Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిః

గౌరీ అష్టోత్తర శతనామావళిః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గౌరీ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Gowri Ashtottara Shatanamavali Telugu

గౌరీ అష్టోత్తర శతనామావళిః

  • ఓం గౌర్యై నమః
  • ఓం గిరిజాతనూభవాయై నమః
  • ఓం జగన్మాత్రే నమః
  • ఓం వీరభద్రప్రసువే నమః
  • ఓం విశ్వరూపిణ్యై నమః
  • ఓం కష్టదారిద్య్రశమన్యై నమః
  • ఓం శాంభవ్యై నమః
  • ఓం బాలాయై నమః
  • ఓం భద్రాదాయిన్యై నమః
  • ఓం సర్వమంగళాయై నమః
  • ఓం మహేశ్వర్యై నమః
  • ఓం మంత్రారాధాయ్యై నమః
  • ఓం హేమాద్రిజాయై నమః
  • ఓం పార్వత్యై నమః
  • ఓం నారాయణాంశజాయై నమః
  • ఓం నిరీశాయై నమః
  • ఓం అంబికాయై నమః
  • ఓం మునిసం సేవ్యాయై నమః
  • ఓం మేనకాత్మాజాయై నమః
  • ఓం కన్యకాయై నమః
  • ఓం కలిదోషవిగాతిన్యై నమః
  • ఓం గణేశజనన్యై నమః
  • ఓం గుమాంబికాయై నమః
  • ఓం గంగాధరకుటుంబిన్యై నమః
  • ఓం విశ్వవ్యాప్తిన్యై నమః
  • ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
  • ఓం శివాయై నమః
  • ఓం శాంకర్యై నమః
  • ఓం భవాన్యై నమః
  • ఓం మాంగల్యదాయిన్యై నమః
  • ఓం మంజుభాషిణ్యై నమః
  • ఓం మహామాయాయై నమః
  • ఓం మహాబలాయై నమః
  • ఓం హైమవత్యై నమః
  • ఓం పాపానాశిన్యై నమః
  • ఓం నిత్యాయై నమః
  • ఓం నిర్మలాయై నమః
  • ఓం మృడాన్యై నమః
  • ఓం మానిన్యై నమః
  • ఓం కుమార్త్యె నమః
  • ఓం దుర్గాయై నమః
  • ఓం కాత్యాయిన్యై నమః
  • ఓం కమలార్చితాయై నమః
  • ఓం కృపాపూర్ణాయై నమః
  • ఓం సర్వమయ్యై నమః
  • ఓం సర్వస్వత్యై నమః
  • ఓం అమరసం సేవ్యాయై నమః
  • ఓం అమృతేశ్వర్యై నమః
  • ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః
  • ఓం బాల్యారాధితభూతదాయూ నమః
  • ఓం హిరణ్యయై నమః
  • ఓం సూక్ష్మాయై నమః
  • ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
  • ఓం సర్వభోగప్రదాయై నమః
  • ఓం సామశిఖరాయై నమః
  • ఓం కర్మబ్రహ్మమయ్యై నమః
  • ఓం వాంఛితార్ధదాయై నమః
  • ఓం చిదంబర శరీరిణ్యై నమః
  • ఓం దేవ్యై నమః
  • ఓం కమలాయై నమః
  • ఓం మార్కండేయవరప్రసాదాయై నమః
  • ఓం పుణ్యాయై నమః
  • ఓం సత్యధర్మరతాయై నమః
  • ఓం శంకరూపిణ్యై నమః
  • ఓం బగళాయై నమః
  • ఓం మాతృకాయే నమః
  • ఓం సత్యై నమః
  • ఓం కల్యాణ్యై నమః
  • ఓం సౌభాగ్యదాయై నమః
  • ఓం అమలాయై నమః
  • ఓం అన్నపూర్ణాయై నమః
  • ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
  • ఓం అంబాయై నమః
  • ఓం భానుకోటి ప్రభావత్యై నమః
  • ఓం పరాయై నమః
  • ఓం శీతాంశుకృత శేఖరాయై నమః
  • ఓం సర్వకాలసుమంగల్యై నమః
  • ఓం సామశిఖరాయై నమః
  • ఓం వేదాంతలక్షణాయై నమః
  • ఓం కామకలనాయై నమః
  • ఓం చంద్రార్కాయుత తాటంకాయై నమః
  • ఓం శ్రీచక్రవాసిన్యై నమః
  • ఓం కామేశ్వరపత్న్యై నమః
  • ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
  • ఓం పుత్రపౌత్ర వరప్రదాయై నమః
  • ఓం పురుషార్థప్రదాయై నమః
  • ఓం సర్వసాక్షిణ్యై నమః
  • ఓం శ్యామలాయై నమః
  • ఓం చండై నమః
  • ఓం భగమాలిన్యై నమః
  • ఓం విరజాయై నమః
  • ఓం స్వాహాయై నమః
  • ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
  • ఓం దీక్షాయణ్యై నమః
  • ఓం సర్వవస్తూత్తమాయై నమః
  • ఓం శ్రీవిద్యాయై నమః
  • ఓం షోడశాక్షర దేవతాయై నమః
  • ఓం స్వధాయై నమః
  • ఓం ఆర్యాయై నమః
  • ఓం దీక్షాయై నమః
  • ఓం శివాభిదానాయై నమః
  • ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
  • ఓం నాదరూపాయై నమః
  • ఓం త్రిగుణాంబికాయై నమః
  • ఓం శ్రీమహాగౌర్యై నమః

మరిన్ని అష్టోత్తరములు:

Vande Shivam Shankaram In Telugu – వందే శివం శంకరమ్

Vande Shivam Shankaram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వందే శివం శంకరమ్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Vande Shivam Shankaram Lyrics Telugu

వందే శివం శంకరమ్

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే సర్వజగద్విహారమతులం వందేన్దక ధ్వంసినం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హారే ర్వల్లభమ్!
వందే క్రూరభుజంగ భూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే దివ్యమచిన్త్య మద్వయ మహం వందే ర్క దర్పాపహం
వందే నిర్మల మాదిమూల మనిశం మఖ ధ్వంసినమ్ !
వందే సత్యమనన్త మాద్యమభయం వందే శాన్తాకృతం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్ధి తూణీరకమ్!
వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్థ గంగాధరమ్ !
వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృత నిధిం వందే నృసింహాపహమ్!
వందే విప్రసురార్చితాంఘ్ర కమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్
వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే హంస మతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూత గణేశ మవ్యయ మహం వందే ర్థ రాజ్యప్రదమ్ !
వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలంధరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్డే నకారాపహం
వందే రావణ నందిభృంగి వినతం వందే సుపర్ణావృతమ్!
వందే శైల సుతార్ధ భాగవపుషం వందే భయంత్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్దేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్!
వందే జహ్నుసుతారి మికేశ మనిశం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

మరిన్ని స్తోత్రములు

Sri Markandeya Kruta Shiva Stavam In Telugu – శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్

Sri Markandeya Kruta Shiva Stavam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్ గురించి తెలుసుకుందాం…

Sri Markandeya Kruta Shiva Stavam Lyrics

శ్రీ మార్కండేయ కృత శివస్తవమ్

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
సింజినీ కృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం |
క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

1

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్ర సరోరుహం |
దేవ సింధు తరంగ శీకర సిక్త శీత జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

2

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం |
అంధకాంతక మాశ్రితామర పాదపం మదనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

3

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహం |
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః |

4

యక్ష రాజ సఖం భగాక్ష హరం భుజంగ కళేబరం
శైలరాజ సుతాపరిష్కృత చారుదివ్య విభూషణం |
క్ష్వేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

5

ఔషధం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం ।
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

6

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినం |
క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమావృతం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతివై యమః ||

7

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |
సోమవారి నభోహుతాశన సోమవా ద్యఖిలాకృతిం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||

8

మృత్యుభీత మృకండు సూనుకృతస్తవం శివసన్నిధౌ |
యత్రకుత్రచయః పఠేన్నహి తస్య మృత్యు భయంభవేత్ ||
పూర్ణ మాయు రరోగితా మఖిలార్థ సంపద మాదరాత్ ।
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః ॥

చంద్రశేఖర చంద్రశేఖర – చంద్రశేఖర పాహిమాం |
చంద్రశేఖర చంద్రశేఖర – చంద్రశేఖర రక్షమామ్ ||

ఇతి శ్రీమార్కండేయ కృత శివస్తవమ్

మరిన్ని స్తోత్రములు

Anganaku Virahame Singaramaya In Telugu – అంగనకు విరహమే సింగారమాయ

అంగనకు విరహమే సింగారమాయ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అంగనకు విరహమే సింగారమాయ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనకు విరహమే సింగారమాయ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 21
కీర్తన: అంగనకు విరహమే సింగారమాయ
సంఖ్య : 415
పుట: 277
రాగం: చారుకేశి

చారుకేశి

65 అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవేయిది చిత్తగించవయ్యా

||పల్లవి||

కలికి నిన్ను తలచి గక్కున లోలో కరగి
జలజల చెమరించి జలకమాడే
బలు తమకాన నీకు పక్కన నెదురువచ్చి
నిలువున కొప్పు వీడి నీలి చీర గప్పెను.

||అంగన||

సుదతి నిన్ను చూచి సోయగపు సిగ్గులను
పొదలి చెక్కుల దాకా పూసె గంధము
మదన మంత్రములైన మాటల మర్మము సోకి
ముదురు పులకలను ముత్యాలు గట్టెను.

||అంగన||

గక్కన కాగిట నిన్ను కలసి ఈ మానిని
చొక్కి చంద్రాభరణపు సొమ్ములు వెట్టే
అక్కున శ్రీ వేంకటేశ అలిమేలుమంగ నీకు
దక్కి సరసములను తలబాలు వోసెను.

||అంగన||

అవతారిక:

నీ అగ (అలిమేల్మంగ)కు విరహతాపమే గొప్ప సింగారమయ్యిందయ్యా శ్రీనివాసా! ఆమెను సమీపించి నీవే యిది గమనించవయ్యా! అని నచ్చచెబుతున్నారు అన్నమాచార్యులవారు. అమలిన శృంగారంతో జగతికి ఆదిదంపతులను కీర్తించటం మధురభక్తి క్రింద పెద్దలు తార్కాణించారు. వారు యౌవన ప్రాంగణంలోని ప్రేయసీ ప్రియులు కాదు, శృంగార సామ్రాజ్యాన్ని యేలే సామ్రాట్టు, సామ్రాజ్ఞి.
అమ్మవారికి ముదురు పులకల ముత్యాల సరాలు పేర్చిన పదకవితాపితామహునికి జోహారు అనకుండా యెలవుండగలము చెప్పండి. శృంగారాన్ని గోప్యత కొంతకప్పాలనే నా ఉద్దేశ్యము కూడా.

భావ వివరణ:

ఆహా! ఈ అంగనకు (యువతికి) తను పొందే విరహమే సింగారమై (గొప్ప అలంకరణ వలె) భాసించుచున్నది. ఓ ప్రభూ! చెంగట (ఆమెను చేరి) నీకు నీవే ఇది చిత్తగించవయ్యా (అర్థం చేసికొనుమయ్యా!)

ఈ కలికి (యువతి) లోలో నిన్ను దలచి గక్కున (వెంటనే) కరగి (పరవశించి) జలజల చెమటతో జలకమాడినట్లయినది. నీకు యెదురువచ్చినప్పుడు బలవత్తరమైన తమకాన, నిలువున కొప్పు (నిట్టనిలువుగానున్న సిగకొప్పు) ముడివీడి, నీలిచీరె గప్పెను (నల్లని వస్త్రము వంటికి కప్పినట్లుండెను).

ఈ సుదతి (యువతి) నిన్ను చూచినదే తడవుగా ఎరుపెక్కిన చెక్కిళ్ళను తెలియకుండా దట్టముగా గంధమును పూసినది. మదనమంత్రములవంటి నీ నర్మగర్భమైన మాటల భావము భామ మనస్సును తాకి శరీరము పులకలుదేరినది ఆ పులకల విస్తరింపు ముత్యాల వానవలె దట్టముగా నాక్రమించెను.

అంతలో నీవా మానినిని కౌగిట జేర్చితివి. అలసిన ఆమె నీ మెడలోని చంద్రహారమువలె భాసించినది. ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ దేవి అలమేలుమంగ ఆపై నీ అక్కున దక్కి (సందిట జిక్కి) తన సరస సల్లాపములను తలంబ్రాలు పోసి నిన్ను మురిపించి తానునూ మురిసినది.

ఓ జగజ్జననీ జనకులారా! మిమ్మట్లు భావించగల ఆచార్యులవారిదే భాగ్యము. వారి కృపవలన మేమూ ధన్యులమైతిమి కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uma Maheshwara Stotram In Telugu – ఉమామహేశ్వర స్తోత్రమ్

Uma Maheshwara Stotram Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమామహేశ్వర స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Stotram Lyrics Telugu

ఉమామహేశ్వర స్తోత్రమ్ 

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్రిష్ట వపుర్ధ రాభ్యాం |
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం ||

1

నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం |
నారాయణే నార్చిత పాదుకాభ్యాం

॥నమోనమః|| 2

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వాంద్ర సుపూజితాభ్యాం |
విభూతి పాటీర విలేపనాభ్యాం

॥నమోనమః|| 3

నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం |
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం

॥నమోనమః|| 4

నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం |
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం

॥నమోనమః|| 5

నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా
మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్ |
అశేష లోకైక హితం కరాభ్యాం

॥నమోనమః|| 6

నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకళ్యాణ వపుర్థరాభ్యామ్ |
కైలాసశైల స్థిత దేవతాభ్యాం

॥నమోనమః|| 7

నమశ్శివాభ్యా మశుభాపహాభ్యా
మశేషలోకైక విశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం

॥నమోనమః|| 8

నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానర లోచనాభ్యామ్ |
రాకా శశాంకాభ ముఖాంబుజాభ్యాం

॥నమోనమః|| 9

నమశ్శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జి తాభ్యాం |
జనార్థ నాభోద్భవ పూజితాభ్యాం

॥నమోనమః|| 10

నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వాచ్ఛదా మల్లిక దామభృద్భ్యామ్ |
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్

॥నమోనమః|| 11

నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్ ।
సమస్త దేవాసుర పూజితాభ్యాం

॥నమోనమః|| 12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్వా పఠన్ ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్య ఫలాని భుంక్త్వే
శతాయు రంతే శివలోక మేతి ॥

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
ఉమామహేశ్వర స్తోత్రమ్.

మరిన్ని స్తోత్రములు

Yenni Marulu Yitte Nee Panulu In Telugu – యెన్ని మారులు యిట్టె నీపనులు

యెన్ని మారులు యిట్టె నీపనులు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో యెన్ని మారులు యిట్టె నీపనులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

యెన్ని మారులు యిట్టె నీపనులు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : యెన్ని మారులు యిట్టె నీపనులు
సంఖ్య : 58
పుట : 43
రాగం : సామంతం

సామంతం

30 యెన్ని మారులు యిట్టె నీపనులు
ఇన్ని మాయలు నన్ను నేఁచనేఁటికిరా.

||పల్లవి||

నీళ్లే నమలేవు నీలోనె సన్నల
వేళ్లే చూపేవు వెలుపలికి
పేళ్లె తప్పేవు బిరుసుగ, నింతేసి
గోళ్ల రాచేవు కోపమేఁటికిరా.

॥యెన్ని॥

మేనె దాఁచేవు మెస్తిర గొడ్డలి
నానం బెట్టేవు నయముననే
పోని తెరువుల పోకులఁ బోయేవు
కానిరా యేటివంకలు తిద్దవశమా.

॥యెన్ని॥

చేరి కపటాలె చేసేవు యిఁకనైనా
సారెం బరువులు చాలించరా
ధీరుండవుగాన తిరువేంకటపతి
కూరి మెఱిఁగి నన్నుఁ గూడితి విపుడూ.

॥యెన్ని॥ 58

అవతారిక:

ఇదికూడా జానపదుల శైలిలో కొనసాగే దశావతార కీర్తన. నా అభిప్రాయంలో ఇది బహుక్లిష్టమైనది. ఎందుకంటే కొన్ని మాటలకు యే నిఘంటువులోనూ అర్ధ వివరణ సూచన ప్రాయంగా కూడా లభించలేదు. అది ఏ అవతార వివరణో వూహించగలుగుట వలన భావసమన్వయం ఆవశ్యకమైనది. అంటే. ఉదాహరణకి “పెళ్లె తప్పేవు బిరుసుగ” అంటే వరాహవతారంతో సమన్వయపరచుటెట్లు సాధ్యం. యేటివంకలు తిద్దవశమా? అంటే కృష్ణావతారంతో యెట్లా ముడిపెట్టాలి? దీని అర్థం ఏమిటో ఎలా తెలుస్తుంది? ఓ దేవదేవా! అన్నమయ్య ఈ కీర్తన పల్లవిలో అన్నమాట నిజం చేస్తున్నావు కదటయ్యా! “ఇన్ని మాయల నన్ను నేచనేటికిరా”. అంటే ఏమిటో తెలియాలంటే ఏమిటి చేయాలి? మీకు తెలుసునని నాకు తెలుసు.

భావ వివరణ:

నీ పనులు (నీవు చేసే లీలలు యెన్ని మారులు? (ఎన్ని విధములో) చెప్పుట యెట్లు సాధ్యము? నన్ను ఇన్ని మాయలతోన్ చేయనేటికిరా? (అతిశయించుట యెందులకయ్యా? )

ఒకసారి నీలోనే నీళ్ళు నములుతుంటావు (మత్స్యావతారము); ఇంకొకసారి వెలుపలికి వచ్చి సన్నల (సైగలతో) వేళ్ళను చూపింతువు (కూర్మావతారము); ఇంకొకసారి, బిరుసుగ పేళ్లె తప్పేవు (కాఠిన్యంతో వేగిపోతూ తపించిపోయేవు)… అనగా (వరాహావతారం). ఇంకొకసారి, ఇంతేసి గోళ్ళ రాచేవు (ఇంతింత పొడుగువున్న గోళ్ళతో చీరివేసెదవు. కోపమేటికిరా? కోపమెందులకయ్యా? (నరసింహావతారం).

ఒకసారి, మేనెదాచేవు (చూడటానికి పొట్టి పిల్లవాడిలావున్నా, భూనభాంతరములు నిండిపోగల శరీరాన్ని దాచివుంచినావు)… అనగా (వామనావతారం).; మెస్తిర గొడ్డలి నయముననే నానం బెట్టేవు (బాగా పదునైన పరశువును బాగా రక్తంలో నానబెట్టినావు)… అనగా (పరశురామావతారము); పోని తెరువుల పోకల బోయేవు (చొరరాని కీకారణ్యములబట్టి పోయేవు)… అనగా (శ్రీరామవతారం); కానిరా, యేటివంకలు తిన్దవశమా (కానీయవయ్యా! వంకరటింకరగా పోయే ఏరుయొక్క మార్గాన్ని కట్టడి చెయ్యగలమా? … అనగా (శ్రీకృష్ణావతారపు గోపీలోలత్వం).

ఒకసారి, చేరి కపటాలే చేసేవు (పురసతులను మోసగించినావు)… అనగా (బుద్ధావతారము). ఇకనైనా సారెం పరువులు చాలించరా (ఇప్పటికైనా, మాటిమాటికీ పరుగులు తీసే అలవాటు మానుకోవయ్యా!)… అనగా (కల్కి అవతారము); ధీరోదాత్తుడవు కావున ఓ తిరువేంకటేశ్వరా! కూరిమి యెరిగి నన్ను కూడితివి. ఇప్పుడు నీమాయలను మెచ్చక యెలా వుండగలను ప్రభూ!.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Krishna Ashtakam In Telugu – శ్రీ కృష్ణాష్టకమ్

Sri Krishna Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Krishna Ashtakam Telugu

శ్రీ కృష్ణాష్టకమ్

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవనందనందనమ్,
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్.

1

మనోజగర్వమోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనమ్,
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణమ్.

2

కదంబసూనకుండలం సుచారుగండమండలం
ప్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభమ్,
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకమ్.

3

సదైవ పాదపంకజం మదీయమానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకమ్,
సమస్తదోషశోషణం సమస్తలోక పోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసమ్.

4

భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకమ్,
దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవమ్.

5

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనమ్,
నవీనగోపనాగరం నవీనకేళితత్పరం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటమ్.

6

సమస్తగోపనందనం హృదంబుజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనమ్,
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకమ్.

7

విదగ్దగోపికామనోమనోజ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవృద్ధవహ్నిపాయినమ్,
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితమ్
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణమ్.

8

యదా తదా యథా తథా తథైవ కృష్ణ సత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతామ్,
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన్
భవేత్ స నందనందనే భవే భవే సుభక్తిమాన్.

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీకృష్ణాష్టకం సంపూర్ణమ్.

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతమ్,
వటస్య పత్రస్య పుటే శయానం
బాలం ముకుందం మనసా స్మరామి.

మరిన్ని అష్టకములు

Ashta Lakshmi Murthulu In Telugu – అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు

Ashtalakshmi Murthulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు లభించడం వంటి విషయాలు చెప్పబడినవి.

అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు

అష్టలక్ష్మి అనగా ఎనిమిది లక్ష్ములు అను అర్దం వచ్చును. అష్టలక్ష్మి మూర్తుల శక్తులు అనగా, అష్ట దేవతా మూర్తులు మనకి ప్రసాదించే అష్ట శక్తులు. ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఏ, ఏ లక్ష్ములు ఏమేమి శక్తులని ప్రసాదిస్తారో, క్రింద ఇచ్చిన విదముగా తెలుసుకుందాము.

1. శ్రీ ఆదిలక్ష్మిదేవి

ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.

Adilakshmi devi

2. శ్రీ ధాన్యలక్ష్మీ మాత

సకల సస్యసంపదలకి, పాడి పంటలకి అధిష్టాన దేవత, శారీరక ధారుఢ్యాన్న  ప్రసాదించే తల్లి.

dhanya lakshmi

3. శ్రీ దైర్యలక్ష్మీమాత

ధైర్య సాహసాలు, మనోబలం ప్రసాదించే తల్లి.

Dhairya Lakshmi

4. శ్రీ గజలక్ష్మీమాత

సమస్త శుభాలకీ అధిష్టాన దేవత.

Gaja Lakshmi

5. శ్రీ సంతాన లక్ష్మీ మాత

సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.

Santhana Lakshmi

6. శ్రీ విజయలక్ష్మీ మాత

సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయసాధనకి అధిష్టాన దేవత.

Vijaya Lakshmi

7. శ్రీ విద్యాలక్ష్మి మాత

విద్యావివేకాలకి, మన అర్హతలకి తగిన గుర్తింపు రాణింపు కలిగేలా చేసే చల్లని తల్లి దేవత.

Vidya Lakshmi

8. శ్రీ ధనలక్ష్మీ మాత

సకలైశ్వర్య ప్రదాయిని. అన్ని సంపదలకి అధిష్టాన.

Dhana Lakshmi

ఈ శ్రీఅష్టలక్ష్మీ ఆరాధన వైభవం పుస్తకం ద్వారా శ్రీమన్మహలక్ష్మీదేవి ప్రాదుర్భావం, వైభవ కటాక్షాలతో మొదలు పెట్టి వరుసగా ఎనిమిది మంది అష్టలక్ష్మీ మాతల స్వరూప, వైభవ, ఆగ్రహానుగ్రహ ప్రభావాలు, ఆరాధన పద్ధతులు, వీటి వల్ల కలిగే ఫలితాల గురించి వివరించటం జరిగింది. శ్రద్ధా భక్తులతో ఈ పుస్తకాన్ని చదివి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని మా ఆకాంక్ష.

మన అపోహలు – సందేహాలు

సకల జీవావళికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించే నిమిత్తం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలను ధరించింది. తన పిల్లలమైన మన అభ్యున్నతికోసం అహరహం ఆరాటపడుతుంది జగన్మాత. అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం గురించి, స్వభావం గురించి మనలో ఎన్నో అపోహలు వున్నాయి. పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం బాగా వంటబట్టిన మన నేటితరం వారికి మన సనాతన సాంప్రదాయం, పూజా పునస్కారాల గురించి ఎన్నో సందేహాలు అవి ఏమిటో చూద్దాం.

  1. లక్ష్మీదేవి అనగానే మనకి స్ఫురణకి వచ్చేది. తన చేతుల నుంచి బంగారు కాసులను అనుగ్రహించే శ్రీ ధనలక్ష్మీదేవి రూపమే అందువల్లనే లక్ష్మీపూజ అనగానే ధనాన్ని కోరి చేసే పూజ మాత్రమే అనే అపోహ జనబాహుళ్యంలో వుంది.
  2. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమైనదని, ఆ తల్లి అనుగ్రహం ఎంత కాలం మనవద్ద వుంటుందో తెలియదని, ఎప్పుడు వదలి వెళ్ళిపోతుందో తెలియదనే తప్పు అభిప్రాయం కూడా జనానీకంలో నెలకొని వుంది.
  3. అదే విధంగా లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు అనీ, లక్ష్మి వున్న చోట విద్య వుండదు అనీ, విద్య వున్నచోట లక్ష్మి వుండదు. అని అంటూ వుంటారు. ఇదీ అపోహే.
  4. ఇక అష్టలక్ష్మీ ఆరాధన విషయానికి వస్తే, ఇలా ఎనిమిది రకాల లక్ష్మీ రూపాలను ఎందుకు పూజించాలి? ఒక మహాలక్ష్మీ రూపాన్ని పూజిస్తే చాలదా? అనేది కూడా ఒక ప్రశ్న.
  5. లోకంలో అందరూ వారి వారి పద్ధతులలో భగవదారాధన చేసుకుంటూ తమ తమ కోరికలను, అవసరాలని నెరవేర్చుకుంటూ వుండగా ప్రత్యేకంగా అష్టలక్ష్మీ ఆరాధన, పూజ, వైభవాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?
  6. తార్కిక దృష్టితో మాత్రమే ఆలోచించే నేటి ఆధునికులు లోకంలో ఏ పని అయినా సరే మనం కష్టపడి శ్రద్ధగా చేయటం వల్లనే పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతాం అంటారు. అంతే కాని ఆ పని సఫలం కావటానికి లక్ష్మీదేవో, మరే దేవతో అనుగ్రహం కావాలనటం మూర్ఖత్వం అని కూడా అంటూ వుంటారు.
  7. అదే విధంగా చేసే పనిని శ్రద్ధగా చేస్తే చాలు, అదే అసలైన పూజ అనే వారూవున్నారు. ఇవి ఎంత వరకు నిజం?
  8. అయినా ఈ యిరవై ఒకటవ శతాబ్దంలో సైన్సు విపరీతంగా అభివృద్ధి చెంది పోయి సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ఉవ్విళ్లూరుతున్న మానవ సమాజంలో, యీ విధంగా పూజల వల్ల బీజాక్షర జపాల వల్ల ఫలితాలు కలుగుతాయంటే నమ్మేవారు ఎందరు?
  9. ఆధునిక యుగంలో ప్రతినిత్యం తమ తమ దైనందిన కార్యక్రమాలలో తలమునకలై ప్రతిక్షణం హడావుడి పడిపోతూ జీవించే నేటి తరం వారికి ఈ విధమైన భగవదారాధనకి సమయం ఎక్కడిది?
  10. భక్తిశ్రద్ధలతో కూడిన పూజా పురస్కారాలు వగైరా వయస్సు మళ్ళి, ఓపిక తగ్గిన వృద్ధులకే గాని భుక్తికోసం కోటి విద్యలు నేర్చుకుని అహరహం ధనార్జనలో సతమతమయ్యే యువతకి ఈ ఆరాధనల అవసరం ఏమిటి?

ఇలా అనేక సందేహాలు వస్తూ వుంటాయి. ఇవన్నీ చాలా సహజమైన సందేహాలే. ఏ విషయాన్నైనా సశాస్త్రీయంగా విశ్లేషిస్తే గాని నేటితరం అంగీకరించదు. అలాంటివారి కోసమే ఈ పుస్తకం. ఈ పుస్తకం శ్రద్ధగా చదివితే పైన చెప్పిన అన్ని సందేహాలకి సమాధానాలు దొరికి మనకి ఏం కావాలో కూడా మనకి తెలుస్తుంది.

మరిన్ని:

Garuda Garvabhangam In Telugu – గరుడ గర్వభంగం

Garuda Garvabhangam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గరుడ గర్వభంగం నీతికథ.

గరుడ గర్వభంగం

(ఉద్యోగ పర్వంలో చేయబార సమయంలో కణ్వమహర్షి చెప్పిన కథ)

” నాయనా దుర్యోధనా !

దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా! ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి.

ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాల లోనూ సాటిరాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో, సద్గుణ సంపదతో అందరిచేతనూ ప్రశంసలు పొందినవాడు.

ఆయనకు గుణకేశి అని ఒక కూతురు. గుణకేశి ఎంత అందగత్తెయో అంతకంటే గుణవతి, శీలసంపన్న, విద్యావతి. తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదాయాన్ని, ఆచార మర్యాదలనూ చక్కగా అలవరచుకొని పదినుందిలో వినయగుణవతిగా పేరు పొందింది.
బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభిం చాడు మాతలి.
ఉన్నత వంశంలో పుట్టి, చక్కని అంద చందాలతో గుణవంతు రాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకడం చాలాకష్టం.
విద్యఉంటే వినయం ఉండదు. విద్యావినయాలుంటే రూపం ఉండదు. ఈ మూడూ ఉంటే సంపద ఉండదు.
విద్యా వినయ గుణరూపాలున్ని వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు. భూలోకం కూడా గాలించాడు.
ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమించ కుండా తిరుగుతూనే ఉండగా, ఒకనాడు నారదముని కనిపించి, మాతలి బాధ విని ఆయనకూడా తోడుగా బయలుదేరాడు.
ఇరువురూ కలిసి పాతాళంలో వరుణలోకం చేరారు. ఆలోకం లోని వింతలు, విశేషాలూ వివరంగా చెప్పాడు నారదుడు. అన్నీ విని మాతలి!
దేవమునీ :
నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా ! ఈ లోకం రాక్షసులకు నిలయం. వీరితో బాంధవ్యం నాకు కుదరదు, అన్నాడు.
గరుడ లోకం తిరిగారు. ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు.
ఆ లోకం ప్రజలందరూ భోగమయ విలాస జీవితం గడుపు తున్నారు. అది మాతలికి రుచించలేదు.
అప్పుడు నాగలోకానికి చేరారు. ఆలోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధానీ నగరంలో అన్వేషణ ఆరంభించారు.
నాగ వంశ ప్రముఖులందరి గుణగణాలనూ నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు.
వింటూ వింటూన్న మాతలి కనులు ఒక నవసుందరాంగుని మీద నిలిచాయి.
అది గ్రహించి నారదుడు మాతలీ

నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమయింది. అందులో పెద్ద ఆర్యకుడు. ఆయన కుమారుడు చికురుడు.
నువ్వు చూపే యువకుడు సుముఖుడు. ఈ సుందర గుణ సంపన్నుడయిన సుముఖుడు చికురుని ప్రియ పుత్రుడు, అని చెప్పాడు. తరువాత ‘ కుల పెద్ద ‘ అయిన ఆర్యకునితో:
‘నాయనా! ఈయన ఇంద్రసారథి మాతలి. ఈయన కుమార్తె గుణకేశి. ఆమె రూపంలోనే కాక గుణసంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు.
ఆర్యకుడు దేవయినీ: వినతానందనుడైన గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీ రెరుగుదురు. మొన్ననే మా చికురుడు ఆయనకు ఆహారం అయాడు. అప్పుడే చెప్పాడాయన.
తరువాయి వంతు సుముఖునిది, అని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖసముద్రంలో వడల మంటారా ? ‘ అన్నాడు.
అప్పుడు మాతలిని వెంటబెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించి, చేతులు జోడించి, విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుర్దాయం అనుగ్రహించాడు.
తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొని వచ్చి సుముఖు నితో వివాహం జరిపించాడు.
వా రుభయులా అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగి స్తున్నారు.
ఈ వార్త గరుత్మంతుని చెప్పిని పడింది.
తీవ్ర క్రోధంతో నాగలోకం చేరి
‘చతుర్దశ భువనాలకూ అధిపతి అయిన మహా విష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరుడు భరించ లేడని తెలియదామీకు? అంతటి శక్తికల నన్ను మీరు అవమానించారు, నామాట వినకుండా ఈ వివాహం జరిపించి’ అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించ బోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో:
‘నాయనా! వినతానందనా ! నా భారం అంతా మోయగల శక్తిమంతుడివి కదా ఏది, నా చెయ్యి ఒక్కటి నీ వీపుమీద ఉంచు తాను, చూడు,’ అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు.
అంతే! ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టుతప్పి, రెక్కలు గజగజలాడి, నోరు ఎండి నాలుక పిడచకట్టింది.
అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను దువ్వి ఆశ్వాసించి? ‘నాయనా గర్వం, అహంకారం, ఎప్పుడూ కొరగానివి. విన యంతో, పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తి స్తాయి’ అన్నాడు.
అనంతరం గరుడవాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు.

‘చూశావా, దుర్యోధనాః గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చి పెడు తుందో ! కనక అది విడిచి పెట్టాలి’ అన్నాడు కణ్వమహర్షి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sai Samaja Tambulamu In Telugu – సాయి సమాజ తాంబూలము

Sai Samaja Tambulamu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి సమాజ తాంబూలము గురించి తెలుసుకుందాం…

Sai Samaja Tambulamu Telugu

సాయి సమాజ తాంబూలము

దృష్టి లోపమో నరునిది దుష్ట పథమొ
బురదలో భ్రమించగ వీరి బుద్ధి యంత
చేయుచుండిరి స్వార్థపు చేతలెల్ల
నీవు రక్షింప మాయెద నిలువు సాయి

1

నీతి ఎరుగని వారలు నీతులరసి
అనుసరించుట మరచి బోధనల పడిరి
నీతి మరచిన జనులకు నీతి దెలిపి
నీదు మహిమలు చాటగ నిలువు సాయి

2

మురియు సంపదలను గని మూర్ఖులిచట
ఉన్న దంతయు తనదని ఉరిమి పడుచు
లేని దానికై వీరంత లేచి పడగ
ఆశకంతము ఏముండునయ్య సాయి

3

లీలలను చేసి నువ్వు నిలిపితి వయ్య
మమ్ము నీ సుందర జగతి మాటునందు
వ్యాప్తి చెందెను కాలుష్య వాయు గణము
నీదు మహిమతో వారింప నిలువు సాయి

4

అందమగు రూప లావణ్య మవని యందు .
సాంప్రదాయపు గౌరవ సంపదలును
మోడలింగులో ముత్యాల ముసుగు లోన
విలువ మరచెను చూడుము వినతి సాయి

5

మాట చెల్లిన వారికే మంతనాలు
మాటున జరుగునట్టిదే మదియు గాంచె
చిత్రమగు చేష్టలకులోన చింత పెరిగె
నీవు రావయ్య నియతిని నిలుప సాయి

6

పైకి మెరిపించు వారలు పైకములను
దోచుకుని పోవుచుండిరి దొరల తీరు
వేషములు ఎన్నొ గట్టిన వీరి వింత
నీవు మార్చగ రావయ్య నిత్య సాయి

7

మానవత్వమును మనిషి మరచి పోయి
సాటి మనుజుల చంపుచు సాకుచెపుచు
జీవకోటి నెత్తురు ముద్ద జేసియాడు
నీ మనుషులను మార్చుము ఇలను సాయి

8

నీరు లేనట్టి పంటలో నిండి గరక
పంటయే తానని భ్రమించి పరుగు లెత్తు
కోత రోజు తెలియు దాని కొసరు బ్రతుకు
మూర్ఖులిటుల భ్రమింతురు ముందు సాయి

9

కాల రాత్రిలో కలి కండ్లుకమ్మి వేయ
లోకమంత విధిని విడచి వెడల
పిచ్చి చేష్టల బ్రతుకులు పెరిగిపోవ
మమ్ము కాపాడ రావయ్య మహిత సాయి

10

రేయి పగలు మరచి నల్ల రేయి
ఒకటి లోకమంతట తిరిగెను లోకనాథ
ఎంచి చూడగ ఈ భూతమెదలు పిండి
ఏలుకొను నిన్ను బాపగ నెదిగె సాయి

11

ఆగలేని కాలానికి అవధి మరచి
అడుగు వేయక ముందు ఈ అవని లోన
అంత తనదేననుచు జీవుడరయు చుండ
అసలు సొంతమైనది యేమిటయ్య సాయి

12

నాది నీదను పోరులు నరుని యందు
తెగని రీతిగ ఎదిగెను తెలియకుండ
కుల మతాల గోడలు పెట్టి గూలు నట్టి
ఈ జనుల పోరును అణచు మిచట సాయి

13

మతము పేరిట పాపుచు మానవతను
ఉగ్రవాదము లోకాన ఉరుము చుండె
అణచి వేయు మా నాధుడవంటు మేము
నిన్ను జేరితిమిక తోడు నిలువు సాయి

14

అవనిలోన అలజడులు అధికమయ్యె
మానవత్వమును మరచి మనుజులంత
జరుపు చుండిరి మతముల జాతి పోరు
నీవు పారద్రోల నియతి నిలుపు సాయి

15

ప్రేమ చిత్రాలపై నేడు పెరిగె మోజు
మత్తులోన మునింగి మైమరచి పోయి
చదువులశ్రద్ధ చేయుచు సాగు యువత
కాలపు విలువ మరచిరి కనుము సాయి

16

దేశమన్నను ఎవరికి దెలిసి యుండు
చెప్పడానికి మాటలు చెల్లినట్లు
చెప్పినది చేయు సరికెల్ల చెదిరి పోవు
చిత్రమగు దేశ భక్తియే చింత సాయి

17

మా మతము గొప్ప చూడ మామతమె మిన్న
సాటిరాదు ఏ మతమైన సాహసించ
యనెడు మతవాదులు సిరుల అంచులందు
మరియు చుండిరి చూడుమా ముదము సాయి

18

వలదు మీకు మా భారత వనితలార
కాటిలోనికి పంపెడు కట్న కాన్క
లెల్ల, కొరివి దెయ్యములగు ఎల్లరకును
ఊర కుండని బిగించు ఉరిని సాయి

19

మేలు కొలుపుము జనులను మేళ వించి
యుద్ధమును కోరు మూర్ఖుల బుద్ధి మార్చి
ధైర్యమున వారి నణచుము తాల్మి తోడ
మమ్ము చేరెడు మా తండ్రి మహిత సాయి

20

నీతి తప్పదు తండ్రి ఈ నేల తల్లి
నీటి బొట్టు దొరకక కన్నీరు బెట్టి
నీ శరణుగోరె నొక మారు నిక్కి చూసి
ఆపదల బాపి రక్షింపుమయ్య సాయి

21

అన్న పానీయములనిచ్చు అవని ఇపుడు
అన్నమో రామచంద్రాయ టంచు అడలె
ఏమిటి మరి ఈ వింత నీ ఎదుట నింక
ఆలకించి జనుల బ్రోవు మయ్య సాయి

22

వాయిదాలకు జనులెల్ల వారసులయి
వాంఛ యున్నను వీరికి వలపు లేదు
కాంత చెంతనున్న కనులు కాన రాక
మూర్ఖ బుద్ధులవనిలోన మురియు సాయి

23

పదవి యున్నపుడు పరులు పంచజేరి
పదవి పోయిన నెవ్వరు పిదప రారు
సిరియు సైతము ఆ వేళ చిందు లేయు
పదవి జారిన సిరి కనపడదు సాయి

24

చేయ చేత కాకున్నను చిందు లేయు
చెమట విలువ తెలియ కుండు సోమరులకు
కాయకష్టమదేమిటో కాస్త దెల్పి
బద్ధకపు బుద్ధులను నీవు బాపు సాయి

25

జారిన తిరిగి రానిది జనుని మాట
కలత పెంచి కత్తులు దూయు కసిది మాట
మనసు నింపగ నుండును మంచి మాట
మాటలన్నింట నిలుపు నీ మహిమ సాయి

26

తల్లి ఋణము తీర్చుకొనగ తనను మరచి
కాన రానంతగ జవాను కదిలి పోయి
బాధలు భరించి తల్లిని భద్రపరచు
వీర పుత్రులలో మేటి వీడె సాయి

27

మాటు వేసిరి చోరులు మూట గట్ట
రాత్రి వేళలో వీరంత రాటుదేలి
పగటి వేళనే చోరీకి పాలుపడుచు
నిన్ను ముంచగ నున్నారు నిజము సాయి

28

అడుగు వేయ అలజడులు అవని యందు
వికట హాసము చేయగ వెళ్లి గూడె
ఏ క్షణమునేమి చేయునో వెక్కిరించి
ఈవు కాపాడ రావయ్య ఇలను సాయి

29

మాయ చేయ తలచి కలి మహిని ముంచ
ఆగనంతటి అహముతో అరసి చూడ
అంధులను జేసి అందినదంత దోచి
అవనికే గొప్పనౌ భారమయ్యె సాయి

30

తెల్లదొర లెల్ల ధనముల కొల్లగొట్ట
రాట్నములు మొద్దు బారెను రాతి శిలగ
ఇనుప యంత్రాలు చేనేత నిడెను చితిని
చేతి పని వారినొక మారు చేరు సాయి

31

కట్టు బొట్టు కున్న విలువ కాలరాసి
అంద చందాల పోటీలు అనుచు ఇలను
దొరికినది యంత కొందరు దోచ దలచి
కొత్త విధమున యోచింప గొనిరి సాయి

32

శిలను శిల్పముగా శిల్పి చెమట తోడ
తనను తీర్చిన దేవుని తనువు గూర్చె
శిథిలమై తాను జీవము శిలకు నింపి
నిరతము నిను కొలుచు చుండు నిజము సాయి

33

రెప్ప పాటైన రే రాజు రేయి పూట
నవ్వనంత ఆ రేయికి నగవు యేది
యింత ఈ వెన్నెలను గాంచు యింపు ఏది
నీదు మహిమల నిచ్చట నిలుపు సాయి

34

తపము చేసిన తీరని తాప మాయె
ఏమిటో ఎల్ల కాలము ఎదుగు చుండె
గాలిలో మేడ లెన్నెన్నొ గట్టి మురిసి
ఇపుడు గగనమ్ము నేదింప నెంచె సాయి

35

మంటలో గల్ప నేర్చిరి మనుజులంత
మానవీయ విలువలన్ని మతులు చెడగ
ఏమి చేయుదువో నీవు ఏలుకొనగ
తోలు బొమ్మలౌ జనులు నీ తోడు సాయి

36

మరిన్ని భక్తి గీతాలు