Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అమ్మవారి పుణ్యమి అని పిలిచే అమ్మవారు మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. అమ్మవారు అనగా దేవతా స్వరూపమైన తల్లి అని అర్థం. వివిధ ప్రాంతాల్లో అమ్మవారు వివిధ పేర్లతో పూజింపబడతారు. భారతీయుల విశ్వాసాలలో అమ్మవారు అన్ని శక్తులకు మూలమైన, సృష్టి, స్థితి, లయాలకు అధిపతిగా భావించబడతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అమ్మవారి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

దేవీ త్రినేత్రణీ

పావన స్వభావ దేవీ శ్రీదేవీ
(శంకరాభరణ స్వరాలు – త్రిశ్రం తాళం)

చ 1) దేవీ త్రినేత్రీణి దివ్య సుకృతి
నవ్య హరతీ
అవ్యయ హారతీ – దివ్యహారతి-సతీసార హారతీ॥

చ 2) జగములేల చాలును
నీ చరణ యుగళియే
చరణయుగళియే – చరణయుగళియే
కరుణ యుగళియే – సతీ పంచయుగలకీ॥

చ 3) నరసమాంబ ఆశ్రితవరా
సరస గుణగుణా
సరస గుణగుణా సరస గుణగుణా
సరస గుణగుణా సతీ సర్వగుణగుణా

జయ జయ హారతి జయ వరలక్ష్మీ

ప్రియనయ జయలక్ష్మీ వరలక్ష్మీ
(పున్నాగ వరాళి రాగం – ఆదితాళం)

పల్లవి: జయ జయ హారతీ జయవరలక్ష్మీ
జయ జయ మంగళ మమ్మా భవానీ

||జయ||

చ 1) పతిత పావనీ పాపవిమోచని
పరమ కృపాకరి శుభ శాంభవి

||జయ||

చ 2) కోటి సూర్య వంశాభరణీ
మాతా మహేశ్వరీ మము బ్రోవుమమ్మా

||జయ||

మణి మాణిక్యాంబ నీకు మహిత మంగళం

మాణిక్య వీణాపాణీ! మాణిక్యాంబా!
(పీలురాగ స్వరాలు – త్రిశ్రం తాళం)

చ 1) మనీ మాణిక్యాంబ నీకు మహిత మంగళం
దేవి నీదు పాదములకు దివ్యమంగళం

॥మణి॥

చ 2) దేవి నీకు సరిసమాను లెవరు లేరుగా
దేవరాజు మునులు పొగడ దివ్య మంగళం

॥మణి॥

మంగళ హారతిదే ఓ అనసూయాదేవీ

అమృతానందమయీ! అనసూయాదేవీ!
(హరికాంభోజి స్వరాలు – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: మంగళం హారతీదే శ్రీ అనసూయాదేవీ నీకు
మంగళహారతిదే శ్రీ అత్రిమహాముని అతివా

చ 1) చిన్ననాటి నుండి నీవు పతిభక్తితో మెలగి
నారద మహామునికి రాళ్లు సెనగలు చేసితిని

॥మం॥

లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవులు గూడి మిమ్ము
భంగము చేయుటకు పతులను వేడితి

॥మం॥

చ 3) ముగ్గురు మూర్తులు ఏక కాలము నందు
అతిధులై వచ్చిరట అత్రిమహాముని కడకు

॥మం॥

చ 4) అన్నంబు కూరలు అతివ వడ్డించగ
వంటి వస్త్రంబుతోటి వద్దుపో పొమ్మనిరి

॥మం॥

చ 5) పతివ్రతవు నీవు కనుక పతినామ స్మరణచేసి
కమండల ఉదకములో గ్రక్కున చల్లితివి

॥మం॥

చ 6) ముగ్గురు మూర్తులు ముద్దుబాలురై
ఉగ్గుబాలు పోసి నీవు ఉయ్యాల లూపితివి

॥మం॥

చ 7) లక్ష్మీ సరస్వతి మరి పార్వతీదేవి గూడి
పరుగున వచ్చితిరి ఆత్రిముని ఆశ్రమమునకు

॥మం॥

చ 8) పతిభిక్ష పెట్టమని పాదములపై బడగ
ఉయ్యాలలో బాలురను ఒడిలోను ఉంచితివి

॥మం॥

చ 9) తల్లీ మీకు మేము వరములిస్తామంటే
త్రిమూర్తులు నీ కడుపున పుట్టుటే కోరితివి

॥మం॥

చ 10) వరుసతో వారింట దత్తాత్రేయులై జన్మించి
సంతోష సాగరమున నోలలాడించితివి

॥మం॥

మంగళగిరికి మంగళ మివ్వరే

హరి మనోహర విహరీ గిరీ!
(మోహనరాగం – మిశ్రచాపుతాళం)

చ 1) మంగళ గౌరికి మంగళమివ్వరె
గంగాధరుని రాణి గౌరి పార్వతి

॥మం॥

చ 2) అష్ట హస్త్రములతో అవతరించినట్టి
దుష్ట సంహారిణికి తుహిన గిరిజకపుడు

॥మం॥

మంగళమిదే మాతా అన్నపూర్ణ

అర్ణవోదీర్ణా! అపర్ణా! అన్నపూర్ణా!
(పుష్పతిలకా రాగం – ఆదితాళమ్)

పల్లవి: మంగళమిదె మాతా అన్నపూర్ణా
రంగని సోదరి మగళాంబ నీకు

॥మం॥

చ 1) విశ్వ జనని నీదు మాతా అన్నపూర్ణ
విశ్వముల వాసి విశ్వనాధు రాణి

॥మం॥

చ 2) సాక్షి రూపిణివి మోక్షదాయినివి-మహ
లక్ష్మీ నా మొర విను విశాలాక్షి తల్లీ

॥మం॥

చ 3) సారసాక్షి నన్ను సరగను బ్రోవు
వారణాసి పురి గౌరీ భారతాంబ

॥మం॥

చ 4) మానసమున నీదు ధ్యాన మెపుడు మరువ
దాసురాల నిదే మంగళంబు నీకు

॥మం॥

రమణీ మంగళ మనరే

సుమనస సుమరస రమణీయ మణీ!
శ్రీలక్ష్మీ (వసంత రాగం – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: రమణీ మంగళ మనరే
కమలాల యకు నిట

॥రమణీ||

చ 1) సమద కుంజర యానకు సుకృత విధానకు
కమల రిపు బిండానకు
కర కమల ముకుళ భక్తాభిమానకు

॥రమణీ||

చ 2) లలిత పల్లవ పాణికి నీల జలధర నిభ వేణికీ
జలజ లోచను రాణికీ సాధు సుగుణ శ్రేణికి

॥రమణీ||

చ 3) కలుము లీనెడు మొలక నవ్వుల కలికికి తలిరుబోణికి
సారస దళ నేత్రికి – సౌమ్య
చారు శోభన గాత్రికి

॥రమణీ||

చ 4) భూరి కరుణా ధాత్రికి సర్వ వనితా మైత్రికి
క్రూరభవ త్రికాల మిత్రకు క్షీరపారావార పుత్రికి

॥రమణీ||

చ 5) పోషితాఖిల లోకకూ దురిత తాపన రాగకూ
శేష దాసావన సరోరుహ
శ్రీకరావళీ కమల లోకకు

॥రమణీ||

రమణీ నీకిదుగోనే రతనాల హారతి

అతులిత వితరణి బాణి! లక్ష్మీ
(కేదార రాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: రమణి నీ కిదుగోనే! రతనాల హారతి
హారతి గైకొని! అష్టఐశ్వరము లీయవే

॥రమణీ॥

చ 1) నిదుర కంటికి లేక నిన్ను నే ప్రార్థింతు
నన్ను మన్ననజేసి నళినాక్షి వర మీయవే

॥రమణీ॥

చ 2) అలరు బోణిరొ నీకు! అమరిన పూజలు
మహాలక్ష్మీ మమ్ము బ్రోవు! మాదేవి మామీద దయచూడు

॥రమణీ॥

చ 3) ఐదవతనము చాల! ఆతివ కోరితి నమ్మా
ఆలస్య మిక నేల! ఆనతియ్యవే తల్లీ

॥రమణీ॥

రాణి భారతి శర్వాణి భారతి

అజుని రాణీ! వీణా పుస్తక పాణి!
(సింధుభైరవి రాగం – ఆదితాళం)

చ 1) రాణీ భారతీ శార్వాణీ భారతీ
పాణిలోచనా గొనుము ఇదే ముత్యాల హారతి

॥ రాణీ ॥

చ 2) పల్లవా ధర మృధు వల్లనాధరా
మల్లెపూల సరు లొసగెద మగువ హారతి

॥ రాణీ ॥

చ 3) మధుర భాషిణీ ఈ మందహాసినీ
సదా కావలెనే ముదం బొప్పగా

॥ రాణీ ॥

మమ్ముల నేలిన లలితా హారతి

(భైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: మమ్ముల నేలిన లలితా హారతి
యమ్మగు నీ చరణముమ్మలే మా గతి
సమ్ముద మొప్పగ రమ్మమ్మా యిటు

॥మ॥

చ 1) అమ్మా రాజరాజేశ్వరీ దేవీ
నమ్మితి నీ చరణమ్ములే లలితా
నమ్మినకృప శ్రీ త్రిపుర సుందరీ
యిమ్మహి నను బ్రోవగ రమ్మమ్మా

॥మ॥

చ 2) పలుకుల తేనెలు చిలికిన
చిలుకల కొలికి లలిత లలితరస
గులికా తలపులు నిలిపితి నీపై
అలరుచు వచ్చీ ఆదుకొనుము సతి

॥మ॥

Ammavari Mangala Harathi Patalu With Lyrics

సుందరీ శుభవదన

ఆనంద నందన వన సుందరీ! త్రిపుర సుందరీ
(పూరీ కళ్యాణిరాగం – రూపక తాళం)

పల్లవి: సుందరీ శుభవదనా
వందన మిదె గొను త్రిపుర

॥సుందరీ॥

చ 1) అభయమిచ్చి బ్రోచునట్టి త్రిభువనేశ్వరి
శుభదాయని శంకరి కృపగొను కామేశ్వరి

॥సుందరీ॥

చ 2) దిక్కునీవే నమ్మియుంటి దీనన బ్రోవవే
మక్కువతో నీ పదములు మ్రొక్కెదనే మోహనాంగీ

॥సుందరీ॥

చ 3) నీదు మాయ తెలియతరమే హే దయానిధే అంబా

హారతి గొనుమా

సుమరస సుమ కోమలాంగీ బాల త్రిపుర సుందరీ
(జంఝాటిరాగం – జుంపె తాళం)

పల్లవి: హారతి గొనుమా కమలాలయా
రామా కర్పూరపు హారతి

॥హారతి ||

అనుపల్లవి: నారీ నీపాద వారిజములు
కోరెదను మది జయ హారతి

॥హారతి ||

చ 1) పల్లవ పాణి బాణి బాలికామణి
చాల నమ్మితి బాలరో యికజాల
మేలను బ్రోవగ జయహారతి

॥హారతి ||

చ 2) ఇందువదనా సింధుర మందగమనా
కుందరవదన బొగడగ జయహరతీ

॥హారతి ||

హారతు లివ్వరే నారీమణులారా!

పరమ పావనీ తిరుప్పావై ఆండాళ్ళదేవీ
(భైరవిరాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: హారతులివ్వరే నారీమణులారా
వారిజాక్షులు మా తల్లి ఆండాళ్ళుకు

॥హారతు॥

చ 1) పచ్చలు స్థాపిన పళ్ళెరములో
ముచ్చటలదీర మత్స్య కంఠులార

॥హారతు॥

చ 2) తల్లి తాయారుకు శ్రీదేవి భూదేవి
కెల్ల కోర్కెలిచ్చు కర్పూరాండాళ్ళుకు

॥హారతు॥

చ 3) తల్లి చంద్రమతి ద్రౌపది మానవతి
సకల కోర్కె లిచ్చి యాండాళ్ళుకు

॥హారతు॥

చ 4) కోరిన వారికి కొంగు బంగారమై
సమస్త కోర్కెలిచ్చు తల్లి యాండాళ్ళుకు

॥హారతు॥

ఆదరించి మమ్ము బ్రోచి చేకొను హారతి

॥సుందరీ॥

హారతి గొనుమా

సుమరస సుమ కోమలాంగీ బాల త్రిపుర సుందరీ
(జంఝాటిరాగం – జుంపె తాళం)

పల్లవి: హారతి గొనుమా కమలాలయా
రామా కర్పూరపు హారతి

॥హారతి ||

అనుపల్లవి: నారీ నీపాద వారిజములు
కోరెదను మది జయ హారతి

॥హారతి ||

చ 1) పల్లవ పాణి బాణి బాలికామణి
చాల నమ్మితి బాలరో యికజాల
మేలను బ్రోవగ జయహారతి

॥హారతి ||

చ 2) ఇందువదనా సింధుర మందగమనా
కుందరవదన బొగడగ జయహరతీ

॥హారతి ||

శ్రీరంగ మణికిని – శ్రితకల్పవల్లికిని

ధీమణి! సుమాణి! నభోమణీ బీబీ నాంచారీ
(మధ్మమావతి రాగం ఆదితాళం)

పల్లవి: శ్రీరంగమణీకని! శ్రితకల్పవల్లికిని
చిత్తజుని తల్లికిని! శ్రీపతికి
నారీ శిరోమణికిని! నవపద్మ పాణికి
నన్నేలు శ్రీరంగ! నాంచారునకు

||జయ మంగళం మహోత్సవ మంగళం||

చ 1) సొగసుగడు మెరయ! కర్పూరపు పరిమళము
ముదముగను జవాది! మేనలది
అగణితంబైనట్టి! హారములు ధరియించి
నగుచున్న శ్రీరంగ! నాంచారునకు

||జయ||

చ 2) కోటలేడును చుట్టు! కోవెలలు నూటారు
నాటుకొని కావేరీ! నడుమనున్న
నాటకుడు శ్రీరంగనాధు! వక్షము నందున
నటియించు శ్రీరంగ! నాంచారునకు

||జయ||

చ 3) బంగారు పళ్ళెరములో! భాసిల్లు నవరత్న
శృంగారమైన మంగళహారతి
అంగీకరించి మాకు! అఖిల సంపదలొసగు
రంగైన శ్రీరంగ నాంచారునకు

||జయ||

సర్వం హనుమదర్పణమస్తు

Ammavari Mangala Harathi Patalu

లలితా హారతి

శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత – పసిడి పాదాలకిదె నీరాజనం
రమేశ్వరుని పుణ్యభాగ్యాలరాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజం

– బంగారు తల్లికిదె నీరాజనం

1. బంగారు హారాలు సింగారు మొలకించు అంబికా హృదయకూ నీరాజనం
శ్రీగౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీసింహాసనేశ్వరికి నీరాజనం

||బంగారం||

2. కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతొ నీరాజనం
పాశాంకుశ పుష్పబాణ చాపదారికి, పరమపావనమైన నీరాజనం

||బంగారం||

3. కాంతి కిరణాలతో కలికిమెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం
కాంతలందరి పసుపు-కుంకుమలు కాపాడు కాత్యాయినికి నిత్యనీరాజనం

||బంగారం ||

4. చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
కలవరేకులవంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం

||బంగారం||

5. ముదమారమోమున ముచ్చటగ ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్యలహలకిదే నీరాజనం

||బంగారం||

6. శుక్రవారము నాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మీకిదే నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి, శారదామాయికిదే నీరాజనం

||బంగారం||

7. ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్యనీరాజనం
జన్మజన్మల తల్లి జగధీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం

||బంగారం||

8. సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్యనీరాజనం బంగారం తల్లికిదే నీరాజనం

||బంగారం||

అంబ నీకిదిగో మంగళ త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం

||బంగారం||

మంగళ హారతి

రచయిత : బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం – కెంపైన నీరాజనం

– భక్తి పెంపైన నీరాజనం.

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం – బంగారు నీరాజనం

– భక్తి పొంగారు నీరాజనం.

నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మా తల్లి గాజులకు నీరాజనం – రాగాల నీరాజనం

– భక్తి తాళాల నీరాజనం.

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం – ముత్యాల నీరాజనం భక్తి

– భక్తి జతనాల నీరాజనం.

చెకిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగరకు నీరాజనం – రతనాల నీరాజనం

– భక్తి జతనాల నీరాజనం.

పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం – అనురాగ నీరాజనం

– భక్తి కనరాగ నీరాజనం.

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మా తల్లి కుంకుమకు నీరాజనం – నిండైన నీరాజనం

– భక్తి మెండైన నీరాజనం.

తేటిపిల్లల వోలె గాలి కల్లలనాడు.
మా తల్లి కురులకు నీరాజనం – నీలాల నీరాజనం

– భక్తి భావాల నీరాజనం.

జగదేకమోహిని, సర్వేశగేహిని
మా తల్లి రూపునకు నీరాజనం – నిలువెత్తు నీరాజనం

– భక్తి విలువెత్తు నీరాజనం.

మరిన్ని భక్తి గీతాలు : 

Leave a Comment