మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివమానస పూజా స్తోత్రము గురించి తెలుసుకుందాం…
Shiva Manasa Puja Stotram Lyrics In Telugu
శివమానస పూజా స్తోత్రము
శ్లో॥ రత్నైఃకల్పిత మాసనం హిమజలైఃస్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం |
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||
1
సౌవర్ణే మణిఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్వా ప్రభోస్వీకురు||
2
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా హ్యేతత్సమస్తంమయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||
3
ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాః ప్రాణశ్శరీం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షణవిధిః స్తోత్రాణి సర్వాంగిరో
యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభోః తవారాధనం ||
4
కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||
5
మరిన్ని స్తోత్రములు