BhaktiVed

Kaliyugam In Telugu – కలియుగం

नीति कथाएँ2024-05-23

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కలియుగం నీతికథ.

కలియుగం

[అయిదువేల సంవత్సరాల క్రితమే వ్యాసమునీంద్రుడు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించాడో చదివితే ఆయన దూరదృష్టి వివేకవంతులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కనక సావధానంగా చిత్తగించండి.]

అరణ్యవాసం సాగిస్తున్న రోజులలో పాండురాజు వండములకు మార్కండేయ మహామునీంద్రుని దర్శన భాగ్యం లభించింది.

ఆ చిరంజీవి వారికి ఎన్నెన్నో విశేషాలు, కథలు చెపుతూ తాను ఒకానొకప్పుడు చూపిన కలియుగం ఎలా ఉన్నదో వివరిస్తున్నాడు.

ధర్మనందనా !
కృతయుగంలో రాజు ఉండడు. సేనలు ఉండవు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మపరాయణులు, సత్యవాక్పాలకులు, అహింసా నృతదీక్షితులు. అటువంటి సమయంలో సేనలూ, రాజులూ అవసరం లేదు.

త్రేతాయుగంలో సత్య, ధర్మాలకు కొంత హాని జరుగుతుంది. ధర్మం మూడు పాదాలే ఉంటుంది. అందువల్ల రాజు, సేన ఏర్పడతాయి.

ద్వాపర యుగంలో సగం మంది అధర్మ పరాయణులే. యుగాంత వేళకే కలియుగ లక్షణాలు కూడా ప్రవేశిస్తాయి. అయినా ద్వాపరయుగంలో ధర్మానికే విజయం. సత్యవ్రత పరిపాలకులే ప్రభువు అవుతారు.

ఇక కలియుగం
ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చెయ్యగలడో వాడు సింహాసనం ఎక్కి అధికారం చెలాయిస్తాడు.

అటువంటి వారు అధికారులయినప్పుడు వివేక వంతులకు, కామ లకూ స్థానం ఉండదు. అందువల్ల అవివేకులూ, జ్ఞానశూన్యులూ ఉన దేశాలిస్తూ ధన సంపాదన ఆరంభిస్తారు.

వేదాధ్యయనమూ, సత్క్రతువులూ సాగించి పరబ్రహ్మను ఆరా ధించుకోవలసిన విప్రవరులు ఆ రెండూ విడిచి అన్ని రకాల పానీయాలూ సేవిస్తూ, రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు. లోకానికి సన్మార్గం చూపవలసిన వీరే యిటువంటి దురాచారాలకూ, దుర్వ్యసనాలకూ లొంగితే వీరి ననుసరించవలసిన వారు ఏమవుతారో వేరే చెప్పాలా!

అసత్యవాదులూ, అల్పాయుర్దాయం కలవారూ పుడుతుంటారు, అంతేకాదు, ఇప్పటివలె ఆజానుబాహులూ, తాళప్రమాణదేహులూ పుట్టరు. మరుగుజ్జులు ఎక్కువవుతారు. నేల ఉసిరిచెట్టుకి నిచ్చెన వేసి ఎక్కవలసిన అంగుష్ఠమాత్ర శరీరాలవారు పెరుగుతారు. వీరికి కామవాంఛ ఎక్కువ. అందుకోసం మద్యపానం విరివిగా సాగిస్తారు. మరో విచిత్రం

ఆహార పదార్థాలలో రుచి ఉండదు. అన్నీ ఎండుగడ్డిలా ఉంటాయి. అసలు వీరి నాలుకకు రుచి తెలియదు, దొరికిన పదార్థం తినడమే.

అంతకన్న ఆశ్చర్యం ఏమిటంటే
సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు.
ఆ యుగంలో మనుషులకు పదహారేళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడి పోతుంది.

ఏడెనిమిది సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులవుతారయ్యా !
మానవుడి పూర్ణాయుర్దాయం ఎంత ఉంటుందో తెలుసా !
పదహారేళ్ళు అంతే !
అప్పటికే అన్నీ తీరిపోతాయి.
మత్స్యమాంసాలు తిననివారు కనిపించరు.

దానితో మద్యపానం విలాసంగా తయారవుతుంది. జూదరులు వాడవాడలా పెరుగుతారు. ఇవన్నీ ఘనకార్యాలుగా భావిస్తారు.

ఏ రోజు తెల్లవారి లేచినా
హత్యలూ, దొమ్మీలు, దోపిడీలు యివే కనిపిస్తాయి. వీటిని గురించే చెప్పుకుంటారు.

గోళ్ళూ, వెంట్రుకలూ విపరీతంగా పెంచుకుని రాజవీథులలో తిరిగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి రోజులలో నాస్తికులు కూడా ప్రబలుతారు కదా ! అది ఒక వ్యాపారంగా బ్రతుకుతారు.

పోనీ మనుషులు ఎలా తయారయితే ఏం? అనుకుంటే వీరు తమ అవసరం కోసం వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల పాలు పితకడం వల్ల అవి అనారోగ్యంతో మరణిస్తాయి. గో సంపద క్షీణిస్తుంది.

గోవుల పాలే కదటయ్యా ! మానవులకు అమృతం. అది లేకుండా చేసుకుంటారు కలియుగ మానవులు.

ఆ సమయంలో అధికారులందరూ జలగలు రక్తం పీల్చినట్లు ప్రజలను హింసించి పన్నులు పిండుతారే తప్ప వారి రక్షణ విషయం చూడనే చూడరు.

పాపిష్ఠి డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు. తండ్రిని కొడుకు మన్నించడు. భర్తను భార్య ఎదిరిస్తుంది. జనపనార వంటి వానితో తయారయిన వస్త్రాలు ధరించి తిరుగుతారు.

కన్యాదానాలు, వివాహాలూ ఉండవు. వయసు వచ్చిన ఆడపిల్లలు తమకు వచ్చిన యిద్దరు ముగ్గురు యువకులతో హాయిగా విహారాలు సాగిస్తారు. అదే దాంపత్యం.

శ్మశానాలలో దూరంగా ఉండవలసిన ఎముకలు తెచ్చి రకరకాల బొమ్మలు చేసి గృహాలలో అలంకరించి సంతోషిస్తారు.

ధర్మనందనా !
ఇప్పుడు విద్య నేర్చుకునే వాడికి అన్నం పెట్టి, నీడయిచ్చి, విద్య నేర్చే, ఆశ్రమాలు చూస్తున్నావు. అలానే ఆకలితో కడుపు చేతబట్టి గుమ్మంలో నిలిచి ‘దేహి’ అన్న పిలుపు వినబడితే ఆదరంతో అన్న దానం చేసే సంసారులు కనిపిస్తున్నారు.

కలియుగంలో అన్న దానం, విద్యాదానం ఉండవు. అన్నాహారాలు అమ్ముకుంటారు. విద్యకూడా వ్యాపార వస్తువే అవుతుంది.

అన్నవిక్రయం, విద్యావిక్రయం ఆరంభించాక యింక ఏం జరుగుతుందో ఊహించలేవు.

అలా కొంతకాలం కలియుగం గడిచాక అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం, పూర్ణిమ ప్రవేశించకుండా చంద్రగ్రహణం ఏర్పడతాయి.

ప్రజలకు పచ్చని పొలాలూ, తోటలూ ఉంటే నదీ తీరాలలోని పల్లెల మీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుతారు. అందరికీ నగర వాస వ్యామోహమే। పల్లెలు నిర్జన ప్రాంతాలు అవుతాయి. పంటలు నశిస్తాయి.

యుగాంత సమయంలో ఝంఝామారుతం రేగుతుంది. అది నిర్విరామంగా సాగుతుంది.

ఏడుగురు సూర్యులు ఉదయిస్తారు. భగభగలాడుతూ అగ్ని జ్వాలలు. అలా గడిచాక అంతా బూడిద అవుతుంది.

అప్పుడు కుండపోతగా కొంతకాలం వాన కురుస్తూనే ఉంటుంది. ఆది యుగసంధి.

నెమ్మదిగా ఈ బీభత్సాలు చల్లారుతాయి. రవి, గురు, చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు.

కాలానికి అవసరంగా వానలు, ఎండలు ఉంటాయి. భూమి పచ్చ పచ్చని చెట్లతో, లతలతో, ఫల, పుష్ప భరితం అవుతుంది.

ప్రజలు జరా రోగపీడలు లేకుండా అన్న దాన, విద్యాదానాది సత్కార్యాలతో సుఖంగా ఉంటారు”. అది కృతయుగం.
అన్నాడు మార్కండేయుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

ये भी पढ़ें

Sri Krishnadevaraya Krta Amuktamalyada Loni katha In Telugu – శ్రీ కృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథఅది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం) మనకందించిన, పేరు పొందిన పద్యాలలో ఒకటైనా పద్యం శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్…Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథనీతికథలు శివాజీ వీరగాధలలోని కథ నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ. హీరాకానీ దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాప…Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథనీతికథలు శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ. ప్రవరాఖ్యుని కథ అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ…Asraya parityaga doshamu In Telugu – ఆశ్రయ పరిత్యాగ దోషమునీతికథలు శ్రీ స్కాంద పురాణము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము . ఆశ్రయ పరిత్యాగ దోషము ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దే…Santruptini Minchina Sampada Ledu – సంతృప్తిని మించిన సంపద లేదునీతికథలు శ్రీమద్భాగవతము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు . సంతృప్తిని మించిన సంపద లేదు సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బ…Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌నీతికథలు శ్రీమద్రామాయణం లోని నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌ . వినయం వివేక లక్షణమ్‌ పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్…