BhaktiVed
Mata / Devi

Gayatri Mantramu

Stotram

This text is still being proofread.

వరేణ్యమ్, నః, ధియః, ప్రచోదయాత్ యః

తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి.

వరేణ్యమ్ = (అందరికినీ శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు)

నః = మన

ధియః = బుద్ధులను

ప్రచోదయాత్ = ప్రేరేపించునదియు

యః = ఎవరో

ఓం = ప్రణవ ప్రతీకమైన

తత్ = ఆ

సవితు:దేవస్య = వెలుగుల సవితృమూర్తి యొక్క

భర్గః = (స్వయంప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును

ధీమహి = ధ్యానించుదము (గాక)

1. ప్రశ్న

గాయత్రీ మంత్రమును బాహాటముగా గొంతెత్తి ఉచ్చరించవచ్చునా?

2. ప్రశ్న

అందఱూ కలసి సామూహికముగా ఉచ్చరించవచ్చునా ?

సమాధానము :

“ధియోయోనః ప్రచోదయాత్’ అనుటలో “ధియః” అనగా బుద్ధులు అని, “నః” అనగా “మమ్ము” లేదా “మా యొక్క” అను పదములతో బహువచనములు ఉండగా అందరూ కలసి చేయవచ్చుననియే తెలుపును గదా!

3. ప్రశ్న

ఈ ఉపదేశము ఎప్పుడు జరుగవలెను?

4. ప్రశ్న

వేరువేరు వర్ణములకు వేరు వేరు గాయత్రీ మంత్రములు వున్నవా?

5. ప్రశ్న

స్త్రీలు యీ మంత్రమును పఠించవచ్చునా?

Meaning and notes

Gayatri Mantram In Telugu Lyrics

మంత్రం ఒక అద్భుత శక్తితో ఉన్నది. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మానసిక సంతృప్తిని అందిస్తుంది, మనస్సును శాంతిగా చేస్తుంది. మంత్రము చదివితే, అందరికీ అనంత ప్రేమ మరియు శాంతి కలిగి వస్తుంది.

గాయత్రీ మంత్రము విశిష్టత

భారతదేశమున పూర్వకాలములో ముఖ్యముగా ఐదు విధములైన దేవతారాధనలు ఉండెడివి. అవి 1) గాణాపత్యము 2) సౌరము 3) శాక్తేయము 4) శైవము 5) వైష్ణవము. గాణాపత్యులు- గణపతిని; సౌరులు – సూర్యుని; శాక్తేయులు – శక్తిని; శైవులు – శివుని; వైష్ణవులు – విష్ణువును ఆరాధించెడివారు. వీరిమధ్య పరస్పర అవగాహన కన్న పరస్పరవిద్వేషమే అధికముగా ఉండెడిది. ఒకరి దేవతను ఇంకొకరు ఆరాధించరు. కాని, వీరందరూ ఆరాధించుటకు అభ్యంతరము లేని ఒకే ఒక దేవత “గాయత్రి”. అట్టి వైశిష్ట్యము గాయత్రీ మాతకు ఉన్నది.

గాయత్రీ మంత్రమును ఎందుకు పఠించాలి?

బుద్ధులు పెడత్రోవ త్రొక్కకుండా ప్రచోదనము చేయునది గాయత్రి కాబట్టి, ముందుగా ఈ సద్భుద్ధికై “గాయత్రి” పఠించి అటు పైన పొందిన సద్భుద్ధితో మిగిలిన ఇతర మంత్రములను పఠించిన ఫలితము చేకూరును. ఈ కారణము వలన మిగిలిన మంత్రములకన్న ముందుగా గాయత్రి చేయవలెనని చెప్పుట జరిగినది. అంతేగాని ‘గాయత్రి ఒక్కటియే మంత్రము, మిగిలిన మంత్రములు పనికిరానివి’ అని అర్థము కాదు.

గాయత్రీ మంత్రము

గానము చేయదగిన గాయత్రీ మంత్రములో రెండు విధములైన మంత్రములు గలవు. 1) విశిష్ట గాయత్రి 2) జప గాయత్రి. ఇందులో జప గాయత్రిలో ప్రణవము (ఓంకారము), మూడు పాదములు మాత్రమే ఉండును. ఈ జపగాయత్రినే సాధారణముగా గాయత్రీ మంత్రముగా వ్యవహరింతురు. ఈ జపగాయత్రి ఈ క్రింద తెలిపిన విధముగా నుండును.

Gayatri Mantram In Words

పైన తెలుపబడిన జప గాయత్రీ మంత్రములో మొత్తము 29 అక్షరములు లెక్కకు వచ్చును. మరి గాయత్రీ మంత్రములో 24 అక్షరములు (చతుర్విగ్ ంశత్యక్షరా) వుండును అందురు గదా! మరి 29 వచ్చినవేమి ? పైన తెలిపిన మంత్రములో మూడు వ్యాహృతులు అనగా భూః, భువః, సువః, (కొందరు ‘సువః’ కు బదులు ‘స్వః’ అందురు. అయినను అర్థము మారదు.)

గాయత్రీ మంత్రపద విభాగము

ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య. ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్.

పదక్రమము:

తాత్పర్యము:

అందరికిని శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు, మన బుద్ధులను ప్రేరేపించునదియు ఎవరో – ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తి యొక్క (స్వయం ప్రకాశ ప్రసార గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము (గాక!) (ఈ గాయత్రీ మంత్రమునకు బహువచనములోనే గాక ఏకవచనములో గూడా అర్థ తాత్పర్యాదులు చెప్పుకొనవచ్చును.) ఇది ఒక వర్గమునకు, వర్ణమునకు, కులమునకు, మతమునకు, జాతికి, సంబంధించిన మంత్రము కాదనియు, సమస్త మానవాళి శ్రేయస్సును కోరు సహృదయులందరూ ఈ మంత్రమును ఒంటిరిగానైననూ, సామూహికముగా నైననూ ఉచ్చరించవచ్చుననియు ఈ మంత్ర తాత్పర్యమును బట్టి తేట తెల్లమగుచున్నది. ఇది సూర్యుని నుండి సౌరశక్తిని సూటిగా పొందుటకు భారతీయ ఋషులు దర్శించిన మంత్రము. భారతీయుల ప్రార్థనలు, మంత్రములు అన్నియు ఇదే విధముగా స్వార్థ రహితముగా సర్వజన శ్రేయోదాయకములుగా ఉండునని గ్రహించవలెను.

లోకాస్సమస్తాః సుఖినోభవంతు ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః, 

(సర్వలోక జీవులకు సుఖశాంతులు కలుగుగాక!)

హరిః ఓం తత్సత్

శ్రీ కృష్ణార్పణమస్తు

సంబంధిత ప్రశ్నలు:

సమాధానము :
“గాయంతాం త్రాయతే – ఇతి గాయత్రి” అనగా పాడిన కొలది రక్షించు మంత్రము గాయత్రి అని నిర్వచనములోనే ఉండగా ఈ సందేహము కలుగవలసిన పనిలేదు. మరియు, గాయత్రి వేదములోని మంత్రము. వేదమంతయు స్వరయుక్తము. బయటకు ఉచ్చరించినపుడే స్వర భేదము స్ఫుటముగా తెలియును గాని, లోపల నసిగినపుడు, గొణగినపుడు కాదు. అందుచేతనే స్వరయుక్త మంత్రములన్నియు బయటకు ఉచ్చరించుట తప్పుకాదు.

సమాధానము:
ఏ విద్యనైనను, ఏ మంత్రము నైనను నేర్చుకొనవలెనని అభిలాష, శ్రద్ధ, పట్టుదల కలిగిన వారు వాటిని చేర్చుకొనుటకు అర్హులే. ఆసక్తి, శ్రద్ధ కలుగుట అనగా బుద్ధి దానిపట్ల ప్రచోదనమగుట అనియే కదా! నిజమునకు ఆ మంత్రమును నేర్చుకొనవలెనని బుద్ధి పుట్టినపుడు మంత్రోపదేశము (Initiation) జరిగినట్లు లెక్క. ఆ తరువాత భౌతికముగా గురువు వద్ద ఉపదేశము పొందుట దానిని సమర్థించుచు (Ratify) చేయు ప్రక్రియయే!

సమాధానము:
అన్ని వర్ణములవారు గాయత్రిని చేసుకొనవచ్చును. ఆ మంత్రమును చేయుట తప్పనుకొనువారికి – వేరు, వేరు గాయత్రీ మంత్రములు గూడ కలవు. బ్రాహ్మణులకు అనుష్టుప్ ఛందస్సులో పై మంత్రము ఈయబడినది. (అనుష్టుప్ అనగా 8 అక్షరముల ఛందస్సు.

సమాధానము:
స్త్రీ, పురుషులందఱూ జీవాత్మలే ! అనగా జీవాత్మకు లింగభేదము లేదు. మైత్రేయి, గార్గి, అనసూయ మొదలగు వారు వేద శాస్త్రాదులు చదివిన వారే ! గాయత్రీ మంత్రమును జపించిన వారే ! చేయు పద్ధతిలో స్వల్ప భేదము ఉండునేమో గాని, సంధ్యా వందనము గూడ స్త్రీలకు నిషిద్ధము కాదు.

మరిన్ని పోస్ట్లు:

Also read