BhaktiVed

Raghumaharaju Kautsudu In Telugu | రఘుమహారాజు – కౌత్సుడు

నీతి కథలు2024-05-02

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఏమిటంటే… రఘుమహారాజు – కౌత్సుడు నీతికథ.

రఘుమహారాజు – కౌత్సుడు

పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. వరతంతుడనే ముని యొక్క గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.

శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.

గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజిత్ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టిపాత్రలలో పూలు పెట్టుకుని దైవపూజ చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “రేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.

పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాచబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.

తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి 14 రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది?” అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.

ఈ కథలోని నీతి మరొక్కమారు మీ అందరికోసం:

  1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
  2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
  3. కౌత్సునియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

ఇవి కూడా చదవండి

Sri Krishnadevaraya Krta Amuktamalyada Loni katha In Telugu – శ్రీ కృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథఅది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం) మనకందించిన, పేరు పొందిన పద్యాలలో ఒకటైనా పద్యం శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్…Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథనీతికథలు శివాజీ వీరగాధలలోని కథ నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ. హీరాకానీ దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాప…Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథనీతికథలు శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ. ప్రవరాఖ్యుని కథ అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ…Asraya parityaga doshamu In Telugu – ఆశ్రయ పరిత్యాగ దోషమునీతికథలు శ్రీ స్కాంద పురాణము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము . ఆశ్రయ పరిత్యాగ దోషము ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దే…Santruptini Minchina Sampada Ledu – సంతృప్తిని మించిన సంపద లేదునీతికథలు శ్రీమద్భాగవతము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు . సంతృప్తిని మించిన సంపద లేదు సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బ…Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌నీతికథలు శ్రీమద్రామాయణం లోని నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌ . వినయం వివేక లక్షణమ్‌ పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్…