Dharmagnyah In Telugu – ధర్మజ్ఞః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మజ్ఞః నీతికథ.

ధర్మజ్ఞః

“శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామణియైన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్నవాడై శ్రీ రామ చంద్పుని శరణువేడినాడు. విభీషణుడు తన మంత్పులతో వచ్చి ఆకాశమార్నాన నిలిచి శ్రీ రాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్తీవుని “మిత్రమా! నీ అభిషప్పాయమేమి”? అని అడిగినాడు. రాజశ్రేష్ముడైన సుగ్రీవుడిలా అన్నాడు “ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టము. పైగా వచ్చినది సీతాపహారి ఐన రావణుని తమ్ముడు. ఈతడు బలళాలి. సాయుధులైన నలుగురు మంత్పులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్చేశ్యం”.

స్మితపూర్వభాషి అయిన శ్రీ రాముడు ఇట్టు ధర్మ్యము పల్కెను “సుగ్రీవా! తన భార్యను వలపన్ని పట్సిన బోయవాడు ఆర్హుడైవచ్చినప్పుడు ఆకపోతరాజు బోయవానికి శరణమీయలేదా! (కపోత కపోతి కథ చూడండి) అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాధలు గానం చేశాడు:

దీనుడై ప్పార్భించుచు శ్రణుజొచ్చిన శత్తువునైనా చంపకూడదు. సజ్బనుడు తన ప్పాణాలసైతం ఇచ్చి శరణార్చి ఐన శత్రువు నైనా కాపాడతాడు”. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు “ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్పాణులనుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం.

అతడే సితిలోనున్నను ఏ ఉద్చేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను”. ఎక్కడా కనీ వినీ ఎజుగని ధర్మజ్నతను శ్రీ రాముని లో చూసి వానరులు “శ్రీ రామ చంద్ర, మూర్తి కీ జై” అని జయజయ ధ్వానాలు చేశారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం గృహధర్మం కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండచ్చు. కానీ వ్రతం (నియమం) అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టమ్‌. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన ప్రతనియమం పాటిస్తూ శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట
  2. ఇదే సందేశం ధర్మరాజు కూడా ఇస్తాడు: ఒక సారి పరమసాధ్వి ఐన ద్వౌపదీ దేవి రాజసూయయాగం చేసి రాజులచే జీ జీ లందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది “స్వామీ! మీరు ధర్మంకోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్స మీకేమి వచ్చింది”? భారతీయుని హృదయాన్ని వ్యక్తపజుస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు:
  3. “ద్హాపదీ! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతే కాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినౌతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు పురుషాధముడు”. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీ రాముడు ధర్మరాజు మనకి చెప్పారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment