక గ్రామానికి సమీపంలో ఒక వనం. ఆ వపంలో ప్రశాంత ప్రదేశం. అక్కడొక చిన్ననది. ఆ నది ఒడ్డునే చక్కని నిడనిచ్చే పెద్ద చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని ఒక విపుడు తపస్సు చేసుకుంటూ, మధ్యాహ్నం కాగానే గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేసి జీవితం గడుపు తున్నాడు.
అలా తపస్సు చేసుకునే రోజులలో …..
ఓకనాడు
ఆయన భిక్షాటనకు లేచే సమయంలో చెట్టుమీది కొంగ రెట్ట వేసింది. అది ఆయన మీద పడింది.
అంతలో ఆయనకు చాలా కోపం వచ్చింది. అంతే: కన్నులు ఎర్రజేసి పై కి చూశాడు.
చూసిన మరుక్షణంలో ఆ కొంగ మాడి పడిపోయింది.
ఆయన యథాప్రకారం గ్రామంలో భిక్షకువెళ్ళి, ఒక యింటి గుమ్మంలో నిలబడి: ‘భవతి భిక్షాం దేహి”, అన్నాడు.
ఆ మాట చెవిని పడగానే యింట్లోని గృహలక్ష్మి ఆయనకు భిక్ష తేవడానికి వంటయింటి వయిపు నడిచింది.
అదే సమయానికి ఆమె భర్త దూర ప్రయాణం చేసి యింటికి వచ్చాడు.
భర్తన చూడగానే ఆమె చల్లని నీటితో ఆయన పాదాలు కడిగి, విసన కర్రతో కొంతసేపు విసిరి, భోజనం చేయించి, పరుండాక, భిక్ష తీసుకుని వీథిలోకి వచ్చింది.
అక్కడ నిలబడ్డ ముని కోపంగా చూశాడు. అప్పుడామె :
“స్వామీ! మీ కోపానికి మాడిపోయే కొంగను కాను. భర్తను మరెవరి విషయమయినా చూసుకుంటాను. పతి
సేవను మించిన పరమార్థం వేరే లేదు, నాకు ‘
అని నిలబడింది.
అప్పుడా ముని తెల్లబోయి :
‘అమ్మా! ఎక్కడో, అడవిలో జరిగిన నా కథ నీకు ఎలా తెలి సింది ? నాకు జ్ఞానబోధ చెయ్యి తల్లీ’, అని ప్రార్థించాడు.
గృహిణి : ‘మునీశ్వరా ! ఇక్కడకు కొద్ది దూరంలో మిథిలానగరం ఉంది. అక్కడ ఒక బోయవాడు మాంస విక్రయం చేసి జీవితం గడుపు తున్నాడు. వానిపేరు ధర్మవ్యాధుడు. ఆయన మీకు సర్వవిషయాలూ బోధిస్తాడు, వెళ్ళండి’, అంది. ఆయన బయలుదేరి నడిచి నడిచి మిథిలా నగరం చేరాడు.
నగరంలో అడుగు పెడుతూనే ధర్మవ్యాధుని నివాసం గురించి అడిగి, తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరాడు.
బడ్డాడు.
అక్కడ రకరకాల జంతువుల మాంసాలు చూసి దూరంగా నిం
వచ్చిన మునిని అంత దూరంలో చూసి ధర్మవ్యాధుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి:
‘ ఆర్యా ! ‘ ప్రణామాలు. మిమ్ము నా దగ్గరకు పంపిన పతివ్రతా శిరోమణి క్షేమంగా ఉన్నదా ? అని అడిగాడు.
వచ్చిన మునికి మతిపోతోంది.
‘అక్కడ ఆ యిల్లాలు కొంగ విషయం చెప్పింది. ఈ ధర్మ వ్యాధుడు ఆ ప్రతివ్రత క్షేమం అడిగాడు. ఇంతకాలంగా తపస్సు చేసినా ఏ శక్తి సాధించ లేకపోయాము,
ఆవిడ పతివ్రత కనుక ఆ వ్రత దీక్షతో దూరదృష్టి వచ్చి ఉండవచ్చు.
జంతువుల మాంసం అమ్ముకునే ఈ కసాయి వానికి ఇంత శక్తి ఎలా వచ్చింది’ అని ఆలోచనలో పడ్డాడు.
అది గ్రహించి ధర్మవ్యాధుడు :
‘స్వామీ! ఈ మాంసపు వాసన మీరు భరించలేరు. రండి మా యింటికి వెడదాం. నాకు యింతటి శక్తి ఎలా వచ్చిందని ఆలోచిస్తు న్నారు కదూ ! ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను ”
అని వినయంగా యింటికి తీసుబవెళ్ళాడు. వెడుతూనే వాకిట్లో మంచంమీద పడుకున్న, ముసలి తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన యోగ క్షేమాలు విచారించి, లోపల గడపలో ఉన్న తల్లికి నమ స్కరించి, ఆవిడకు సేవచేసి :
‘స్వామీ! ఇదే నేను చేసేవి. మనం ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు జరిపినా, తల్లి దండ్రులను సేవించుకోకపోతే ప్రయోజనం లేదు.
తొమ్మిది మాసాలు గర్భంలో మనలను భరించి, ప్రసవవేదనపడి, మనకు జన్మనిచ్చి, నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ మన ఆరోగ్యం కోపం ఆ తల్లి ఎన్నో అవస్థలు పడుతుంది.
అటువంటి తల్లి ఋణం ఎన్ని సేవలు చేసినా తీరుతుందా?
అలానే మన భవిష్యత్తుకు పునాదులు వేసి, మనకోసం ఎన్నో బాధలు పడే తండ్రి ఋణం కూడా తీరదు.
అయినా వారిని సేవించుకోవడం వల్ల కొంత ఋణ భారం తగ్గుతుంది.
వీరిని సేవించు కోవడం కంటె నేను చేసే సాధన ఏమీలేదు. దాని వల్లనే నేను సుఖంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. తల్లి దండ్రులను సేవించుకుంటూ ఆలుబిడ్డలను రక్షించుకుంటూ జీవితం నడుపుతున్నాను. అంతే! మరేంలేదు. మీకు మరో సందేహం కలిగి ఉంటుంది. మాంసం అమ్ముకుని బ్రతుకుతున్నాను కదా! అది జీవహింస కాదా, దానిపిల్ల పాపం కదా అని. ఇక్కడ తమ కొక పరమ రహస్యం చెప్పాలి.
అదీ ధర్మ సూక్ష్మం అంటే –
ఈ భూగోళంలో ప్రాణికోటి అంతా ఒక దానిమీద ఆధారపడి మరొకటి జీవిస్తున్నది. రెక్కలు విప్పుకు ఎగిరే పక్షులూ, నాలుగు కాళ్ళ జంతువులూ యివే ప్రాణులని మీరు అనుకుంటున్నారు. మీరు తినే ధాన్యం, కాయగూరలు, పళ్ళు అన్నింటిలోనూ జీశం ఉన్నది. అయితే అవి పక్షులవలె ఎగరడం లేదు కనక జీవం లేదనుకోవడం న్యాయమా।
జీవి బ్రతికి, పెరగడానికి మరోజీవం బలికాక తప్పదు.
అలాకాదు, యిదే జీవహింస అంటారా!
నేను మానినింతలో నా దుకాణానికి వచ్చేవారందరూ మాంసా హారం వదులుతారా ! అందుచేత మీరు ఈ అనుమానం వదిలేయండి. ప్రాణాలు నిలిపు కోవడానికి ఆవశ్యకమయిన ఆహారంకోసం జరిపేది హింసకాదు.
మరొశ్రమాలు ఈ జంతువులను ఎవరో సంహరించి తెస్తారు. నా వృత్తి ధర్మానుసారం దీనిని విక్రయం చేసి బ్రతుకుతాను.
వ్యాపారంలో దొంగ తూకాలూ, అధిక లాభాలూ నేనెరుగను.
నా ధర్మాన్ని నేను విడిచి పర ధర్మాన్ని స్వీకరించము. ఆకలి గొన్న వారికి పిడికెడు అన్నం పెడతాను. నా మీద ఆధారపడి జీవించే వారందరి యోగ క్షేమాలు తెలుసుకుంటాను. ఇరుగు, పొరుగులవారి కష్ట సుఖాలలో భాగం పంచు కుంటాను.
అన్నిటినీ మించిన విషయం –
ఈ మనస్సు ఉన్నదే యిది స్థిరంగా నిలబడదు. ముందు దీన్ని లొంగదియ్యాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిర్మల బుద్ధితో నిరంతరం పరమేశ్వరారాధనం చెయ్యాలి.
నేను చేసేది యింతే! ఈ మాత్రం చెయ్యగలిగితే మనకు ఏ బాధలూ ఉండవు, ఈ జీవితం ఎంతవరకూ పరోపకారానికి ఉపయోగపడితే అంత ధన్యం’ అని బోధించాడు.
గొడ్డు మాంసం అమ్ముకుని జీవించే బోయవాడు చేసిన ప్రబోధంతో మనస్సు నిర్మలమై ప్రశాంతంగా వాని వద్ద సెలవు తీసుకుని తపస్సు కేసుకునేందుకు వెళ్ళాడాయన.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గురుసేవ సత్ఫలితం ఇస్తుందినీతికథ.
గురుసేవ సత్ఫలితం ఇస్తుంది
(ఇది ఆదిపర్వంలో కథ. గురు సేవ ఎంత అవసరమో, దాని ఫలితం ఎంతటిదో గ్రహించాలి.)
ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరుగల ఉపా ధ్యాయు డుండేవాడు. ఆయన దగ్గర ఎందరో విద్యాభ్యానంచేసేవారు.
ఆ రోజులలో గురుకులాలంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధానంలో ఆయన సేవచేస్తూ వినయ విధేయతలతో విద్యనేర్చుకునేవారు. గురువుగారు కూడా వారిని తన బిడ్డలుగా చూసుకుని ఎవరికి ఏ విద్యయందు అభిరుచి ఉన్నదో గ్రహించి ఆ విద్యనే నేర్పేవాడు. తనకు కావలసిన విద్యనేర్ప గల గురువును అన్వేషిస్తూ విద్యార్థి తిరిగేవాడు. అవీ అనాటి గురుకులాలు.
అటువంటి గురుతులంలో పైలునివద్ద ఉదంకుడని శిష్యుడుండే వాడు. ఈ ఉదంకుడు విద్యపూర్తి చేసుకుని సంప్రదాయం ప్రకారం గురువుగారి దగ్గర సెలవుతీసుకునే ముందు, చేతులు కట్టుకు నిలబడి, తలవంచి.
‘ఆచార్యా! గురునక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించండి’, అన్నాడు
అప్పుడు పైలుడు చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించి :
“నాయనా నీ వంటి శిష్యుడు దొరకడం మా అదృష్టం. గురు దక్షిణ ఏమీ అవసరం లేదు,’ అన్నాడు.
ఉదంకుడు అలాగే నిలబడి:
‘ఆచార్యా! గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడం న్యాయంకాదు. కమఠ మీరు ఆజ్ఞాపించండి’, అన్నాడు.
వాని పట్టుదల, ధర్మవిరతిచూపి సంతోషంతో:
నాయనా! ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురు దక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్ళి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు’, అన్నాడు పై లుడు.
ఉదంకుడు లోపలకు వెళ్ళి గురువుగారి భార్యకు నమస్కరించి విష యం చెప్పాడు.
అప్పుడావిడ :
‘నాయనా మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్యనేర్పు కున్నాడు. ఆ రాజుభార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు, అంది.
ఉదంకుడు పరమానందంతో బయలుదేర పండగా ఆవిడ పిలిచి ” నాయనా ! ఇంక నాలుగు రోజులలో నేను ఒక వ్రతం చెయ్య బోతున్నాను. అప్పటికి అవి తీసుకురావాలి’ అంది.
‘చిత్తం, తల్లీ’ అని ఉదంకుడు బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక మహావృషభంమీద ఒకా నౌక పురుషుడు అడ్డుగా వచ్చి:
‘ఈ గోమయం భక్షించివెళ్ళు. అనుమానించకు. దీన్ని మీ గురువుగారు కూడా భక్షించారు’, అనగానే ఉదంకుడు మాట్లాడకుండా అది తిని, త్వరగా రాజు గారింటికి వెళ్ళాడు.
మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి, అతని సమాచారం అడిగి: ‘మీ రాకవల్ల మా జన్మ ధన్యమయింది. ఊరకరారు మహాత్ములు! ఏ పనిమీద వచ్చారో చెప్పండి’, అనగా గురుపత్ని కోరిక వివరించాడు.
మహారాజు వినయంగా
‘ ఓ విద్వాంసుడా ? మీరు ఏదికోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్ళి మహారాణిని అడగండి. ఆవిడ సంతోషంగా ఇస్తుంది’, అన్నాడు.
ఉదంకుడు క్షణాలలో అంతిపురికిపోయి తిరిగివచ్చి :
‘రాజా! మీరు విద్వాంసులతో పరిహాసాలాడుతా రమకో లేదు. మహారాణి అంతఃపురంలో లేదు’, అన్నాడు.
రాజు: ఓ మహాత్మా! క్షమించాలి. అపవిత్రులకు నా భార్య కనబడదు. మీ వంటివారు అుచిగా ఉన్నారనీ అనలేను.
ఉదంకుడు: గుర్తుకు వచ్చింది మహారాజా! నేను వచ్చేదారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణపు తొందరలో నేను కాళ్ళూ, చేతులూ, ముఖం కడగకుండా ఆచమించాను. ఇలాచెప్పి అప్పటి కప్పుడు అన్నీ ముగించి అంతఃపురానికి వెళ్ళి ఎదురుగా వినయంతో నిలిచిన రాణికి తన రాశకు కారణం చెప్పాడు.
రాణి! విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి. ఇవిగో రత్న కుండలాలు తీసుకోండి. ఒకమాట. ఈ కుండలాలు దొంగిలించాలని చిర కాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. అది కనిపెట్టుకుంటూ వెళ్ళండి.
ఉదంకుడు అవి తీసుకుని చక చక వస్తున్నాడు. కొంక దూరం వచ్చేసరికి దారి వెంట ముసలి బిచ్చగాడు వానిని వెన్నంటి వస్తున్నాడు.
ఉదంకుడు సాయంకాలానికి ఒక చెరువు దగ్గరటచేరి, కుండలాలు ఒడ్డున పెట్టి సంధ్యావందనం ఆరంభించగా ఆ దొంగ వాటిని ఆవహరించి పారిపోయాడు.
ఉడంకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగవాడు పాములామారి ఒక బిలంలో దూరాడు. దాన్ని తవ్వడానికి ఉదంకుడు శ్రమపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బిలాన్ని విశాలం చేశాడు.
దానిగుండా పోయి పోయి ఉదంకుడు నాగలోకానికిపోయి అనేక విధాల ప్రార్థనలు చేసినా తక్షకుడు కనిపించలేదు.
కనిపించకపోగా ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చుని తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు.
నేత చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. దానికి వన్నెండు ఆకులు ఉన్నాయి. ఎదురుగా అశ్వంమీద ఒక పురుషుడు కనిపించాడు. అందరినీ స్తుతించగా ఆ పురుషుడు ప్రసన్న వదనంతో ‘ వరం కోరుకో’ అన్నాడు.
ఉదంకుడు: నాగలోకమంతా నా వశంలో ఉండాలి.
“అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు’ అన్నాడా పురుషుడు.
అప్పటికే కాలాతీతం కావస్తున్నది. ‘గురుపత్నీ వ్రత సమయానికి ఎలాచేరడం’ అని విచారిస్తుండగా ఆ పురుషుడు తన గుర్రంయిచ్చి అదృశ్యం అయ్యాడు.
మరుక్షణంలో ఉదంకుడు గురువుగారి ఆశ్రమం దగ్గర దిగాడు. గుర్రం మాయమయ్యింది.
అప్పటికి గురువుగారి భార్య అభ్యంగస్నానంచేసి వ్రతానికి సన్నద్ధు రాలవు తున్నది.
ఉదంకుడు ఆవిడ పాదాలకు నమస్కరించి, కుండలాలు అర్పించి, ఆశీర్వాదం పొంది, గురువుగారి దగ్గరకు వచ్చాడు.
ఇంత ఆలస్యం ఎందుకయింది అని గురువుగారు అడుగగా జరిగిన విషయాలన్నీ వివరించి వాటి అంతరార్థం బోధించమని కోరాడు. ‘నాయనా! నీకు ఎదురుపడిన పురుషుడు దేవేంద్రుడు. ఆ వృషభం ఆయన ఐరావతం. ఆ గోమయం అమృతం. అది భక్షించక పోతే నువ్వు నాగలోకంలో జీవించవు.
నాగలోకంలో స్త్రీలను చూశావే, వారు ధాత- విధాతలు.
నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు. చక్రాన్ని తిప్పే ఆరుగురూ ఋతువులు, పన్నెండాకులూ మాసాలు. ఆ చక్రం సంవత్సర రూప మయిన కాలచక్రం.
అక్కడ కనిపించిన పురుషుడు దేవేంద్రుడు. ఆ గుర్రం అగ్ని హోత్రుడు.
ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు. నువ్వు నా శిష్యుడవు కనక నీకు అపాయం జరగకుండా కాపాడాడు. నీ వలె వినయ విధేయతలతో, గురుశుశ్రూష చేసి విద్యనేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతారు. ఇకనువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు” సర్వశుభాలూ కలుగుగాక’, అని గురువుగారు ఆశీర్వదించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… జూదం తగదు నీతికథ.
జూదం తగదు
(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)
తన వలె కష్టాలపాలయిన మహామహులు చరిత్రలో ఎవరయినా ఉన్నారా అని ధర్మరాజు అడుగగా బృహదశ్వమహర్షి చెపుతున్నాడు.
“ధర్మనందనా ! నిజానికి నువ్వు పడే కష్టం ఎంతటిదయ్యా ! తమ్ములు నలుగురూ, నీ భార్యా నీ దగ్గర ఉన్నారు. ఈ వనాలలోని మునులూ, ఋషులూ నీకు ధర్మబోధ చేస్తూ, ఓదారుస్తూన్నారు.
ఈ మాత్రం కూడా లేకుండా భార్యకు దూరమై ఎన్నో బాధలు పడిన నలమహారాజున్నాడు. ఆయన కూడా జూదంలోనే రాజ్యం, పంప దమా కోలుపోయి నావా యాతనలూ పడ్డాడు. ఆ కథ విను.
భారతదేశంలో ఉండే అనేక రాజ్యాలలో నిషేధదేశం ఒకటి. ఆ రాజ్యాన్ని వీరసేనుడనే రాజుకొడుకు నలుడు పాలిస్తున్నాడు. ఈ సల మహారాజు సర్వసద్గుణ సంపన్నుడు, విద్యావంతుడు, రూపంలో మన్మ థుడు. సత్యవ్రతంతో విద్వాంసులను పూజించే వాడు.
అయితే పాండురాజనందనా! ఆయనకు కూడా నీలానే జూదం అంటే మహా ప్రీతి. ఆ విద్యలో మంచి నేర్పు కూడా ఉంది. సరే ఆ విషయం అలా ఉంచు.
ఆ రోజులలో విదర్భ రాజ్యాన్ని పాలించే భీముడనే రాజుకి దమ యంతి అనే పేరు గల కుమార్తె ఉండేది. ఆమెకు పదహారేళ్ళు నిండే నాటికి ఆమె గుణ, శీల, మందర రూపాలను గురించి దేశదేశాలలో చెప్పుకునే వారు.
సాధారణంగా అందం కల ఆడవారికి వినయం ఉండదు. కొంద రికి శీలం ఉండదు. వినయము, శీలమూ లేని అందగత్తెమ గురించి అందరూ ఆడిపోసుకుంటారే తప్ప మంచి మాట అనరు.
అలా కాకుండా ఈ దమయంతి తవ అందం కంటె వినయ, గుణ, శీలాలతో అందరి మెప్పునూ పొందింది.
అలానే పదాచార, పద్గుణ రూపాలకు, సాహస పరాక్రమాలు తోడుగా ఉన్న నలమహారాజుకి దమయంతి తగిన ఇల్లాలు కాగలదని దేశ దేశాలు తిరిగే విద్వాంసులు అంటుండే వారు. ఈ వార్త నల దమయంతు లిద్దరి చెవిని పడింది. ఒకరినొకరు చూచుకోకుండానే వారి మధ్య అమ రాగం అంకురించింది.
అలా ఉండగా, ఒకనాడు నలుడు తన ఉద్యానవనంలో విహారం సాగించే సమయంలో అక్కడ తిరిగే హంసలలో ఒక రాయంచ నలుని చేతికి చిక్కింది.
దాని అందాన్ని చూసి ఆనందించే నలునితో ఆ హంసః
‘మహారాజా! నువ్వు నన్ను విడిచిపెడితే నేను విదర్భదేశం వెళ్ళి అక్కడ నీ గుణ, రూప, సాహసాలు వివరించి ఆమెకు నీ యందు అనురాగం కలిగేలా చేస్తాను’ అంది.
నలుడు విడిచిపెట్టాడు.
హంస బయలు దేరి వెళ్ళి విదర్భ రాజు ఉద్యానవనంలో విహ రించే దమయంతిని సమీపించి నలుని గుణ గణాలు కీర్తించింది.
ఆ మాటలు విని దమయంతి హంసను లాలించి ఇదే విధంగా నా గురించి ఆ మహారాజుకి చెప్పవలసిందిగా ప్రార్థించింది.
హంస అలాగే అని వెళ్ళి విషయమంతా నలునికి విశదం చేసింది.
తన కుమార్తె వయసు గమనించి విదర్భరాజు స్వయంవరం ప్రక ఉంచాడు.
ఆ స్వయంవరానికి దేశదేశాల రాజులతో పాటు దేవతలు కూడా వచ్చారు. వారు వచ్చే దారిలో నలుని చూసి, తమ పక్షాన దమయంతి దగ్గరకు రాయబారిగా పంపారు.
దేవతల అనుగ్రహం వల్ల నలుడు ఎవరికంటా పడకుండా పరావరి దమయంతి అంతఃపురంలో ఆమె ఎదుట నిలిచాడు.
ఆ సుందరాకారుని చూసి దమయంతి ఆశ్చర్యంతో
‘ఆర్యా! దివ్యసుందరాకారంతో ఉన్న మీరెవరు? ఈ అంతః పురంలోకి పోతుటీగ రావడానికి వీలులేదే మీరెలా వచ్చారు?’ అంది.
నలుడు: కల్యాణీ! నేను ఇంద్ర, వరుణ, యమ, అగ్నిహోత్రులు పంపగా వారి అమ గ్రహం వల్ల ఎవరి కంటబడక ఇక్కడకు దూతగా వచ్చాను. రేపు స్వయంవరంలో నువ్వు ఈ నలుగురిలో ఒకరిని వరించాలి.
‘మహారాజా ! నా మనసెప్పుడు మిమ్మే ప్రాణనాథునిగా వరం చింది. అలనాడు హంస చెప్పిన నాటి మంచి మిమ్మే ఆరాధిస్తున్నాను. ఈ స్వయంవరం మీ కోసమే ప్రకటించారు. మీరు నా భర్త, అలా జర గని నాడు మరణమె శరణ్యం’ అంది.
పరిపరివిధాల దేవతల ఘనతను గురించి చెప్పి, వారిలో ఎవరినో ఒకరిని వరించడం ఉచితం అని పలుడు ఎంత బోధించినా అంగీకరించ లేదు దమయంతి. ‘దేవతా సమక్షంలోనే మిమ్ము వరిస్తాను’ అంది.
నలుడు తిరిగి వచ్చి అంతా వివరించాడు.
దేవతలు ఆశవీడక మరునాడు స్వయంవర మండపానికి నలుని వేషంలో వచ్చి వాని పక్కనే కూర్చున్నారు.
గమయంతి స్వయంవర సభలో అడుగు పెట్టి ఒక్కొక్కరినే చూస్తూ నలుని సమీపించింది. అక్కడ అయిదుగురు నలమహారాజులు కనిపించగా ‘ ఓ దివ్యపురుషులారా! నేను ప్రేమించే వలనుహారాజు మీలో ఎవరు?ి అందిం
వారు నలుగురూ లేచి నిలబడ్డారు. వలుడు కదలలేదు. అప్పుడు దమయంతి ఆ ఎలుగురికీ నమస్కరించి వలుని మెడలో పూలమాల వేసింది.
దేవతలు వారిని దీవించి వెళ్ళారు.
నలుడు భార్యాసహితుడై తన రాజ్యానికి వచ్చాడు.
పన్నెండు సంవత్సరాలు సుఖ సంతోషాలతో నలదమయంతులు జీవితం సాగించారు. వారికి ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె కలిగారు. వారు చక్కని శిక్షణలో పెరుగుతున్నారు.
ఆ రోజులలో పొరుగు రాజయిన పుష్కరుడు నలుని దగ్గరకు వచ్చి తనతో జూదం ఆడమన్నాడు.
జూదానికి, యుద్ధానికి ఆహ్వానం వస్తే తిరస్కరించరాదు అనే నియమం అంగీకరించాడు.
జూదం ఆరంభమయింది. పుష్కరుని మాయజూడంలో నలుడు ఒక్కొక్క పందెం ఓడిపోతున్నాడు.
ఓడిన కొద్దీ ఆవేశంతో పందెం పెంచుతున్నాడు. గెలిచిన ఆనం దంతో పందెం కాస్తున్నాడు పుష్కరుడు. రోజులు గడుస్తున్నాయి. భర్త జూదంలో సర్వం ఓడిపోతున్నట్టు తెలిసి దమయంతి తన బిడ్డ లిద్దర్నీ ఒక రథం మీద పుట్టింటికి పంపింది.
అన్ని సంపదలూ ఓడిపోయిన నలునితో పుష్కరుడు
‘ ఇంక నీ దగ్గర పైసా కాసులేదు. నీ భార్య ఉంది. ఆమెను కూడా పందెం కాస్తావా?’ అన్నాడు.
నలుడు దీనవదనంతో కోట దాటి వచ్చాడు. దమయంతి కూడా అనుసరించింది.
శత్రు నగరంలో ఉండరాదని రాజ్యం విడిచి వారు వెడుతున్నారు.
(వజలందరూ)
‘జూదం ఎంత పని చేసింది : ధర్మప్రభువయిన నలమహారాజుకి ‘కూడా కష్టాలు తెచ్చిపెట్టింది’, అని కంటనీరు పెట్టారు.
నల దమయంతు లిద్దరూ తిరిగి తిరిగి ఆహారం కూడా దొరకనిచోట మంచి నీరు తాగి కాలం గడుపుతున్నారు.
అలా ఉండగా ఒకనాడు వారి సమీపంలో కొన్ని పక్షులు కని పించగా నలుడు వాటిని పట్టుకోవాలని ఉత్తరీయం వాటిమీద విసిరాడు. అవి ఆ బట్టతో సహా ఎగిరిపోయాయి. అప్పుడు భార్య పైట చెరగు పగం చింపి తన ఉత్తరీయం చేసుకున్నాడు.
కొంతదూరం నడిచి నాలుగు దారులు కలిసి ఒక కూడలిలో నిం బడి:
‘దమయంతీ! ఇంతవరకూ నాతో ఎన్నో కష్టాలు అనుభవించావు.” ఇప్పుడు నీకు శ్రేయోమార్గం బోధించాలని ఉంది. ‘
ఇదిగో ఇటు దక్షిణంగా వెడితే అవంతీ దేశం చేరుతావు. అటు నుంచి కొంచెం ముందుకు వెడితే విదర్భదేశం వస్తుంది’, అన్నాడు.
దమయంతి ఆ మాటలు విని కన్నీరు విడిచి ‘నాథా! ఎందుకు చెపుతున్నారు నాకు ఈ దారి? రాజ్యం పోయినా, సంపదలు పోయినా కట్టుబట్ట పోయినా మిమ్మల్ని నేను విడవలేదు. మీతోనే కష్టమయినా, సుఖమయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా అయినా మీ దుఃఖాన్ని తగ్గించడానికే నేను మీతో ఉన్నాను. నన్ను వదలకండి’- అంది.
అప్పుడు నలుడు :
‘ దమయంతీ । భార్యకంటె ఈ ప్రపంచంలో స్నేహితుడూ, ఆప్త బంధువు ఎవరూ లేరు. ఈ విషయం నే నెరుగుదును. ఎరిగి నిన్ను విడిచిపెడతానని ఎందుకనుకున్నావు? ఒక వేళ నీకు నేను దూరమయినా నా మనస్సు ఎప్పుడూ నీ మీదనే ఉంటుంది. మన ప్రేమకు అంతరాయం ఉండదు * ‘ అన్నాడు.
అలా మాట్లాడుకుంటూ వారు ఒక పత్రం చేరారు. ఆ రాత్రి నిద్రి స్తున్న వేళ దమయంతిని విడవలేక విడవలేక విడిచి వెళ్ళిపోయాడు. నలుడు.
తెలతెలవారు తూండగా నిద్రలేచిన దమయంతి భర్తకోసం గోలు గోలున విలపిస్తూ పత్రం విడిచి ఊరు దాటి అడవిదారి పట్టి వెదకడం ఆరంభించింది.
తిరుగుతూండగా ఓ కిరాతుడు ఆమెను చూసి మోహించి బలాత్కారం చెయ్యబోయి, ఆ పతివ్రత వేడిచూపులకు తట్టుకోలేక నేలకూలాడు.
దొరికిన పండుతిని, నీరుతాగి భర్తకోసం పిచ్చిదానిలా తిరుగుతూ చేదిదేశం చేరింది. అక్కడి జనులందరూ ఆమెను పిచ్చిదానిగా, భావించి
వెంటాడుతూంటే, రాజభవనం నుంచి చూసిన రాజమాత తన దాసిని పంపి దమయంతిని రాజభవనంలోకి రప్పించింది”.
దమయంతి రాజభవనంలోని అంతః పురంలో మహారాణి నందాదేవి దగ్గరకు రాగానే ఆవిడ ఆదరంతో కూర్చుండ బెట్టింది. పరిచారిక అందరినీ దూరంగా వెళ్ళమని
‘అమ్మాయీ ఎవరింటి బిడ్డవమ్మా! నీ భర్త ఎవరు? ఈ దశలో ఎందుకున్నావు? అలంకారాలు లేకపోయినా, జుట్టు చిందర వందరగా ఉన్నా, మాసిన బట్టలతో ఉన్నా నీలో దివ్యశోభ కనిపిస్తున్నది. సత్యం చెప్పు తల్లీ ‘ ! అని బుజ్జగింపుగా అడిగింది.
దమయంతి విచారంతో
‘ మహారాణి । నేను ఎవరి బిడ్డనని చెప్పను? ఆ కథ మరచి పోయాను. ప్రస్తుతం ఏకాకిని, సైరంధ్రి వృత్తిలో నాకు ప్రవేశంఉంది, రాజాంతః పురాలలో, నా నియమాలకు భంగం కలగనిచోట ఆ వృత్తిలో ఉంటాను.
నా భర్త గుణ, శీల రూపవంతుడు. కానీ, అన్యాయంగా జరిగిన జూదంలో అన్నీ కోలుపోయి అడవులపాలయాము. ఆయన నన్ను ఒక సత్రంలో ఒంటరిగా విడిచివెళ్ళాడు. ఆయనకోసం తిరుగుతూ తిరుగుతూ యిలా వచ్చాను. మీరు నా నియమాలకు అంగీకరిస్తే యిక్కడే ఉంటాను’ అంది.
అంగీకరించింది మహారాణి.
తన కొమార్తెను పిలిచి మహారాణి అన్ని విషయాలూ చెప్పి, * ఈమెను కంటికి రెప్పవలె చూసుకోవాలి’ అంది. ఆ విధంగా దమ యంతి వారి అంతఃపురంలో కాలం గడుపుతున్నది.
ఆ రాత్రి సత్రంలో బయలుదేరిన వలుడు ఒక మహారణ్యంలో సాగుతూండగా అక్కడ దావానలం వ్యాపించి మంటలు లేచాయి.
మంటలలో నుండి ఆర్తనాదం వినిపించింది. దీని జన రక్షణ దీక్షకల నలుడు అటునడువగా –
‘ఓ పుణ్యాత్ముడా! ఇటురా నేను నాగజాతి కర్కోటకుడను. నారదులవారి శాపంవల్ల యిక్కడ కర్రలా పడి ఉన్నాము. నీ దర్శనంతో నాకు శాపం పోతుందని ఆయనే అన్నారు. నన్ను ఈ మంటల నుండి కాపాడితే నీకు మేలు చేస్తాను’ అని కర్కోటకుడు పణకగా నలుడు వానిని యీవలకు తెచ్చి వదిలాడు.
అపుడు శర్కోటకుడు :
‘ఆర్యా! మీరు పది అడుగులు వేయండి. మీకు శుభం కలుగు తుంది’, అన్నాడు.
నలుడు పదో అడుగు వెయ్యగానే కర్కోటకుడు నలుని కాటు వేశాడు. ఆ పర్పవిషం ఎక్కగానే నలుడు నల్లని మరుగుజ్జు వాడయాడు.
నలుడు తెల్ల బోయిచూడగా, కర్కోటకుడు:
మహారాజా ! బాధపడకు. ప్రస్తుతం నన్ను కలిపురుషుడు బాధిస్తు న్నాడు. నా విషంతో వాడు పడుతూంటాడు. అంతవరకూ నీ రూపం ఎవరికీ తెలియకుండా రహస్యంగా గడపడానికే నేను కాటు వేశాను. ఇది మొదలు నీ పేరు బాహుకుడు.
ఇప్పుడు నువ్వు అయోధ్యకు వెళ్ళి ఆ రాజు ఋతువర్ణుని కొలువులో చేరు. ఆయనకు జూదం అంటే పిచ్చి. ఆయన దగ్గర ఆ విద్య గ్రహించా అంటే నీకు తెలిసిన అశ్వహృదయం ఆయనకు నేర్పాలి. దానితో మిగిలిన కార్యాలు చక్కబడతాయి.
నీకు నీ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను స్మరించు’, అని చెప్పి మాయమయ్యాడు.
బాహుక రూపంతో నలుడు అయోధ్య చేరి, రాజును దర్శించి, తనకు అశ్వశాస్త్రం తెలుసుననీ, ద్యూతం కూడా వచ్చుననీ, పంట చెయ్యటంలో మంచి అనుభవం ఉన్నదని చెప్పగా, ఆ మహారాజు వానిని తన అశ్వపాలకుడుగా నియమించాడు.
అలా కాలం గడుపుతున్నాడు నలుడు, నిత్యం రాత్రి వేళల దమ యంతినే స్మరించు కుంటూ.
తన కుమార్తె దమయంతి, అల్లుడు నలమహారాజు అరణ్యాల పాలయారని విన్న విదర్భరాజు విచారంలో తన నగరంలోని విప్రవరు లను రావించి :
‘ వేదవిదులారా మీరు దేశ దేశాలు తిరుగుతూ అనేక నగరాలు చూస్తుంటారు. ఎక్కడయినా నా కుమార్తె, ఆమె భర్త కనిపిస్తే వార్త నాకు అందించండి. అందుకు ప్రత్యుపకారంగా మీకు అగ్రహారం యిచ్చి వందల గోవులు సమర్పిస్తాను’ అన్నాడు.
వారందరూ తమ పర్యటనలో నందమయంతుల జాడ తెలుసు కోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు.
వారిలో సుదేవుడనే విద్వాంసుడు చేది రాజ్యంచేరి, రాజు యింట శుభకార్యం జరిగే వేళ అక్కడ ఉన్న నారీమణులమధ్య దమయంతిని గుర్తుపట్టాడు.
నెమ్మదిగా వీలు చూసి ఆమెను ఏకాంతములో కలిసి, తన కథ చెప్పాడు సుదేవుడు.
దమయంతి మాట్లాడకుండా బొట బొట కన్నీరు విడిచింది. అది. చూసి రాజకుమారి సునంద ఆ విషయం తన తల్లితో చెప్పింది.
రాజమాత ఆ విప్రునిచేరి వివరా అడిగింది.
ఆయన సంగతులన్నీ చెప్పి:
‘మహారాణి చూశారా! ఈ అమ్మాయి కనుబొమలమధ్య తిలకం వలె ఒక పుట్టుమచ్చ ఉంది. అదిచూసి నేను గుర్తుపట్టాను’ అనగా రాజు మాత దమయంతిని దగ్గరగా తీసుకునిః
బిడ్డా! మీ అమ్మా నేను అక్క-చెల్లెళ్ళం. నీకు ఎంతటి దురవస్థ పట్టిందమ్మా ! అని విచారించింది.
కొంత సేవయాక దమయంతి :
‘పిన్నీ! ఇంతకాలం నే నెవరో తెలియకపోయినా ఎంతో ఆదరంగా చూశావు. ఇప్పుడు నన్ను ఈ విద్వాంసుని వెంట మా పుట్టింటికి పంపు. అక్కడ నా బిడ్డ లిద్దరూ ఉన్నారు. వారిని చూసుకుని కొంత అశ్వాసం పొందుతాను’ అంది.
మరునాడే దమయంతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. కన్నబిడ్డలు తల్లిని కౌగిలించుకుని సంతోషంతో కంటనీరు పెట్టారు.
దమయంతి బిడ్డలిద్దరినీ దగ్గరగా తీసుకుని ముద్దాడి, వెన్నుదువ్వి, కన్నీరు తుడిచి, బుజ్జగించింది.
ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. మరునాడు దమయంతి తల్లిత తన భర్తను అన్వేషించే ప్రయత్నం సాగించమంది.
ఆ పనికి బయలుదేరే విద్వాంసులందరినీ రావించి దమయంతి :
‘పుణ్య పురుషులారా! మీరు వెళ్ళిన ప్రతి రాజసభలోనూ యీ సందేశం వినిపించి, అందరినీ పరీక్షగాచూచి, యిది వినగానే ఎవరు చలిస్తారో వానిని గురించి వివరాలు తెలుసుకు రండి.
జూదరి అయిన ఓ ప్రాణేశ్వరా! పతిసేవకే అంకిత మయిన భార్యను నిద్రలో ఉండగా విడిచి, ఆమె చీర చెరగు కట్టుకు వెళ్ళావు. నాటి నుంచీ ఆమె అదే దశలో నిన్నే స్మరిస్తూ కృశిస్తున్నది. కనికరంతో ఆమెకు నీ దర్శన భాగ్యం అనుగ్రహించు ‘
అని దమయంతి వినిపించిన సందేశంతో వెళ్ళిన వారిలో అందరూ ఏ సమాచారం లేకుండానే వచ్చారు.
వారిలో మదేవుడనే విప్రవరుడు దమయంతి దగ్గరకు వచ్చి:
‘అమ్మా! దేశ దేశాలు తిరిగి నేను అయోధ్యలో ఋతుపర్ణుని ఆస్థానంలో నీ సందేశం వినిపించాను. ఆ సభలో ఎవ్వరూ జవాబివ్వలేదు. కాని, సభదాటి వచ్చాక, దారిలో ఒక పురుషుడు (ఆ మహారాజుగారి ఆశ్వపాలకుడు, బాహుకుడని ఆయన పేరు) నేను పలికిన మాటలకు జవాబిచ్చాడు’ అని చెప్పాడు.
ఒక రథం విదర్భ నగర సరిహద్దులలో ప్రవేశిస్తున్నది. ఆ వేగానికి భూమి కంపిస్తున్నది. రాతికోట గోడలు ఊగిపలాడుతున్నాయి. అంత దూరం మంచి అంతఃపురానికి వినబడింది రథ చక్ర నేమిధ్వని.
దమయంతి గుండె పులకించింది. ‘సందేహం లేదు, అది నలుని సారథ్యమే. అంత వేగంగా మరెవరూ రథాన్ని నడవలేరు, ‘ అని నిశ్చయించింది.
రథం కోటలోని మధ్య ప్రాకారానికి రాగానే ఆ వార్తవిని విదర్భ రాజు మర్యాదగా ఎదురువచ్చి ఋతుపర్ణునికి స్వాగతం పలికి, అతిథి మర్యాదలు నడిపాడు.
నగరంలో ఎక్కడా స్వయంవర సన్నాహాలు కాని, ఆ ప్రయ త్నాలు కాని కనిపించక ఋతువర్ణుడు తెల్లబోయాడు. ఇలా స్వయంవర వార్త తనకు ఎందుకు పంపారో తెలియలేదు.
ఋతుపర్ణుడు ఎందుకు వచ్చాడో విదర్భ రాజుకు తెలియలేదు.
‘మిత్ర ధర్మంగా వచ్చానన్నా డాయన.
‘సంతోషం’ అన్నాడీయన.
దమయంతి తన చెలికత్తెను పిలిచి :
“కేశినీ। ఆ రథం మీద వచ్చిన పొట్టి చేతుల కురూపివున్నాడే ఆయన ఎవరో ఆయన కథ ఏవిటో వివరంగా తెలుసుకురా’ అని సంపీ౦ంది,
ఆమె నెమ్మదిగా రథం దగ్గరకు వెళ్ళి బాహుకుని చేరి కుశల ప్రశ్నలతో సంభాషణ మొదలు పెట్టి, సేకరించిన సమాచారంతో డమ యంతి దగ్గరకు వచ్చి:
‘అమ్మా రథం మీద వచ్చిన కురూపి ఋతువర్ణులవారి సారథి. మనం పంపిన బ్రాహ్మణుని సందేశం విని ఏ సమాధానం యిచ్చాడో అనే మాటలు చెప్పి విలపించాడమ్మా’ అంది.
దమయంతికి అర్థమయింది ఆ వ్యక్తి నలుడే అని. అయితే ఈ వికారరూపం ఏమిటో అర్థంకాక, మరోసారి దూతికను పంపి, వాని చర్యలన్నీ పసిగట్టి రమ్మంది.
వెళ్ళిన దూతిక తిరిగి వచ్చి:
‘అమ్మా! అంతా అద్భుతంగా ఉన్నదమ్మా!
మన కోటమంచి వారికి అన్నీ పండని పదార్థాలు పంపించారు. అక్కడ వంటశాలలో నీళ్ళులేవు, నిప్పులేదు. బాహుకుడు ఒక్కసారి అక్కడున్న ఖాళీ కుండలలోకి చూడగానే అవి నీటితో నిండాయి. రెండు గడ్డి పరకలు తీసి సూర్యుని కెదురుగా ఉంచాడు. అవి మండడం ఆరం భించాయి. క్షణాలలో వంట పూర్తి అయింది.
ఆ పరిసరాలలోని మన ంతానికుంజాలలో వికసించిన పువ్వులు తీసి ఆయన నలిపి పారేశాడు. ఆ చేతులలో అంత నలిగినా అవి వాడి పోకుండా అప్పుడే రేకులు విచ్చిన వాసన లీముతున్నాయి.
అలా దూతిక చెప్పుతూంటే దమయంతి విశ్వాసం మరింత పెరిగి, ఆయన వండిన పదార్థాలు తీసుకు రమ్మని చెప్పింది. తెచ్చిన వంట కాల రుచిని బట్టి అది నలుని చేతి వంటయే అని గ్రహించింది.
తన బిడ్డ లిద్దరినీ యిచ్చి దూతికను నలుని దగ్గరకు పంపింది. వారిని చూస్తూనే దగ్గరకు తీసుకుని బాహుకుడు గోలు గోజున విలపించాడు.
తన పిల్లలు కూడా యిలా ముద్దుగా ఉండే వారనీ, వీరిని చూడ గానే వారు గుర్తు వచ్చి విచారించా’ ననీ అన్నాడు.
ఈ కబురు విన్న దమయంతికి సందేహం పూర్తిగా తీరింది. తల్లి దగ్గరకు వెళ్ళి :
‘అమ్మా! ఆయనను అంతఃపురానికి రప్పించి అసలు విషయం తెలుసుకోవాలి’ అంది.
ఆవిడ మహారాజుతో సంప్రదించి బాహుకుని రప్పించింది.
దమయంతిని చూస్తూనే బాహుకుడు కంటనీరు పెట్టాడు. దుఃఖం పొంగిపొర్లింది. దమయంతి కూడా అదే దశలో పడింది కొంత సేపు యిద్దరూ దుఃఖించారు.
దమయంతి దుఃఖాన్ని దిగమింగుతూ :
‘బాహుకా! ఘోరారణ్యంలో భార్యను విడిచి వెళ్ళిన పురుషుని ఎక్కడయినా చూశావా? ఆమె ఎ అపరాధం చేసిందని అలా విడిచి వెళ్ళాడో కనుక్కున్నావా ? దేవతలను కూడా తిరస్కరించి అనురాగంతో వరించి, సంతానవతిని అయిన నన్ను అలా ఒంటరిగా వదలి వెళ్ళడం న్యాయమనీ భావించాడా ఆయన ధర్మార్థ కామాలు మూడూ కలిసి సాగించి, అనుభవిద్దాం అని అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న నన్ను విడవడం ధర్మమా ? ‘
అని అడుగుతూంటే బాహుకుని కన్నుల వెంట అశ్రుధారలు కురిశాయి.
‘ ఓ మహాసాధ్వీ | యింకా నీ మాటల శూలాలతో నన్ను వేధించకు. మనకు కలిగిన క్లేశాలన్నీ కలిపురుషుని పగవల్ల వచ్చినవి. ఇప్ప టికి వాడు నన్ను విడిచాడు. కమక యిక్కడకు రాగలిగాను.
అనురాగంతో ఆనందమయ జీవితం గడిపిన నారీమణి పంపురు మని వివాహ మాడుతుందని ఊహించలేకపోయాను. మీ నాన్నగారు నీ ద్వితీయ స్వయంవరం ప్రకటించడం వల్ల మా మహారాజును తీసుకు వచ్చాను’ అని రోదించాడు.
అప్పుడు దమయంతి :
“నన్ను శంకించకండి. మీ జాడ కని పెట్టడానికి నేనే ఆ నందేశం పంపాను. నగరంలో స్వయంవర సన్నాహాలు మీకు కనబడ్డాయా మా నాన్న గారికి కూడా మీ రెందుకు వచ్చారో తెలీదు. మీరు తప్ప ఇంత దూరం రథాన్ని ఒక్కరోజులో నడపగలవారు లేరని ఎరుగుదును. నా ఊహ నిజమయింది’ అంది.
బాహుకుడు కర్కోటకుని స్మరించాడు. అంతే బాహుకుడు నలు డుగా సుందర రూపంతో సాక్షాత్కరించాడు. నలదమయంతులు ఇద్దరూ ఒకరి నొకరు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు.
వాడిపోతున్న నారు మడికి తొలకరి చినుకులు పడినట్లు వారి దుఃఖభర హృదయాలు ఆనంద గగనంలో విహరించాయి. మరునాడు తెలతెల వారుతూండగా నందమయంతులు అభ్యంగన స్నానంచేసి నూతన వస్త్రాలు ధరించి మహారాజును సమీపించి నమస్కరించారు.
ఆయన వరమ సంతోషంతో వారిని ఆశీర్వదించి నగరంలో ఉత్ప వాలు జరిపించాడు.
తన సేవకుడుగా ఉన్న బాహుకుడు వలుడని తెలియగానే ఋతు ఎర్ణుడు వచ్చి క్షమార్పణ కోరాడు. అనంతరం వారివద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు.
నలదమయంతులు కొంతకాలం ఇక్కడే సుఖభోగాలు అనుఖి వించారు.
అప్పుడొకనాడు నలుడు:
‘నే నిప్పుడు పుష్కరుని ఓడించగల ద్యూత రహస్యాలు నేర్పు కున్నాను. వెళ్ళి వాడితో ఆడి, ఓడించి మన రాజ్యం సంపాదించి వస్తామ’ అని వెళ్ళి పుష్కరుని జూదానికి పిలిచాడు. పుష్కరుడు వరమ సంతోషంతో జూదానికి దిగి సర్వమూ ఓడిపోయి నలుని పాదాల మీద పడ్డాడు.
నలుడు వానిని క్షమించి :
“నీ రాజ్యానికి నవ్వుహా ” అన్నాడు.
అనంతరం దమయంతినీ, బిడ్డలనూ రప్పించి ధర్మమార్గావ సత్య పాలనం సాగించి సర్వ ప్రకారంజకుడనే పేరు సంపాదించాడు.
అని మార్కండేయుడు కథ ముగిస్తూ
ధర్మనందనా ! విన్నావుకదా!
ఆయన ఎన్ని క్లేశాలు పడినా ధర్మమార్గం విడవక సత్యం తప్పక నడిచి నందువల్ల సుఖంగా జీవించి, కీర్తి సంపాదించాడు అన్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది నీతికథ.
సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది
మేనకా, విశ్వామిత్రులు ఎవరి దారిని వారు వెళ్ళారు. ఒక చెట్టు నీడలో శకుంతములు (పక్షులు) పోషిస్తున్నాయి పసిపాపను.
అటువై పు నదీస్నానానికి వచ్చాడు కణ్వమహర్షి. ఆయన కంట పడింది ఆ పాప. ఆమెను రెండు చేతులలోనికి తీసుకుని తన ఆశ్రమానికి తెచ్చి పెంచుతున్నాడు.
శకుంతములు (పక్షులు) పోషించిన కారణంగా ఆమెకు శకుంతల అని పేరుపెట్టాడు.
ఆమె పెరిగి పెద్దదవుతున్నది.
చక్కనిచుక్కలా, అప్పుడే విరిసిన పువ్వులా పదహారేళ్ళ ప్రాయంతో శకుంతల ఆశ్రమంలో తిరుగుతూ కణ్వమహర్షిని కన్నతండ్రిలా సేవించు కుంటున్నది.
అలా రోజులు గడుస్తూండగా ఒకనాడు దుష్యంతమహారాజు ఆ అర డ్యానికి వేటకు వచ్చాడు. వేట సాగుతుండగా ఆ మహారాజు కణ్వమహర్షి ఆశ్రమ ప్రాంతం చేరాడు.
సమీపంలో మహర్షి ఆశ్రమం కనిపించగానే పరివారాన్ని దూరంగా ఉంచి, ఒంటరిగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు.
ఎంతటి మహారాజయినా, ఆ రోజులలో వేదవిదులను, మును లను, మహర్షులను అప్పుడప్పుడు స్వయంగా వెళ్ళి దర్శించి, వారి ఆశీ ర్వాదాలు పొందే సంప్రదాయం ఉండేది.
ఆ భావంతోనే ఆశ్రమ పరిసరాలలోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా సేననూ, పరివారాన్ని దూరంగా ఉంచి వచ్చాడు.
ఆశ్రమం దగ్గర ఎవరూ కనబడలేదు. కొంచెం లోపలకు నడిచాడు. ఎదురుగా శకుంతల కనిపించింది.
ఆమె శరీర లావణ్యం, అవయవ శోభ మహారాజు మనస్సుమ ఆకర్షించాయి.
మహారాజును చూస్తూనే ఆమె అతిథిమర్యాదలు జరిపింది. ఇరు పురూ కుశలప్రశ్నలు వేసుకున్నారు.
అప్పుడు శకుంతల:
‘ఆర్యా! తమరు మా ఆశ్రమానికి ఏ పనిమీద దయచేశారో సెల విస్తారా’ అంది.
‘ పద్మముఖీ !
నేను అవిల మహారాజు కుమారుడను. నన్ను దుష్యంతుడని పిలు స్తారు. మహాఋషి కణ్వులవారిని దర్శించి వారి ఆశీర్వాదం పొంది వెళ్ళాలని వచ్చాము. వారు కనిపించలేదు’ అన్నాడు దుష్యంతుడు.
శకుంతల! మహారాజా! మా పితృపాదులు ఫలాలు తేవడానికి వెళ్ళారు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకొనేలోగా వస్తారు.
దుష్యంతుడు: ఓ లావణ్యలహరి చూడగానే మమ్ము ఆకర్షించిన నీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ అరణ్యంలో ఆశ్రమాలలో ఉండవలసిన అవసరం నీ కెందుకు కలిగింది? నువ్వెవరి బిడ్డవు? ఈ ప్రశ్నలు ఎందుకడుగుతున్నానంటే కణ్వమహర్షి ఇంద్రియాలను జయించి తపోదీక్షలో ఉన్నారని విన్నాం. ఆయనకు వంశానం కలిగే అవకాశం లేదు. నిన్ను నా భార్యగా గ్రహించి రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టమహిషిని చేయాలని ఉంది.
శకుంతల ఆర్యా! కణ్వమహర్షి నాకు గురువులు. వారి అనుమతి లేనిదే నేను స్వతంత్రించి ఏ పనీ చెయ్యను. వారు రాగానే మీరు వారిని అడగండి.
దుష్యంతుడు: అతిలోకసుందరీ బ్రహ్మచర్య వ్రతనిష్ఠలో ఉండే కణ్వమహర్షి సంతానం ఎలా కలిగింది?
శకుంతల: మహారాజా! నేను మేసకా విశ్వామిత్రుల బిడ్డను. నన్ను చిన్ననాటి నుంచీ పెంచి పెద్ద చేసిన వీరే నాకు తండ్రివంటివారు.
దుష్యంతుడు : విశ్వామిత్రుని పుత్రివయిన నువ్వు రాజ వంశానికి చెందిన దానవు కనక, రాజులకు ఉచితమయిన గాంధర్వ వివాహం మనం చేసుకోవచ్చు. దానికి ఒకరి అనుమతి అవసరం లేదు.
శకుంతల: మహారాజా! గాంధర్వం ధర్మబద్దమయితే నేను మిమ్ము పెళ్ళి చేసుకుంటాను. కాని ఒక నియమం ఉంది. మీవల్ల నాకు కలిగిన కుమారుడు మీ రాజ్యానికి చక్రవర్తి కావాలి.
అంగీకరించాడు దుష్యంతుడు,
ఇద్దరూ కొంతసేపు సుఖించారు.
దుష్యంతుడు ఆమెను అనునయించి రాజధానికి వెళ్ళగానే చతు రంగ బలాలను పంపి మహారాణిగా తీసుకు వెడతానన్నాడు.
దుష్యంతుడు వెళ్ళిన కొద్దిసేపటికి కణ్వమహర్షి వచ్చాడు. సిగ్గుతో, భయంతో ఉన్న శకుంతల ఆయనకు యథాప్రకారం ఎదురుగా వెళ్ళి నమస్కరించి, చిరునవ్వుతో స్వాగతం పలక లేదు.
కణ్వమహర్షి ఆమెనుచూసి ‘అమ్మా! ఆశీర్వాదం. ఏం జరిగింది. తల్లీ ? నిర్భయంగా చెప్పు’ అన్నాడు.
‘పితృపూజ్య ః దుష్యంత మహారాజు మన ఆశ్రమానికి వచ్చారు. ఆయనను నేను భర్తగా స్వీకరించాను. అనంతర కథ మీరు గ్రహించ గలరు’ అంది శకుంతల.
కణ్వమహర్షి ప్రసన్న వదనంతో !
‘అమ్మా ! చాలా సంతోషం. అనురాగ తరంగిత హృదయులయిన మీరు ఏర్పరచుకున్న సంబంధం క్షత్రియులకు తగినదే. దీనినే గాంధర్వం అంటారు. యోగ్యుడయిన భర్తను పొందావు.
అందువల్ల నీవు ధర్మాత్ముడూ, మహా బలిష్ఠుడూ అయిన కుమా రుని కని కీర్తి పొందుతావు, నీ పుత్రుడు సర్వశత్రు సంహారం చేసి భూ మండలాన్ని పరిపాలించగలడు, ‘ అని ఆశీర్వదించాడు.
రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటుతున్నాయి.
మహారాజు నుండి కబురు లేదు. శకుంతల మనసంతా దుష్యంతుని మీదనే ఉన్నది. ఆకలి వెయ్యడం లేదు. పరిశుభ్రంగా స్నానం చెయ్యా అనిపించడం లేదు. ఏ పూట కాపూట రాజధాని నుండి రథం వస్తుందని ఎదురు చూస్తున్నది.
ఈలోగా నెలలు నిండి ఒకానొక శుభ ముహూర్తంలో ఆమె ప్రస వించింది.
కణ్వమహర్షి ఆ బాలుడికి జాతక కర్మ జరిపించాడు.
బాలుడు పెరుగుతున్నాడు. వాని చేతులలో చక్రాలు చక్రవర్తి లక్షణాలని నలుగురు అంటూంటే ఉప్పొంగేది శకుంతలలోని మాతృ హృదయం. ఆరేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ బాలుడు సింహంవలె పరాక్రమించి, ఆశ్రమ పరిసరాలకు వచ్చే పెద్దపులులనూ, సింహాలనూ, మదగజాలనూ చెవులు వట్టి ఆడించే వాడు.
అది చూసి అక్కడి మునులు వానికి సర్వదమనుడు అని పేరు పెట్టారు.
పెరుగుతూ ఉన్న బాలునికి రాజవంశ సంప్రదాయానుసారం అన్ని విద్యలూ నేర్పుతున్నాడు కణ్వమహర్షి.
పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
అప్పుడొకనాడు కణ్వమహర్షి :
‘అమ్మా! అంతవరకూ మహారాజు కబురు పంపలేదు. ఇప్పుడు నీ కొడుకు యువరాజు పదవి అలంకరించవలసిన వయసులో ఉన్నాడు. ఎంతటి పతివ్రతయినా చిరకాలం పుట్టింట ఉండకూడదు. భర్త దగ్గరే కష్టమయినా, సుఖమయినా అనుభవించడం భార్యకు ధర్మం,’ అని ఆమె కుమారుని దగ్గరగా తీసుకుని.
‘నాయనా! చంద్రవంశీయుడయిన దుష్యంత మహారాజు నీ తండ్రి. నువ్వు మీ అమ్మతో అక్కడకు వెళ్ళి యువరాజు పదవిని ధర్మ దీక్షతో నిర్వహించాలి’ అని తన శిష్యులను పిలిచి.
‘నాయనలారా వీరిద్దరినీ తీసుకు వెళ్ళి దుష్యంత మహారాజు దగ్గర విడిచి రండి’, అన్నాడు.
ప్రయాణ సన్నద్ధురాలై శకుంతల ఆయన పాదాలకు అభివాదం చేసింది.
బ్రహ్మచర్య దీక్షితుడూ, తపస్సంపన్నుడూ అయిన కణ్వమహా మునికి కన్నీరాగలేదు.
పెంచిన ప్రేమ నిండిన గుండెలో బాధ పుట్టింది. కంటనీరు ఒలి కింది. గద్గద స్వరంతో:
‘ లోకమంటే ఏమిటో ఎరగని ఈ అమాయకురాలిమీద దేవతలం దరూ దయ చూపాలి !’ అని ఆశీర్వదించి పంపాడు.
శకుంతల తన కుమారుడైన భరతుని (సర్వదమనుని ముద్దుపేరు) వెంట పెట్టుకుని దుష్యంతుని దగ్గరకు బయలుదేరింది.
అరణ్యం దాటి రాజధాని చేరి దుష్యంతుని కోటలో ఆయన కొలు వులో శకుంతలనూ, భరతునీ విడిచి కణ్వుని శిష్యులు తరలి వెళ్ళారు.
దుష్యంత మహారాజు సభా భవనంలో సింహాసనం మీద ఉన్నాడు. మంత్రి, సామంత, దండనాథులతో విద్వాంసులు కూడా ఆ సభలో ఉచి తావనాల మీద అలరారుతున్నారు.
అప్పుడు వచ్చిన శబంతల, తన కుమారుడయిన భరతుని భుజం మీద చెయ్యి వేసి
‘నాయనా! సత్య ధర్మ పరాయణుడైన ఈ మహారాజు మీనాన్న గారు. ఆయనకు నమస్కరించు,’ అని తను కూడా చేతులు జోడించింది.
కుమారుడు భరతుడు సంతోషంతో ఆశగా తండ్రి వైపు చూశాడు. దుష్యంతుడు: ఓ తరుణీ। నీ బిడ్డను తీసుకుని ఏ ప్రయోజనం కోరి వచ్చావో అడుగు।
శకుంతల మహారాజా! వీడు మీ కుమారుడు. అలనాడు మీరు వేటకు వచ్చి కణ్వాశ్రమంలో గాంధర్వవిధిని నన్ను వివాహం చేసుకునే ముందు నా బిడ్డకు యువరాజు పదవి యిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవలసిన భారం మీ మీద ఉంది.
దుష్యంతుడు! ఓ మూర్ఖురాలా! నువ్వెవరివి? నిన్ను నే నెప్పుడూ చూడలేదు. ఇటువంటి అసందర్భపు ప్రలాపాలు కట్టిపెట్టి బయటికినడు.
శకుంతల మహారాజా ! మీరు నన్ను చూడనేలేదా? గుర్తు తెచ్చు కోండి. పన్నెండేళ్ళ క్రితం వేటకువచ్చి మాలినీ నది తీరాన కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర నన్ను కలిసి మీ రాడిన మాటలు మరవ కండి. పంచ భూతాలూ, సూర్య చంద్రులూ, అంతరాత్మ-ఇవన్నీ మనం చేసే ప్రతి పనికీ సాక్షులు. వాటి కన్ను గప్పి ఎవరూ ఏమీ చెయ్యలేరు.
ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కనక మీరు తిరస్కారభావంతో చూస్తున్నారు. మీ సభలో నా మాటలు అరణ్యరోదనంలా ఉన్నాయి. ఒక్కటి మరువకండి. పురుషుడు పుత్ర రూపంలో భార్యాగర్భంలో ప్రవేశించి పితృదేవతలను ఉద్ధరిస్తాడు. పున్నామ నరకంమంచి కుమారుని వల్లనే బయటపడతాడు. భార్య అనేది తండ్రివలె పురుషుని హితవు కోరుతుంది. తల్లి వలె ఓరిమితో ఓదారుస్తుంది. మిత్రుని వలె సాయపడుతుంది. లోకంలో ఎవ రయినా భార్య కలవానినే విశ్వసిస్తారు. వివాహం కానివాడు ఎంత ధనవంతుడయినా ఆ పంపద, అడవిశాసిన వెన్నెం. అన్ని విధాల తోడునీడగా ఉండాలి కనకనే భార్యను ఎన్నుకునేటప్పుడు రూపంతోపాటు గుణం, గుణంతో శీలం, శీలంతో సంప్రదాయ పదాచారాలు చూచుకుంటారు పెద్దలు.
పోగా –
భార్యగర్భం నుంచి ప్రభవించిన బాలుడు సర్వ విధాలా తండ్రిని పోలి ఉంటాడు. అద్దంలో ప్రతి బింబంలా కుమారునిలో తండ్రి రూపం సాక్షాత్కరిస్తుంది. అందువల్ల నే పుత్రోదయ, దర్శనాలు తండ్రికి ఆహ్లాదం కలిగిస్తాయి.
దేశ భ్రష్టులయి, దుర్భర దారిద్య్ర్యం అనుభవించే వారయినా భార్య దగ్గర ఉంటే ఆకష్టాలు మరచిపోతారు. అందువల్లనే భార్యను అనాదరంతో, ఆగ్రహంతో బాధించరాదు అని వివేకవంతులు చెపు తున్నారు.
మహారాజా ! అంతకంటే ప్రధాన ధర్మం ఉంది.
అది పుత్ర వాత్సల్యం.
పసితనంలో ఎక్కడ పడితే అక్కడ పాకుతూ, దుమ్ములో దొర్లుతూ, అల్లంత దూరంలో తండ్రి కనిపించే సరికి కిలకిల నవ్వుతూ వచ్చి రెండు కాళ్ళూ చుట్టివేసుకుని ఆశగా చూసే కొడుకుకంటే ఆనందం కలిగించే విషయం మరొకటి ఉన్నదా?
నామాట మీకు ఎంత చేదుగా ఉన్నా ఈ మీ కుమారుని వైపు చూడండి. మీ ఒడిలో కూర్చుని యువరాజు ఠీవిని ఒలికించాలనే కోరిక వీడి కన్నులలో మీకు కనిపిస్తుంది.
చిన్న చిన్న చీమల నుంచి పక్షులు, పశువులు తమ సంతానం మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. తన గూటిలో ఉన్న కోకిల గుడ్లను కూడా కాకి అమాయకంగా తన సంతానమే అని సాకి పొదుగుచున్నది.
అది ఎరిగిన మీరు మీ కుమారుని విషయంలో ఆవాదరం చూపడం న్యాయం కాదు.
సామాన్య మానవుడు కూడా తిరిగి తిరిగి యింటికి రాగానే తన బిడ్డలను దగ్గరగా తీసుకుని ముద్దులాడి పొంగిపోతాడు.
మరొక మాట:
తన బిడ్డకు ” జాతక కర్మ” జరుపుతూ
” అంగాదంగాత్
సంభవసి……..
నా ప్రతి అవయవం నుంచి మవు జన్మించావు. నా హృదయంలో నువ్వే. నా ఆత్మ నువ్వు. అటువంటి నువ్వు నూరేళ్ళు సుఖంగా బ్రతుకు అంటాడు.
చూడండి నిర్మలమయిన కొలనిలో ప్రతిబింబంలా వీడు ముమ్మూ ర్తులా మిమ్ము పోలి ఉన్నాడు..
అని అలా శకుంతల చెప్పుకు పోతున్నది.
దుష్యంతుడు కదలకుండా పెదవి మెదవకుండా కూర్చున్నాడు.
“మహారాజా ! రాజ కార్యాలలో మునిగి తేలే మీకు అన్ని విష యాలూ గుర్తుండవు.
పన్నెండేళ్ళ క్రితం
వేటకోసం అడవికి వచ్చారు.
మీ బాణానికి అందక పరుగెత్తే లేడికోసం తిరుగుతూ మా ఆశ్ర మంలో ప్రవేశించి గాంధర్వ విధానాన నన్ను పెళ్ళి చేసుకున్నారు.
అప్సరో భామలలో అగ్రశ్రేణికి చెందిన మేనక నా తల్లి .
తేజోవంతుడూ, తపస్వీ అయిన విశ్వామిత్రులవారు నా జనకులు. నన్ను పెంచిన జనకుడు బ్రహ్మర్షి కణ్వులు.
అటువంటి ఉత్తమురాలి నయిన నన్ను తియ్య తియ్యని మాట లతో పరిగ్రహించారు. ఆనాటి మన సమాగ ఫలం ఈ బాలుడు,
విశ్వరక్షతులైన మీరు నా ప్రాణ నాథులు. ధర్మ పరులయిన మీరు నన్ను మోసం చెయ్యకండి.
చిన్న నాడే నా తలిదండ్రులు నన్ను వదిలేశారు. ఇప్పుడు నా ప్రాణ నాథులయిన మీరు కూడా తిరస్కరిస్తున్నారు. కష్టాలు నాకు కొత్తకాదు. కాని ఈ బాలుడు మాత్రం మీ కుమారుడే’ అని నిట్టూర్చింది.
దుష్యంతుడు శకుంతలా సాధారణంగా అబద్ధా లాడడం ఆడవారికి సహజ గుణం. నీ మాటలు మరి సమ్మక్తివంత అబద్దాల పుట్టణ.
ఎక్కడి విశ్వామిత్ర మహర్షి ।
వారికి కలిగిన నువ్వు ఇలా కుంటలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను నమ్మలేను. నువ్వు ఏమేమో కథలు చెపుతున్నావు. నా కనలుగుర్తు లేవు.
శకుంతల మహారాజా! ధర్మ భ్రష్టులను తాచుపాముతో పోలుస్తారు, అందుకే భర్తృ హీవలకు వాస్తికులు కూడా భయపడతారు.
మహారాజా వందనూతులు తవ్వించడం కంటే ఒక దిగుడుబావి నిర్మించడం మంచిది. అటువంటివి నూరు నిర్మించడం కంటే ఒక పర్కతువు మంచిది. అవి నూరు చెయ్యడం కంటే గుణవంతుడయిన కొడుకును కనడం శ్రేష్ఠం. కుమారులు నూరుగురికంటె ఒక్క సత్య వాక్యం శ్రేయోదాయకం. సత్యమే పరమేశ్వరరూపం. అందుచేత మీరు సత్యాన్ని మరువకండి. నన్ను విడిచినా బాధలేదు. నేను పెడతాను. ఆఖరు సారిగా ఇటు వీడికన్నులలో మీ చూపుని నిలవండి. మీ కొడు కవునో కాదో తెలుస్తుంది. సరిగ్గా ఆ సమయానికి ఆ శరీరవాణి ఇలా పలికింది.
‘మహారాజా! ఈమె నీ భార్య, వీడు నీ కుమారుడు. ఆమె నిజం చెప్పింది.’
ఆ మాటలు విని దుష్యంతుడు
‘సభాసదులారా !
విన్నారు కదా ధర్మ దేవత పలుకులు.
ఈమె చెప్పిందంతా నిజమే. కాని ముందుగా అంగీకరిస్తే మీ రంతా ఈ పుణ్యశీలను శంకిస్తారని ఇంతసేపు ఆగామ’
అని కొలువు చాలించి, శకుంతలా భరతులను దగ్గరగా తీసుకుని అంతఃపురానికి వెళ్ళి తన తల్లికి నమస్కరింపజేసి, విషయం వివరించి, ఆశీర్వాదాలు పొందాడు.
(భారతంలో మొదటి ప్రేమ కథ ఇది. సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కల్గిస్తుంది. నాడు ధర్మం రక్షించి ఉండకపోతే ఈ నాటి ప్రేమ కథే ఇది కూడా)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… మేనక నీతికథ.
మేనక
(బహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలాముఖ్యమయన పాత్ర నిర్వ హిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అదికూడా శకుంతలకథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది: ప్రస్తుతకథ ఆదిపర్వంలోనిది.)
వసిష్ఠమహర్షితో వచ్చిన వైరం కారణంగా, ఆయనవలె బ్రహ్మర్షి కావాలనే కోరికతో విశ్వామిత్రుడు తీవ్రనియమాలతో తపస్సు చేస్తున్నాడు.
దేవేంద్రుడు ఆ తపోదీక్షకు భయపడి ఏ విధంగానయినా దానికి భంగం కలిగించాలని బాగా ఆలోచించి, ఆలోచించి ఏ మానవుడయినా కామినీ, కాంచనాలకు దాసు డవుతాడని నిశ్చయించుకున్నాడు.
ధనంకంటే మనిషిని సుందరీమణులే మరింతగా వంచించగలరని భావించి, అప్సరసలకు తలమానికమయిన మేనకను పిలిపించి:
‘ అప్పరోజునశిరోమణి !
ఇప్పుడు మవ్వాక దేవకార్యం సాధించవలసి ఉంది. నా వజ్రా యుధం పనిచెయ్యనిచోట్ల నీ కంటిచూపులు తీవ్రంగా పనిచేస్తాయని మేమెరుగుదుము. ఆ శక్తిని ప్రయోగించి కార్యం సాధించాలి.
విశ్వామిత్రిమహర్షి పేరు విని ఉంటావు. ఆయన గాధిరాజ నంద మడు. రాజభోగాలన్నీ అనుభవించి, వసిష్ఠులవారితో యుద్ధానికిపోయి, ఆ బ్రహ్మవేత్తముందు ఆగలేక రాజశక్తికంటే బ్రహ్మవిదులశక్తి ఘన మనదని గ్రహించి, దానిని సాధించడానికి తీవ్రంగా తపస్సు చేస్తు న్నాడు. అదిమాకు సంతానం కలిగిస్తున్నది. ఆయన దీక్షకు భంగం కలిగించడం సామాన్యవిషయంకాదు. ఆయన శక్తి కూడా అసాధారణ మయినది,
అయినా నీ రూపం, లావణ్యంగా, నాట్య విద్యా ప్రావీణ్యం వీటితో ఆయన తపస్సమాధికి భంగం కలిగించాలి’ అన్నాడు.
మాటలు వింటున్న మేనక శరీరం ఆపాదమస్తకం కంపించింది. గుండె నిబ్బరం తగ్గింది.
‘ ప్రభూ ! మీ మాటకు ఏనాడూ ఎదురు చెప్పకుండా తలవంచి వెళ్ళి పనులు చేసుకువచ్చాం. కాని, విశ్వామిత్రులవారి పేరు వింటేనే మాకు గుండె దద్దరిల్లుతున్నది.
ఆయన సామర్థ్యం మీ రెరుగనిదికాదు. ఆయన తపస్సు, తేజస్సు ఎంతటివో అంతకంటే పదిరెట్లు ఆయనకు క్రోధం. దీనికేకదా మీరు భయ పడుతున్నారు మీరే భయభ్రాంతులయేచోట మా గతి ఏం కావాలి?
వసిష్ఠులవారి కొడుకు లందరినీ సంహరించిన క్రోధమూర్తి ఆయని. తపస్సుకి అంతరాయం కలగకుండా తన ఆశ్రమ సమీపంలో నదిని ప్రవ హింపజేసుకున్న శక్తిశాలి. మతంగునిచేత యజ్ఞం చేయించినప్పుడు మీరు స్వయంగా వెళ్ళి సోమపానం చెయ్యక తప్పలేదు. వసిష్ఠులవారు శపించిన త్రిశంకునిచేత యజ్ఞంచేయించి, ఆ రునికోసం త్రిశంకు స్వర్గం నిర్మించాడు.
ఆయన కన్నులెర్రజే స్తే ముల్లోకాలూ భస్మం అవుతాయి. కోపంతో భూమిమీద తన్నితే భూగోళం గజ గజ వణుకుతుంది. మేరు పర్వతాన్ని గడ్డి పరకలా చూడగలడు. అంతటి మహామహుని దగ్గరకు నన్ను వెళ్ళ మంటున్నారు.
నేను పెడతాను. అంతకుముందు ఆయన ఉన్న వనం అంతా వసంతశోభతో, మల యవవనాలతో, సుగంధ సౌరభంతో అలరారు తుండాలి. నేను ఆమహర్షి ఎదుటకు వెడుతున్నప్పుడు వాయువు నా పైట చెరుగును ఎగరవేసుకు పోవాలి.
ఇన్నిటితోపాటు మన్మథుడు జాగరూకతతో తన పనిని కొనసాగిం చాలి. అప్పుడు మీ శాసనాన్ని నేను సక్రమంగా పాలించగలుగు తామ’ అంది.
దేవేంద్రుడు చిరునవ్వుతో అన్నిటికీ అంగీకరించి పంపించాడు.
మేనక అమరావతి విడిచి విశ్వామిత్రుని తపోవన వాటికకు వచ్చింది.
అప్పటికే ఆశ్రమ పరిసరాలలో అతలు మొగ్గ తొడిగాయి. చెట్లు పూలతోనిండి సువాసన భీమతున్నాయి. గాలి చల్లగా పోతుతున్నది.
అటువంటి సమయంలో ఆశ్రమ సమీపాన తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రునికి అల్లంతదూరంలో నిలబడి, అభినయంతో చేతులు జోడించింది మేనక.
ఆమె చేతిగాజులు, కాలి అందెలమువ్వలు కదలి వన సన్నగా ధ్వని చేస్తూ ఆ మహర్షి చెవులలో చేరుతున్నాయి.
ఆయన మెల్ల మెల్లగా కన్నులు తెరిచే వేళకు ఆమె అంజలి బంధంతో నాట్యం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి గాలి విసురుతో ఆమె పైట కండువా ఎగిరి దూరంగా పడింది.
కన్నులు విప్పిచూశాడు విశ్వామిత్రుడు.
చూస్తున్న విశ్వామిత్రుడు తపస్వి,
చూసిన విశ్వామిత్రుని దీక్ష పడలింది.
నెమ్మదిగా లేచాడు.
ఆమె సిగ్గుతో వెనుదిరిగి పై టకండువా కోసం అడుగులు వేస్తూ వెను దిరిగి చూస్తున్నది.
కనులు మిలమిలలాడిస్తున్నది.
గాలి మరింత రేగింది.
ఆమె పరికిణీ చక్రంలో తిరిగి పైకి లేచింది.
విశ్వామిత్రుని మనస్సు వివశమయింది.
తన స్వాధీనం తప్పిన మనస్సులో కామవికారం పుట్టింది.
కామక్రోధాలను జయించి బ్రహ్మర్షి వదం చేరాలనే పట్టుదలతో మానవ సంచారం లేని మహారణ్యంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్న విశ్వామిత్రుడు ఆ వనంలో ఏకాంతంలో పైటజారిన మందరీమణి కనిపించే సరికి సర్వమూ మరిచిపోయి మనసులో మదనతాపం రేగగా మేనకను చేరబిలిచాడు.
మేనక సిగ్గుతో, భయపడుతూన్నట్లు రాజహంసలా నెమ్మదిగా అడుగులో అడుగువేస్తూ ఆయనను సమీపించింది.
విశ్వామిత్రుడు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు.
పది సంవత్సరాల కాలం గడిచింది.
అంతా ఒక నిమేషంలో అనిపించింది, ఆ విశ్వామిత్రునికి.
అప్పటికి మేనక గర్భవతి అయింది.
ప్రసవ కాలం సమీపిస్తున్నది.
నాటికి తెలిపింది, విశ్వామిత్రునికి
ఏమని?
తను కామాన్ని జయించలేదని.
అంతే మేనకను విడిచి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు, తపో దీక్ష
మేనక ప్రసవించి శిశువును మాలినీ నదితీరాన ఒక చెట్టు క్రింద వదలి దేవలోకం చేరుకుంది.
ఆ అమ్మాయి పేరే శకుంతల.
(ఎంతటి మహామహులయినా ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీలను చేర నిస్తే పతనం తప్పదని నీతి)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కలియుగం నీతికథ.
కలియుగం
[అయిదువేల సంవత్సరాల క్రితమే వ్యాసమునీంద్రుడు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించాడో చదివితే ఆయన దూరదృష్టి వివేకవంతులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కనక సావధానంగా చిత్తగించండి.]
అరణ్యవాసం సాగిస్తున్న రోజులలో పాండురాజు వండములకు మార్కండేయ మహామునీంద్రుని దర్శన భాగ్యం లభించింది.
ఆ చిరంజీవి వారికి ఎన్నెన్నో విశేషాలు, కథలు చెపుతూ తాను ఒకానొకప్పుడు చూపిన కలియుగం ఎలా ఉన్నదో వివరిస్తున్నాడు.
ధర్మనందనా !
కృతయుగంలో రాజు ఉండడు. సేనలు ఉండవు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మపరాయణులు, సత్యవాక్పాలకులు, అహింసా నృతదీక్షితులు. అటువంటి సమయంలో సేనలూ, రాజులూ అవసరం లేదు.
త్రేతాయుగంలో సత్య, ధర్మాలకు కొంత హాని జరుగుతుంది. ధర్మం మూడు పాదాలే ఉంటుంది. అందువల్ల రాజు, సేన ఏర్పడుకాయి.
ద్వాపర యుగంలో సగం మంది ఆధర్మ పరాయణులే. యుగాంత వేళకే కలియుగ లక్షణాలు కూడా ప్రవేశిస్తాయి. అయినా ద్వాపరయుగంలో ధర్మానికే విజయం. సత్యవ్రత పరిపాలకులే ప్రభువు అవుతారు.
ఇక కలియుగం
ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చెయ్యగలడో వాడు సింహా ననం ఎక్కి అధికారం చెలాయిస్తాడు.
అటువంటి వారు అధికారులయినప్పుడు వివేక వంతులకు, కామ లకూ స్థానం ఉండదు. అందువల్ల అవివేకులూ, జ్ఞానశూన్యులూ ఉన దేశాలిస్తూ ధన సంపాదన ఆరంభిస్తారు.
వేదాధ్యయనమూ, సత్కతువులూ సాగించి పరబ్రహ్మను ఆరా ధించుకోవలసిన విప్రవరులు ఆ రెండూ విడిచి అన్ని రకాల పానీయాలూ సేవిస్తూ, రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు. లోకానికి సన్మార్గం చూపవలసిన వీరే యిటువంటి దురాచారాలకూ, దుర్వ్యసనాలకూ లొంగితే వీరి ననుసరించవలసిన వారు ఏమవుతారో వేరే చెప్పాలా!
అసత్యవాదులూ, అల్పాయుర్దాయం కలవారూ పుడుతుంటారు, అంతేకాదు, ఇప్పటివలె ఆజానుబాహులూ, తాళవ్రమాణదేహులూ పుట్టరు. మరుగుజ్జులు ఎక్కువవుతారు. నేల ఉసిరిచెట్టుకి నిచ్చెన వేసి ఎక్కవల సిన అంగుష్ఠమాత్ర శరీరాలవారు పెరుగుతారు. వీరికి కామవాంఛ ఎక్కువ. అందుకోసం మద్యపానం విరివిగా సాగిస్తారు. మరో విచిత్రం
ఆహార పదార్థాలలో రుచిఉఁడదు. అన్నీ ఎండుగడ్డిలా ఉంటాయి. అసలు వీరి నాలుకకు రుచి తెలియదు, దొరికిన పదార్థం తినడమే.
అంతకన్న ఆశ్చర్యం ఏమిటంటే
సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు.
ఆ యుగంలో మనుషులకు పదహారేళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడి పోతుంది.
ఏడెనిమిది సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులవుతారయ్యా !
మానవుడి పూర్ణాయుర్దాయం ఎంత ఉంటుందో తెలుసా !
పదహారేళ్ళు అంతే !
అప్పటికే అన్నీ తీరిపోతాయి.
మత్స్యమాంసాలు తిపనివారు కనిపించరు.
దానితో మద్యపానం విలాసంగా తయారవుతుంది. జూదరులు వాడవాడలా పెరుగుతారు. ఇవన్నీ ఘనకార్యాలుగా భావిస్తారు.
ఏ రోజు తెల్లవారి లేచినా
హత్యలూ, దొమ్మీలు, దోపిడీలు యివే కనిపిస్తాయి. వీటిని గురించే చెప్పుకుంచారు.
గోళ్ళూ, వెంట్రుకలూ వివరీతంగా పెంచుకుని రాజవీథులలో తిరిగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి రోజులలో నాస్తి కులు కూడా ప్రబలుతారు కదా ! అది ఒక వ్యాపారంగా బ్రతుకుతారు.
పోనీ మనుషులు ఎలా తయారయితే ఏం? అనుకుంటే వీరు తమ అవసరం కోసం వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల పౌలు పితకడం వల్ల అవి అనారోగ్యంతో మరణిస్తాయి. గో సంపద క్షీణి స్తుంది.
గోవుల పాలే కదుటయ్యా ! మానవులకు అమృతం. అది లేకుండా చేసుకుంటారు కలియుగ మానవులు.
ఆ సమయంలో అధికారులందరూ జలగలు రక్తం పీల్చినట్లు ప్రజ లను హింసించి పన్నులు పిండుతారే తప్ప వారి రక్షణ విషయం చూడనే చూడరు.
పాపిష్ఠి డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు. తండ్రిని కొడుకు మన్నించడు. భర్తను భార్య ఎదిరిస్తుంది. జనవనార వంటి వానితో తయారయిన వస్త్రాలు ధరించి తిరుగుతారు.
కన్యాదానాలు, వివాహాలూ ఉండవు. వయసు వచ్చిన ఆడపిల్లలు తమకు వచ్చిన యిద్దరు ముగ్గురు యువకులతో హాయిగా విహారాలు సాగిస్తారు. అదే దాంపత్యం.
శ్మశానాలలో దూరంగా ఉండవలసిన ఎముకలు తెచ్చి రకరకాల బొమ్మలు చేసి గృహాలలో అలంకరించి సంతోషిస్తారు.
ధర్మనందనా !
ఇప్పుడు విద్య నేర్చుకునే వాడికి అన్నం పెట్టి, నీడయిచ్చి, విద్య నేర్చే, ఆశ్రమాలు చూస్తున్నావు. అలానే ఆకలితో కడుపు చేతబట్టి గుమ్మంలో నిలిచి ‘దేహి’ అన్న పిలుపు వినబడితే ఆదరంతో అన్న దానం చేసే సంసారులు కనిపిస్తున్నారు.
కలియుగంలో అన్న దానం, విద్యాదానం ఉండవు. అన్నా హా రాలు అమ్ముకుంటారు. విద్యకూడా వ్యాపార వస్తువే అవుతుంది.
అలా కొంతకాలం కలియుగం గడిచాక అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం, పూర్ణిమ ప్రవేశించకుండా చంద్రగ్రహణం ఏర్పడతాయి.
ప్రజలకు పచ్చని పొలాలూ, తోటలూ ఉంటే నదీ తీరాలలోని పల్లెల మీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుతారు. అందరికీ నగర వాస వ్యామోహమే। పల్లెలు నిర్జన ప్రాంతా అవుతాయి. పంటలు పశి స్తాయి.
యుగాంత సమయంలో ఝంఝామారుతం రేగుతుంది. అది నిర్విరామంగా సాగుతుంది.
ఏడుగురు సూర్యులు ఉదయిస్తారు. భగభగలాడుతూ అగ్ని జ్వాలలు. అలా గడిచాక అంతా బూడిద అవుతుంది.
అప్పుడు కుండపోతగా కొంతకాలం వాన కురుస్తూనే ఉంటుంది. ఆది యుగసంధి.
నెమ్మదిగా ఈ బీభత్సాలు చల్లారుతాయి. రవి, గురు, చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు.
కాలానికి అవసరంగా వానలు, ఎండలు ఉంటాయి. భూమి పచ్చ పచ్చని చెట్లతో, అతలతో, ఫల, పుష్ప భరితం అవుతుంది.
ప్రజలు జరా రోగపీడలు లేకండా అన్న దాన, విద్యాదానాది సత్రా ర్యాలతో సుఖంగా ఉంటారు”. అది కృతయుగం.
అన్నాడు మార్కండేయుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… నారదుని ఉపదేశం వినండి నీతికథ.
నారదుని ఉపదేశం వినండి:
(నారదుడి పేరు వినే సరికి చాలామంది ఫకాలున నవ్వుతారు. ఆయన విదూషకుడనీ, కలహ ప్రియుడనీ ఈ అభిప్రాయానికి కారణం యిటీవలి కాలపు నాటకాలు, సినిమాలు మాత్రమే. భారత, భాగవత, రామాయణాలలో కనిపించే నారదుడు దేవముని, భక్తి తత్త్వవేత్త, మహాజ్ఞాని. అటువంటి మహామహునికి విదూ షక రూపం కల్పించిన పుణ్యాత్ములకు నమస్కారం.)
మహాభారతంలో నారద మహర్షి దర్శనం మొదటిసారి సభా పర్వంలో లభిస్తుంది.
ఇంద్ర ప్రస్థంలో ధర్మరాజు మయసభా భవనంలో సింహాసనం మీద ఉండగా ఆ ఉత్సవం చూడడానికి వచ్చాడు నారదుడు.
ఆ మునీంద్రునికి ఎదురేగి స్వాగతం యిచ్చి, అసనంచూపి, అతిథి మర్యాదలు జరిపాడు, పాండవాగ్రజుడు.
అప్పుడా మునీంద్రుడు ఆనందంతో ఆశీర్వదించి:
‘ధర్మనందనా ! నిన్ను సింహాసనంమీద చూడడం సంతోషంగా ఉంది. అయితే యింతకు పూర్వం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన నీ తండ్రి తాతలందరూ ఏ విధానాలు అవలంబించారో ఆ మార్గాలను విడనాడ కుండా ఉంటున్నావా? నీ రాజ్యంలో ప్రజలందరినీ సమానదృష్టితో చూసుకుంటున్నావా ? ధనలోభానికి లొంగి కొందరిని ప్రేమతోనూ, మరికొందరిని ద్వేషంతోనూ చూడడం లేదుకదా! ఆదిచాలా అనర్థాలకు దారి తీస్తుంది. చివరకు రాజుకే ముప్పు తెస్తుంది.
ఏ మానవుడయినా, ఉదయంపూట ధర్మకార్యాలు కొనసాగించాలి. మధ్యాహ్న సమయాల్లో ధన సంపాదన మార్గాలు ఆలోచించాలి. రాత్రి పూట కామభోగాలు అనుభవించాలి.
ఈ విధంగా సామాన్యులు నడవాలంటే మహారాజు వారికి మార్గ దర్శకంగా ఉండాలి.
ధనం ఉన్నదే-అది ఎక్కువయితే దురభ్యాసాలకు దారితీస్తుంది. దానికి లొంగుతున్నామంటే సర్వనాశనమే.
పగటిపూట నిద్రపోవడం, రాత్రి వేళల మేలుకొని ఉండడం అనారోగ్య కారణం.
మన మంత్రులు, కార్యనిర్వహణ పక్షులూ, నిర్మల మనస్కులూ, కుశాగ్ర బుద్ధులూ, నిస్స్వార్థ జీవనులూ అయి ఉండాలి సుమా !
ఉద్యోగాలు
వ్యక్తుల విద్య, వివేకంతో పాటు వారి శీల స్వభావాలు పరిశీలించి వారిని తగిన ఉద్యోగాలలో నిరమించాలి.
అధములకూ, మధ్యములకూ ఉన్నత పదవులు ఇచ్చి, ఉత్తము లను దిగువ శ్రేణిలో ఉంచరాదు. అందువల్ల పెద్ద పదవులలో ఎక్కిం చిన వారికి బాధ్యతలు తెలియవు. క్రిందికి దిగిన వారు అవమాన భారంతో ఉండి పాలనా యంత్రాంగాన్ని పాడుచేస్తారు.
మన బాధ్యతలు మనమే నిర్వర్తించాలి. అవి క్రింది వారిమీద విడిచిపెడితే వారు మనలను లోకువ చేసి మరీ క్రిందికి దింపుతారు.
నీ సేవలోని వారికి ఎప్పటి కప్పుడు జీతభత్యాలు సకాలంలో అందకపోతే వారు తిరుగుబాటు తెస్తారు. మన రక్షణకోసం, త్యాగాలు చేసే వారి పోషణ విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అలా దేశ ప్రజా రక్షణ కార్యంలో ప్రాణాలు బలిపెట్టినవా రుంటారు. వారి కుటుంబ పోషణ అంతా మనమే భరించాలి.
అలా చెయ్యకపోతే మళ్ళీ ఏ సేనాపతీ మన కోసం సాహసించడు. దేశ రక్షణ పాడయిపోతుంది. కనక పేనలోని వారి పోషణ ప్రధాన కర్త వ్యం.
మరొక ముఖ్యాంశం.
మన కొలువులో ఎందరో ఉద్యోగులుంటారు. వారిలో కొందరే మేధావులు. వీరు తమ ప్రతిభతో మనకు పేరు ప్రతిష్ఠలు తెస్తారు. అటు వంటి వారికి పెద్ద పెద్ద పదవులు యిస్తూండాలి. అంతే కాని అలాగే ఉంచితే వారి ఉత్సాహం పన్నగిల్లుతుంది. దానివల్ల రాజ్యానికి ముప్పు, అపఖ్యాతి.
అలానే దేశంలో అద్భుత సాహస కార్యాలు చేసేవారూ, మహా విద్వాంసులూ ఉంటారు. వారిని ఘనంగా సన్మానించాలి. విద్యా వంతులూ, ప్రతిభాసంపన్నులూ అయినవారు ఎప్పుడూ కొద్దిమందే ఉంటారు.
అటువంటి వాళ్ళు దేశానికి అలంకారం. అందుచేత వారి పోషణ భారం ప్రభుత్వమే వహించాలి.
దేశానికి రెండు రకాల ప్రమాదాలుంటాయి. అందులో మొదటిది గాలివానలూ, అగ్ని ప్రమాదాలూ, వరదలూ; వీటివల్ల కరువూ కాటకాలూ వస్తాయి. ఇవి ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాలు..
రెండవ రక –
దేశంలో సంస్కారం లేని మూఢులు పెరుగుతుంటారు. వారిలో పశుత్వం ఎక్కువ ఉంటుంది. రాజు బలవంతుడై ధీశాలిగా ఉంటే ఈ మూఢులు మూల మూలల్లో బ్రతుకుతారు. అలాకాక ప్రభువు కూడా మూఢుడైతే వీరు ప్రజలను హింసించి దోచుకు తినేస్తారు. ఒక్కోసారి రాజుకే ధన లోభం పుడితే రాజు పేరుమీద వీరే దోపిడి ఆరంభిస్తారు. అందుచేత అధికారంలోకి వచ్చేవాడు ఈ మూర్ఖుల సంఖ్య పెరగకుండా చూడాలి. చూడనివాడు పదవికి నీళ్ళు వదులుకోవాలి. పైగా నేరాలు చేసేవారిని ఎప్పటికప్పుడు కఠినంగా దండించకపోతే దేశంలో దొంగ తనాలూ, దొమ్మీలూ, హత్యలూ పెరిగిపోతాయి. ఏ సమయంలోనూ ద్రోహులను దండించకుండా విడువరాదు. విద్రోహుల మీద కనికరం చూపడం కంటే తెలివితక్కువ పని లేదని నువ్వూ వినే ఉంటావు ధర్మ నందనా.
దేశ ప్రజలకు అగ్ని ప్రమాదాల బాధ రాకుండా రాజు కాపాడాలి. అలానే వారి ఆరోగ్యానికి అవసరమైన సదుపాయాలూ, చక్కని మంచి నీరు దొరికే ఏర్పాట్లు ప్రభువే చెయ్యాలి.
దేశంలో వికలాంగులూ, ఆనాథులూ ఉంటారు. వీరం వరి రక్షణ, పోషణలూ ప్రభువే చూడాలి.
చివరగా ప్రజలనుంచి పన్నులు వసూలు చేసే వారిని సరయిన వారినే వెయ్యాలి. మంచి గంధపు చెట్లను కట్టెల కోసం పొడిచే మూర్ఖుల వలె పన్నులు పిండరాదు. పూలమాల కట్టేవాడు పూల తీగ కందకుండా పూలు కోసుకునేటట్లు మనం పన్నులు వసూలు చేసుకోవాలి.
దేశ దేశాల నుంచి మన దేశానికి వ్యాపారంకోసం వర్తకులు వస్తారు. వారిని పీడించి అధికంగా పన్నులు గుంజితే వారు మళ్ళీరారు. అలాకాక వారు పన్నులు ఎగగొట్టకుండా కూడా జాగ్రత్త పడాలి సుమా!
దేహం ఆరోగ్యంగా ఉండాలంటే శుచిగా వండిన ఆహారం మితంగా తీసుకోవాలి. దేహారోగ్యంతోపాటే మనస్సుకూడా నిర్మలంగా ఉండా అంటే అనుభవ సంపన్నులయిన విద్వాంసులతో, సత్పురుషులతో రోజూ కొంత సేపు సత్కాలక్షేపాలు చెయ్యాలి.
ధర్మనందనా ! ఇవన్నీ నీకు తెలుసు. అయినా చెప్పడం మా విధి అన్నాడు వారదుడు.