BhaktiVed
Mata / Devi

Shri Lalita Chalisa

Chalisa
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

లలితామాతాశంభుప్రియా జగతికిమూలం నీవమ్మా

శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం ||

హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప

చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం ||

పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా

హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ||

శ్వేత వస్త్రముధరియించి అక్షరమాలను పట్టుకొని

భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి ||

నిత్య అన్నాదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ

ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు ||

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా

కామితార్ధప్రదాయనిగా కంచికామాక్షివైనావు ||

శ్రీచక్రరాజనిలయనిగా శ్రీమత్ త్రిపురసుందరిగా

సిరిసంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా ||

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో

మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి ||

పసిడి వెన్నెల కాంతులలో పట్టువస్త్రపుధారణలో

పారిజాతపు మాలలో పార్వతిదేవిగ వచ్చితివి ||

రక్తవస్త్రపు ధరియించి రణరంగమున ప్రవేశించి

రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు ||

కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి

కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి ||

రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా

రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు ||

ఖడ్గం, శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని

శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా ||

మహామంత్రాధి దేవతగా లలితాత్రిపురసుందరిగా

దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించె ||

ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే

ఆదిశంకరపూజితవే అపర్ణాదేవి రావమ్మా ||

విష్ణుపాదమున జనియించి గంగావతారము ఎత్తితివి

భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి ||

ఆశుతోషునిమెప్పించి అర్ధశరీరం దాల్చితివి

ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా ||

దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి

అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబా ||

శంఖుచక్రము ధరియించి రాక్షస సంహారముచేసి

లోకరక్షణ చేసావు భక్తులమదిలో నిలిచావు ||

పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా

చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరయించితివి ||

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో

ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే ||

సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా

మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరిసినవి ||

మూలాధారచక్రములో యోగినులకు ఆధీశ్వరియై

అంకుశాయుధధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబా ||

సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది

శంఖనాదము చేసితివి సింహవాహినిగ వచ్చితివి ||

మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో

మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి ||

చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి

నీ చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె ||

అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం

అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం ||

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా

జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానము నందరికివ్వమ్మా ||

నిష్ఠతో నిన్నే కొలచెదము నీ పూజలనే చేసెదము

కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు ||

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప

అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి ||

అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో

అసురులనందరను దునుమాడి అపరాజితవై వచ్చితివి ||

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా

భూలోకానికి వచ్చితివి భక్తులకోర్కెలు తీర్చితివి ||

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా

అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి ||

కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా

దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ||

ఏ విధముగ నిను కొలిచినను ఏ పేరున నిను పిలచినను

మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు ||

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి

మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి ||

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి

నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా ||

ఆశ్రితులందరురారండి అమ్మ రూపము చూడండి

అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము ||

సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి

సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు ||

మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి

మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము ||

Meaning and notes

Sri Lalitha Chalisa In Telugu Lyrics

శ్రీ లలితా చాలీసా

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

మరిన్ని చాలీసా పోస్టులు మీకోసం:

Also read