BhaktiVed
Shiv

Shivashtakam

Stotram

This text is still being proofread.

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం

భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే.

గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం

జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభు మీశాన మీడే.

ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతమ్

అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు మీశానమీడే.

వటాథో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశనం సదాసుప్రకాశమ్

గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే.

గిరీంద్రాత్మజాసంగృహీతార్థ దేహమరౌ సంస్థితం సర్పహారం సురేశం

పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశాన మీడే.

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దధానం

బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభు మీశాన మీడే.

శరచ్ఛంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్

అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశాన మీడే.

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం

శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశాన మీడే.

స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్ సర్వదా భర్గసేవానురక్తః

సపుత్రం దనం ధ్యానమిత్రే కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షంప్రయాంతి.

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివాష్టకమ్గురించి తెలుసుకుందాం…

Shiva Ashtakam Lyrics In Telugu

శివాష్టకమ్

1

2

3

4

5

6

7

8

మరిన్ని అష్టకములు

Also read