Sri Lalitha Ashtakarika Sthotram In Telugu | అష్టకారికలు (Avirbhava Stuti)

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా అష్టకారికలు స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Ashtakarika Sthotram (Avirbhava Stuti)

అష్టకారికలు

హోమాగ్ని నుండి శ్రీ లలితాదేవిని రమ్మని ఆహ్వానిస్తూ చెప్పిన శ్లోకములు.

విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

1

ఆనందరూపిణి పరే జగదానందాయిని
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

2

జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయరూపే మహాజ్ఞానప్రకాశిని
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

3

లోక సంహారరసికే కాళికే భద్రకాళికే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

4

లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

5

విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

6

సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

7

భండాద్యైస్తారకా ద్యైశ్చ పీడితానాం సతాం ముదే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

8

ఇత్యష్ట కారికాపాఠం కుర్వాణే శంభునాయకే
ఆవిర్భభూవ చిద్వహ్నేర్లలితా పరమేశ్వరీ ॥

9

మరిన్ని స్తోత్రములు:

Leave a Comment