వత్సాసుర భంజనమ్ – Vatsasura Bhanjanam | శ్రీ గర్గభాగవతము లోని కథ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్ కథ. 

శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్

బలరామకృష్ణులకు గోవులనుగాచే వయస్సు వచ్చినది. నీలాంబరధారి అయిన బలరాముడు పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు గోవులను చక్కగా అలంకరించి గోపాలురతో కలిసి పచ్చిక బయళ్ళలో విహరించుచుండేవారు. కాళిందీనదీ తీరము వారికి ప్రియమైన విహారస్థలమయ్యెను. తన మధుర వేణుగానముతో పరమాత్మ జీవులకు సామవేద సారాన్ని బోధించేవాడు. బ్రహ్మానందముతో గోవులు గోపబాలురు పశుపక్షాదులు ఆ వేదవేద్యుని వేణుగానం వినుచుండెడివి. శ్రీకృష్ణుడు గోపాలురు ఎన్నో ఆటాలాడేవారు. వారు పక్షులనీడలలో పఱుగులెట్టేవారు. నెమళ్ళ లేళ్ళ గుంపుల వెంటబడేవారు. కోతికొమ్మంచులు బిళ్ళంగోళ్ళు ఆడేవారు. యమునా నదిలో జలకాలాడేవారు.

ఒకసారి వారు వివిధ జంతువులను అనుకరిస్తూ ఆడుచుండగా కంసప్రేరితుడైన వత్సాసురుడు వచ్చి శ్రీకృష్ణుని ఆలమందలో కలిసి పోయాడు. సర్వజ్ఞుడైన స్వామి అదిగమనించాడు. మెల్లమెల్లగా వచ్చి ఆ వత్సాసురుడు పరమాత్మను తన్నాడు. నందకిశోరుడు వాడి కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగచెట్టుకేసి కొట్టాటు. మృతినొందిన ఆ వత్సాసురుడి నుంచి తేజము బయటికి వచ్చి పరమాత్మలో కలిసిపోయింది.

Vatsasura Bhanjanam Story In English

వత్సాసురుని వృత్తాంతము:

మురాసురుడనే రాక్షసుని కుమారుడు ప్రమీలుడు. వాడు దురాశకులోనై కపటవిప్రవేషం ధరించి సర్వాభీష్టఫలదాయిని అయిన నందినీధేనువును తనకు దానమిమ్మని వసిష్ఠుని కోరినాడు. నందినీధేనువు వాడి కుటిలత్వం గ్రహించి అసురస్వభావము గల లేగదూడవు కమ్మని శపించింది. పశ్చాత్తాపముతో శరణువేడిన ప్రమీలుని కరుణించి ఆ నందిని “చేసిన పాపమునకు ఫలమనుభవించక తప్పదు. పాపము తీరిన తరువాత నా అనుగ్రహము వలన నీవు పరమాత్మ చేతిలో మరణిస్తావు. అలా ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించింది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

కుటిలత్వము ఉండరాదని మనకీ కథ ద్వారా తెలిసినది. కపటవేషము వేసి మోసగించబోయిన ప్రమీలుని శపించినది నందినీధేనువు. కావున ఇతరుల నెన్నడూ మోసం చేయరాదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment