Lingaashtakam In Telugu – లింగాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లింగాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Brahma Murari Lyrics Telugu

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చితలింగం
నిర్మల భాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

1

దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

2

సర్వసుగంధి సులేపితలింగం
బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

3

కనకమహామణి భూషితలింగం
ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

4

కుంకుమచందన లేపితలింగం
పంకజహార సుశోభిత లింగం
సంచితపాప వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

5

దేవగణార్చిత సేవితలింగం
భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

6

అష్టదళో పరివేష్టితలింగం
సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

7

సురగురు సురవరపూజితం లింగం
సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం

8

లింగాష్టక మిదంపుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

 

మరిన్ని అష్టకములు

Leave a Comment