మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు బిల్వాష్టకమ్ గురించి తెలుసుకుందాం…
Bilvashtakam Lyrics Telugu
బిల్వాష్టకమ్
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్
1
త్రిశాఖైర్బిలపత్రైశ్చ హ్యచ్ఛిదైః కోమలై శ్భుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్.
2
అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్
3
సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోరర్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్.
4
దంతకోటి సహస్రాణి వాజపేయ శతానిచ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్.
5
పార్వత్వాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య సత్ ప్రియం
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్.
6
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వమ్ శివార్పణమ్.
7
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్.
8
బిల్వాష్టక మిదం పుణ్య యఃపఠేచ్ఛివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్।
మరిన్ని అష్టకములు