BhaktiVed

Asraya parityaga doshamu In Telugu – ఆశ్రయ పరిత్యాగ దోషము

Moral stories2026-06-09

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ స్కాంద పురాణము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము.

ఆశ్రయ పరిత్యాగ దోషము

ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొజకు తీర్భయాత్రులకు బయలుదేరారు. అట్ని మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్తాలు తీర్ధాలు ఉన్న మన భారతదేశం ధన్యము. అట్బి అమ్మ కడుపున పుట్సిన మనము ధన్యులము.

మహదానందంతో వారెన్నో తీర్ధాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొజ్బలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్దాది దేవతలు “ఓ శుకవరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది

“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్స ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరము? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి తీదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.

ఇలా ధర్మం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్దోహం చేయలేదు. తల్శిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూనుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్నానం కలిగింది”.

చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకము బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు. తీర్భయాత్రులు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్పాప్తించింది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్నిన నేలతల్సిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్టు త్యజించినవాడు కృతఘ్నుడొతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్న వారందరితో కృతజ్నతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Also read

Sri Krishnadevaraya Krta Amuktamalyada Loni katha In Telugu – శ్రీ కృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథఅది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం) మనకందించిన, పేరు పొందిన పద్యాలలో ఒకటైనా పద్యం శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్…Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథనీతికథలు శివాజీ వీరగాధలలోని కథ నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ. హీరాకానీ దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాప…Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథనీతికథలు శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ. ప్రవరాఖ్యుని కథ అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ…Santruptini Minchina Sampada Ledu – సంతృప్తిని మించిన సంపద లేదునీతికథలు శ్రీమద్భాగవతము నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు . సంతృప్తిని మించిన సంపద లేదు సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బ…Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌నీతికథలు శ్రీమద్రామాయణం లోని నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌ . వినయం వివేక లక్షణమ్‌ పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్…Dharmagnyah In Telugu – ధర్మజ్ఞఃనీతికథలు శ్రీమద్రామాయణం నీతికథ లలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మజ్ఞః నీతికథ . ధర్మజ్ఞః “శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామ…