మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమామహేశ్వర స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Uma Maheshwara Stotram Lyrics Telugu
ఉమామహేశ్వర స్తోత్రమ్
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్రిష్ట వపుర్ధ రాభ్యాం |
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం ||
1
నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం |
నారాయణే నార్చిత పాదుకాభ్యాం
॥నమోనమః|| 2
నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వాంద్ర సుపూజితాభ్యాం |
విభూతి పాటీర విలేపనాభ్యాం
॥నమోనమః|| 3
నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం |
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం
॥నమోనమః|| 4
నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం |
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం
॥నమోనమః|| 5
నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా
మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్ |
అశేష లోకైక హితం కరాభ్యాం
॥నమోనమః|| 6
నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకళ్యాణ వపుర్థరాభ్యామ్ |
కైలాసశైల స్థిత దేవతాభ్యాం
॥నమోనమః|| 7
నమశ్శివాభ్యా మశుభాపహాభ్యా
మశేషలోకైక విశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం
॥నమోనమః|| 8
నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానర లోచనాభ్యామ్ |
రాకా శశాంకాభ ముఖాంబుజాభ్యాం
॥నమోనమః|| 9
నమశ్శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జి తాభ్యాం |
జనార్థ నాభోద్భవ పూజితాభ్యాం
॥నమోనమః|| 10
నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వాచ్ఛదా మల్లిక దామభృద్భ్యామ్ |
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్
॥నమోనమః|| 11
నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్ ।
సమస్త దేవాసుర పూజితాభ్యాం
॥నమోనమః|| 12
స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్వా పఠన్ ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్య ఫలాని భుంక్త్వే
శతాయు రంతే శివలోక మేతి ॥
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
ఉమామహేశ్వర స్తోత్రమ్.
మరిన్ని స్తోత్రములు