BhaktiVed
Mata / Devi

Ashtakarikalu (Avirbhava Stuti)

Stotram

This text is still being proofread.

విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

ఆనందరూపిణి పరే జగదానందదాయిని

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయరూపే మహాజ్ఞానప్రకాశిని

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

లోక సంహారరసికే కాళికే భద్రకాళికే

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

భండాద్యైస్తారకా ద్యైశ్చ పీడితానాం సతాం ముదే

లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

ఇత్యష్ట కారికాపాఠం కుర్వాణే శంభునాయకే

ఆవిర్భభూవ చిద్వహ్నేర్లలితా పరమేశ్వరీ ॥

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా అష్టకారికలు స్తోత్రముగురించి తెలుసుకుందాం…

Sri Lalitha Ashtakarika Sthotram (Avirbhava Stuti)

అష్టకారికలు

హోమాగ్ని నుండి శ్రీ లలితాదేవిని రమ్మని ఆహ్వానిస్తూ చెప్పిన శ్లోకములు.

1

2

3

4

5

6

7

8

9

మరిన్ని స్తోత్రములు:

Also read