Sri Krishna Prema Ashtakam In Telugu – శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Krishna Prema Ashtakam Telugu

శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్

అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతరమోహేన పతితమ్ !
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

1

అనాథానాం నాథః పరమకరుణా పూర్ణహృదయో
ఘనానందాకారో జఘన విలసద్భాహు యుగళః,
సనాథం మాం కుర్వన్సదయ వర రాధావనితయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

2

సదా బృందారణ్యే కలిమలహరే యామునతటే
ముదా గోపీబృందే లసదమల గోలోకనిలయే,
విహర్తా గోపాలో మధుర మురళీగాన నిరతో
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

3

మతిర్మే శ్రీరాధాపతిచరణ పద్మేషు విశతాత్
రతిర్గోపీకాంతే లసతు రసనా నామ జపతాత్,
గతిర్మే గోవిన్దో భవతు నిరతం పూర్ణదయయా
ఘనశ్యామః కృష్ణా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

4

పితా మాతా భ్రాతా సుతహిత కళత్రాది సకలం
పతిర్బంధుర్మిత్రం విభురపి శరణ్యోస్తు భగవాన్,
గతిర్మే గోపీశః కిమపి న హి కృష్ణాత్పరతరం
స గోపాలః ప్రేమ్ల్లో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

5

గురు ర్భావానందః శమిత హృదయ స్మేరవదన
స్స మాం దీనం హీనం విషయ విషతృష్ణా పరివృతమ్,
సుధావృష్ట్యా దృష్ట్యా పరమ కృపయా పాతు మనిశం
ఘనశ్యామో భూత్వా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

6

నమామి శ్రీకృష్ణం సజలజలద శ్యామలతనుం
భజామి శ్రీకృష్ణం మధురమధురం తస్యచరితమ్,
ప్రజామి శ్రీకృష్ణం శరణ మహమవ్యాజకృపయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

7

పరాధీనం దీనం చపలమతిహీనం కరుణయా
పరిత్రాతుం నేతుం న్వపదమపహర్తుం భవభయమ్,
గదాధారీ శౌరిః కలికలుష హారీ ధృతగిరి
స్సదామేఘశ్యామో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

8

విశ్వనాథ కృతం ప్రాతః ప్రబోధాష్టక మాదరాత్,
పఠతాం హృదయే నిత్యం సదా వసతు కేశవః.

ఇతి శ్రీకృష్ణ ప్రేమాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు

Leave a Comment