BhaktiVed
अपने नाम से दिवाली Wishes · WhatsApp Status

Kulam Kadu Gunam Pradhanam In Telugu – కులం కాదు గుణం ప్రధానం

नीति कथाएँ2024-05-25

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కులం కాదు గుణం ప్రధానం నీతికథ.

కులం కాదు గుణం ప్రధానం

(ఇది ఆరణ్యపర్వంలో మార్కండేయ మహాముని చెప్పిన కథ. దీన్నిబట్టి, కుల వర్గ విద్వేషాలు ఈవాటి నాగరిక సమాజంలో బలిసినంతగా ప్రాచీన కాలంలో ఉండేవి కావనీ, మంచి విషయం ఎవరి దగ్గర ఉన్నా గ్రహించవలసినదేనని తెలుసు కోవాలి.)

కులం కారణంగా ఉన్నత స్థానాలు, మర్యాదలు యివ్వడం ఈ వాడు పెరిగినంతగా భారతకాలం నాడు లేనేలేదు. గుణం ప్రధానంగా మనిషిని మర్యాద చేయడం అందరూ ఎఱిగిందే. అటువంటి అంశం

ఒకానొక గ్రామానికి సమీపంలో ఒక వనం. ఆ వపంలో ప్రశాంత ప్రదేశం. అక్కడొక చిన్ననది. ఆ నది ఒడ్డునే చక్కని నిడనిచ్చే పెద్ద చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని ఒక విపుడు తపస్సు చేసుకుంటూ, మధ్యాహ్నం కాగానే గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేసి జీవితం గడుపు తున్నాడు.

అలా తపస్సు చేసుకునే రోజులలో …..
ఓకనాడు
ఆయన భిక్షాటనకు లేచే సమయంలో చెట్టుమీది కొంగ రెట్ట వేసింది. అది ఆయన మీద పడింది.
అంతలో ఆయనకు చాలా కోపం వచ్చింది. అంతే: కన్నులు ఎర్రజేసి పై కి చూశాడు.

చూసిన మరుక్షణంలో ఆ కొంగ మాడి పడిపోయింది.
ఆయన యథాప్రకారం గ్రామంలో భిక్షకువెళ్ళి, ఒక యింటి గుమ్మంలో నిలబడి: ‘భవతి భిక్షాం దేహి”, అన్నాడు.
ఆ మాట చెవిని పడగానే యింట్లోని గృహలక్ష్మి ఆయనకు భిక్ష తేవడానికి వంటయింటి వయిపు నడిచింది.

అదే సమయానికి ఆమె భర్త దూర ప్రయాణం చేసి యింటికి వచ్చాడు.

భర్తన చూడగానే ఆమె చల్లని నీటితో ఆయన పాదాలు కడిగి, విసన కర్రతో కొంతసేపు విసిరి, భోజనం చేయించి, పరుండాక, భిక్ష తీసుకుని వీథిలోకి వచ్చింది.

అక్కడ నిలబడ్డ ముని కోపంగా చూశాడు. అప్పుడామె :
“స్వామీ! మీ కోపానికి మాడిపోయే కొంగను కాను. భర్తను మరెవరి విషయమయినా చూసుకుంటాను. పతి
సేవను మించిన పరమార్థం వేరే లేదు, నాకు ‘

అని నిలబడింది.
అప్పుడా ముని తెల్లబోయి :
‘అమ్మా! ఎక్కడో, అడవిలో జరిగిన నా కథ నీకు ఎలా తెలి సింది ? నాకు జ్ఞానబోధ చెయ్యి తల్లీ’, అని ప్రార్థించాడు.

గృహిణి : ‘మునీశ్వరా ! ఇక్కడకు కొద్ది దూరంలో మిథిలానగరం ఉంది. అక్కడ ఒక బోయవాడు మాంస విక్రయం చేసి జీవితం గడుపు తున్నాడు. వానిపేరు ధర్మవ్యాధుడు. ఆయన మీకు సర్వవిషయాలూ బోధిస్తాడు, వెళ్ళండి’, అంది. ఆయన బయలుదేరి నడిచి నడిచి మిథిలా నగరం చేరాడు.

నగరంలో అడుగు పెడుతూనే ధర్మవ్యాధుని నివాసం గురించి అడిగి, తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరాడు.
బడ్డాడు.

అక్కడ రకరకాల జంతువుల మాంసాలు చూసి దూరంగా నిం

వచ్చిన మునిని అంత దూరంలో చూసి ధర్మవ్యాధుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి:

‘ ఆర్యా ! ‘ ప్రణామాలు. మిమ్ము నా దగ్గరకు పంపిన పతివ్రతా శిరోమణి క్షేమంగా ఉన్నదా ? అని అడిగాడు.

వచ్చిన మునికి మతిపోతోంది.

‘అక్కడ ఆ యిల్లాలు కొంగ విషయం చెప్పింది. ఈ ధర్మ వ్యాధుడు ఆ ప్రతివ్రత క్షేమం అడిగాడు. ఇంతకాలంగా తపస్సు చేసినా ఏ శక్తి సాధించ లేకపోయాము,

ఆవిడ పతివ్రత కనుక ఆ వ్రత దీక్షతో దూరదృష్టి వచ్చి ఉండవచ్చు.

జంతువుల మాంసం అమ్ముకునే ఈ కసాయి వానికి ఇంత శక్తి ఎలా వచ్చింది’ అని ఆలోచనలో పడ్డాడు.

అది గ్రహించి ధర్మవ్యాధుడు :
‘స్వామీ! ఈ మాంసపు వాసన మీరు భరించలేరు. రండి మా యింటికి వెడదాం. నాకు యింతటి శక్తి ఎలా వచ్చిందని ఆలోచిస్తు న్నారు కదూ ! ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను ”

అని వినయంగా యింటికి తీసుబవెళ్ళాడు. వెడుతూనే వాకిట్లో మంచంమీద పడుకున్న, ముసలి తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన యోగ క్షేమాలు విచారించి, లోపల గడపలో ఉన్న తల్లికి నమ స్కరించి, ఆవిడకు సేవచేసి :

‘స్వామీ! ఇదే నేను చేసేవి. మనం ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు జరిపినా, తల్లి దండ్రులను సేవించుకోకపోతే ప్రయోజనం లేదు.

తొమ్మిది మాసాలు గర్భంలో మనలను భరించి, ప్రసవవేదనపడి, మనకు జన్మనిచ్చి, నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ మన ఆరోగ్యం కోపం ఆ తల్లి ఎన్నో అవస్థలు పడుతుంది.

అటువంటి తల్లి ఋణం ఎన్ని సేవలు చేసినా తీరుతుందా?
అలానే మన భవిష్యత్తుకు పునాదులు వేసి, మనకోసం ఎన్నో బాధలు పడే తండ్రి ఋణం కూడా తీరదు.
అయినా వారిని సేవించుకోవడం వల్ల కొంత ఋణ భారం తగ్గుతుంది.

వీరిని సేవించు కోవడం కంటె నేను చేసే సాధన ఏమీలేదు. దాని వల్లనే నేను సుఖంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. తల్లి దండ్రులను సేవించుకుంటూ ఆలుబిడ్డలను రక్షించుకుంటూ జీవితం నడుపుతున్నాను. అంతే! మరేంలేదు. మీకు మరో సందేహం కలిగి ఉంటుంది. మాంసం అమ్ముకుని బ్రతుకుతున్నాను కదా! అది జీవహింస కాదా, దానిపిల్ల పాపం కదా అని. ఇక్కడ తమ కొక పరమ రహస్యం చెప్పాలి.

అదీ ధర్మ సూక్ష్మం అంటే –
ఈ భూగోళంలో ప్రాణికోటి అంతా ఒక దానిమీద ఆధారపడి మరొకటి జీవిస్తున్నది. రెక్కలు విప్పుకు ఎగిరే పక్షులూ, నాలుగు కాళ్ళ జంతువులూ యివే ప్రాణులని మీరు అనుకుంటున్నారు. మీరు తినే ధాన్యం, కాయగూరలు, పళ్ళు అన్నింటిలోనూ జీశం ఉన్నది. అయితే అవి పక్షులవలె ఎగరడం లేదు కనక జీవం లేదనుకోవడం న్యాయమా।

జీవి బ్రతికి, పెరగడానికి మరోజీవం బలికాక తప్పదు.
అలాకాదు, యిదే జీవహింస అంటారా!
నేను మానినింతలో నా దుకాణానికి వచ్చేవారందరూ మాంసా హారం వదులుతారా ! అందుచేత మీరు ఈ అనుమానం వదిలేయండి. ప్రాణాలు నిలిపు కోవడానికి ఆవశ్యకమయిన ఆహారంకోసం జరిపేది హింసకాదు.

మరొశ్రమాలు ఈ జంతువులను ఎవరో సంహరించి తెస్తారు. నా వృత్తి ధర్మానుసారం దీనిని విక్రయం చేసి బ్రతుకుతాను.

వ్యాపారంలో దొంగ తూకాలూ, అధిక లాభాలూ నేనెరుగను.
నా ధర్మాన్ని నేను విడిచి పర ధర్మాన్ని స్వీకరించము. ఆకలి గొన్న వారికి పిడికెడు అన్నం పెడతాను. నా మీద ఆధారపడి జీవించే వారందరి యోగ క్షేమాలు తెలుసుకుంటాను. ఇరుగు, పొరుగులవారి కష్ట సుఖాలలో భాగం పంచు కుంటాను.

అన్నిటినీ మించిన విషయం –

ఈ మనస్సు ఉన్నదే యిది స్థిరంగా నిలబడదు. ముందు దీన్ని లొంగదియ్యాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిర్మల బుద్ధితో నిరంతరం పరమేశ్వరారాధనం చెయ్యాలి.

నేను చేసేది యింతే! ఈ మాత్రం చెయ్యగలిగితే మనకు ఏ బాధలూ ఉండవు, ఈ జీవితం ఎంతవరకూ పరోపకారానికి ఉపయోగపడితే అంత ధన్యం’ అని బోధించాడు.

గొడ్డు మాంసం అమ్ముకుని జీవించే బోయవాడు చేసిన ప్రబోధంతో మనస్సు నిర్మలమై ప్రశాంతంగా వాని వద్ద సెలవు తీసుకుని తపస్సు కేసుకునేందుకు వెళ్ళాడాయన.

మరిన్ని నీతికథలు మీకోసం:

ये भी पढ़ें

Sri Krishnadevaraya Krta Amuktamalyada Loni katha In Telugu – శ్రీ కృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథఅది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం) మనకందించిన, పేరు పొందిన పద్యాలలో ఒకటైనా పద్యం శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్…Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథనీతికథలు శివాజీ వీరగాధలలోని కథ నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ. హీరాకానీ దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాప…Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథనీతికథలు శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ. ప్రవరాఖ్యుని కథ అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ…Asraya parityaga doshamu In Telugu – ఆశ్రయ పరిత్యాగ దోషమునీతికథలు శ్రీ స్కాంద పురాణము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము . ఆశ్రయ పరిత్యాగ దోషము ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దే…Santruptini Minchina Sampada Ledu – సంతృప్తిని మించిన సంపద లేదునీతికథలు శ్రీమద్భాగవతము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు . సంతృప్తిని మించిన సంపద లేదు సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బ…Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌నీతికథలు శ్రీమద్రామాయణం లోని నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌ . వినయం వివేక లక్షణమ్‌ పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్…